Top Ten News @ 1 PM: ఈనాడు.నెట్‌లో టాప్‌ 10 వార్తలు

ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం...

Updated : 06 Aug 2023 13:11 IST

1. ఆ ఐదు నదులను అనుసంధానం చేస్తే నీటికష్టాలు ఉండవు: చంద్రబాబు

సాగునీటి రంగంలో వైకాపా ప్రభుత్వ విధానాల వల్ల ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని తెదేపా అధినేత చంద్రబాబు ధ్వజమెత్తారు. ఐదు ప్రధాన నదులు గోదావరి, కృష్ణా, పెన్నా, నాగావళి, వంశధారలను అనుసంధానం చేస్తే రాష్ట్రానికి నీటికష్టాలు ఉండవని.. సిరులు పండించవచ్చని వ్యాఖ్యానించారు. సాగునీటి ప్రాజెక్టుల సందర్శనలో భాగంగా ఉమ్మడి నెల్లూరు జిల్లాలో ఆయన పర్యటిస్తున్నారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

2. ప్రాణాన్ని కాపాడుకోవాలని.. రైల్వే వంతెనపై నుంచి దూకిన కార్మికుడు

ప్రాణాలను కాపాడుకోవడానికి ఓ కార్మికుడు రైల్వే వంతెనపై నుంచి నదిలోకి దూకిన ఘటన బిహార్‌లోని (Bihar) సహర్సా జిల్లాలో జరిగింది. రైల్వే పట్టాలపై అశోక్ అనే కార్మికుడు పనిచేస్తుండగా ఒక్కసారిగా రైలు (Train) రావడంతో బాగ్‌మతీ నదిలోకి దూకి ప్రాణాలు కాపాడుకున్నాడు. ఇది గమనించిన స్థానికులు వెంటనే అప్రమత్తమై అతడిని కాపాడారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

3. భారత్‌కు అంతకు మించిన ఆనందం మరోటి లేదు: అజిత్ డోభాల్‌

చర్చలు, దౌత్య మార్గాల ద్వారానే సమస్యలు పరిష్కరించుకోవాలనేది భారత్‌ విధానమని జాతీయ భద్రతా సలహాదారు అజిత్ డోభాల్‌ (Ajit Doval) అన్నారు. శాంతిని నెలకొల్పేందుకు ఇదే సరైన మార్గంగా భారత్ విశ్వసిస్తోందని చెప్పారు. ఉక్రెయిన్‌ అంశంపై వివిధ దేశాలకు చెందిన జాతీయ భద్రతా సలహాదారుల సమావేశం సౌదీ అరేబియాలోని జెడ్డాలో జరిగింది. సౌదీ యువరాజు మహ్మద్‌ బిన్‌ సల్మాన్‌ చొరవతో ఏర్పాటు చేసిన ఈ సమావేశంలో 42 దేశాలకు చెందిన ప్రతినిధులు పాల్గొన్నారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

4. ఇండిగో విమానంలో ఏసీ బంద్‌.. చెమట తుడుచుకోవటానికి టిష్యూలు

ప్రముఖ విమానయాన సంస్థ ఇండిగో (IndiGo) విమానంలో ప్రయాణికులకు చేదు అనుభవం ఎదురైంది. ఎయిర్‌ కండిషన్‌ (AC) ఆన్‌కాకముందే విమానం గాల్లోకి ఎగిరింది. దీంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. దీనికి సంబంధించిన వీడియోను పంజాబ్ ప్రదేశ్‌ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు అమరీందర్ సింగ్ రాజా వారింగ్ శనివారం సోషల్‌మీడియాలో పంచుకున్నారు.పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

5. ఈ నాలుగే సెమీస్‌కు.. టీమ్‌ఇండియాలో ఆ సీనియర్‌ ఉండాల్సిందే: మాజీ క్రికెటర్లు

స్వదేశంలో జరగనున్న వన్డే ప్రపంచకప్‌ (ODI World Cup 2023) కోసం రోహిత్ శర్మ నాయకత్వంలోని భారత్‌ సిద్ధమవుతోంది. యువకులతో కూడిన జట్టుతో ప్రయోగాలు చేస్తున్న సంగతి తెలిసిందే. పదేళ్ల నుంచి ఐసీసీ ట్రోఫీ కోసం నిరీక్షిస్తున్న టీమ్‌ఇండియా (Team India) ఈసారి మాత్రం వచ్చిన అవకాశాన్ని వదులుకోకూడదని భావిస్తోంది. అయితే, సీనియర్‌ ఆటగాడు శిఖర్ ధావన్‌ తప్పకుండా జట్టులో ఉండాలని పాక్‌ మాజీ కెప్టెన్ సల్మాన్ భట్ అభిప్రాయపడ్డాడు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

6. ఎడతెగని ఉత్కంఠ.. ఆర్టీసీ బిల్లుపై చర్చకు అధికారులకు సమయమిచ్చిన గవర్నర్‌

ఆర్టీసీ కార్మికులను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించే బిల్లుపై ఉత్కంఠ కొనసాగుతోంది. బిల్లుపై చర్చించేందురు గవర్నర్‌ తమిళిసై అధికారులకు సమయం ఇచ్చారు. ఆదివారం మధ్యాహ్నం 12.30 గంటలకు ఆర్‌ అండ్‌ బీ కార్యదర్శి, అధికారులతో గవర్నర్‌ సమావేశం కానున్నారు. మరోవైపు సభాపతి పోచారంతో సమావేశమైన రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్‌.. ఈ బిల్లు విషయమై చర్చించారు. గవర్నర్‌ అనుమతిస్తే శాసనసభలో బిల్లు ప్రవేశపెట్టేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉంది.పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

7. ఇంటికి వెళ్లేందుకు మిన్హజ్‌ జైదీకి భారత కాన్సులేట్‌ ఆఫర్‌..!

అమెరికా(USA)లోని షికాగో వీధుల్లో నిస్సహాయంగా ఉన్న హైదరాబాద్‌ (Hyderabad)కు చెందిన యువతి సయ్యదా లులు మిన్హజ్‌ జైదీని ఇంటికి చేర్చేందుకు శనివారం భారత  కాన్సులేట్‌ జనరల్‌ ప్రయత్నాలు మొదలుపెట్టింది. ఆమెకు అవసరమైన వైద్యసాయం, భారత్‌ (India) వెళ్లేందుకు అవసరమైన ఏర్పాట్లు చేసేందుకు సంసిద్ధత వ్యక్తం చేసింది. ప్రస్తుతం ఆమె ఆరోగ్యంగానే ఉందని భారత దౌత్యవర్గాలు వెల్లడించాయి. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

8. కాగ్‌ నివేదికను శాసనసభలో ప్రవేశపెట్టిన ప్రభుత్వం

తెలంగాణ ఆర్థిక స్థితిగతులపై కంప్ట్రోలర్‌ అండ్‌ ఆడిటర్‌ జనరల్‌ (కాగ్‌) రూపొందించిన నివేదికను రాష్ట్ర ప్రభుత్వం శాసనసభలో ప్రవేశపెట్టింది. 2021-22 ఆర్థిక సంవత్సరం అకౌంట్స్‌, ఫైనాన్స్‌ అకౌంట్స్‌పై కాగ్‌ నివేదించింది. నీటిపారుదల, వైద్యారోగ్యం, పంచాయతీరాజ్‌ శాఖలకు 30శాతం అధికంగా ఖర్చు చేసిందని తెలిపింది. గృహ నిర్మాణం, పరిశ్రమల శాఖల కేటాయింపు కంటే తక్కువగా ఖర్చు చేసిందని పేర్కొంది.  11గ్రాంట్లకు రూ.75వేల కోట్లు అధికంగా వ్యయం చేసిందని వివరించింది.పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

9. తెలుగు రాష్ట్రాల్లో 39 రైల్వేస్టేషన్ల అభివృద్ధికి ప్రధాని శంకుస్థాపన

దేశ రైల్వే చరిత్రలో సరికొత్త అధ్యాయానికి శ్రీకారం చుట్టామని ప్రధానమంత్రి మోదీ అన్నారు. అమృత్‌ భారత్‌ పథకం కింద దేశంలోని 508 రైల్వేస్టేషన్ల పునరభివృద్ధి పనులకు ప్రధాని వర్చువల్‌గా శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మోదీ మాట్లాడారు. ‘‘రైల్వే స్టేషన్ల వద్ద షాపింగ్‌ కాంప్లెక్స్‌, గేమింగ్‌ జోన్‌లు ఏర్పాటు చేయనున్నాం. అభివృద్ధి చేశాక ఈ స్టేషన్లు మల్టీ మోడల్ హబ్‌గా మారతాయి. అభివృద్ధి దిశగా దేశం పరుగులు పెడుతోంది’’ అని అన్నారు.పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

10. TANA: తానా ఫౌండేషన్‌ ఛైర్మన్‌గా శశికాంత్‌

తానా ఫౌండేషన్‌ ఛైర్మన్‌గా కృష్ణా జిల్లా గుడివాడకు చెందిన వల్లేపల్లి శశికాంత్‌ ఎన్నికయ్యారు. శశికాంత్‌ ప్రస్తుతం అమెరికాలోకి బోస్టన్‌లో స్థిరపడ్డారు. కొవిడ్‌ సమయంలో తెలుగు రాష్ట్రాల్లో ఆయన అనేక సేవా కార్యక్రమాలు చేపట్టారు. గుడివాడలో రోటరీక్లబ్‌ ద్వారా, వ్యక్తిగతంగా లక్షలాది రూపాయలు వెచ్చించి కార్యక్రమాలు నిర్వహించారు. శశికాంత్‌ తండ్రి దివంగత రాజదర్బార్‌ మోహన్‌రావు గుడివాడ పట్టణ ప్రజలకు సుపరిచితులు.పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని