Top Ten News @ 5 PM: ఈనాడు.నెట్‌లో టాప్‌ 10 వార్తలు

Top News in Eenadu.net: ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం...

Updated : 17 Jun 2023 17:13 IST

1. తెలుగు రాష్ట్రాల్లో మరో రెండ్రోజులు తీవ్ర వడగాలులు..!

ఆంధ్రప్రదేశ్‌లో హీట్ వేవ్ పరిస్థితులు కొనసాగుతున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా 478 మండలాల్లో వడగాలులు వీస్తున్నాయి. పార్వతీపురం మన్యంలో 44.87 డిగ్రీలు, విజయనగరంలో 44, అనకాపల్లిలో 43.9, అల్లూరిలో 42.7, తూర్పుగోదావరిలో 42.5, ఏలూరులో 42.2, ఎన్టీఆర్‌లో 41.9, విశాఖపట్నంలో 41.3, గుంటూరులో 41, బాపట్లలో 41, పలనాడులో 41 డిగ్రీల గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయని అమరావతి వాతావరణ కేంద్రం ఓ ప్రకటనలో పేర్కొంది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

2. మద్యం అమ్మకాలు నియంత్రించి జగన్‌ బ్రాండ్లను తరిమికొడతాం: లోకేశ్‌

తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ చేపట్టిన యువగళం పాదయాత్ర 129వ రోజుకి చేరింది. శనివారం నెల్లూరు జిల్లా కలువాయి మండలంలో పాదయాత్ర కొనసాగింది. ఈ సందర్భంగా యానాదులతో లోకేశ్‌ ముఖాముఖి నిర్వహించారు. యానాదులు జీవితమంతా కష్టపడుతూనే ఉంటారని ఆవేదన వ్యక్తం చేశారు. తెదేపా ప్రభుత్వంలో వారికోసం అనేక సంక్షేమ కార్యక్రమాలు అమలు చేశామని గుర్తు చేశారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

3. అమర్నాథ్‌ కుటుంబంలో ఒకరికి ఉద్యోగం, రూ.10లక్షలు సాయం: రేపల్లె ఆర్డీవో

బాపట్ల జిల్లా ఉప్పలవారిపాలెంలో పదో తరగతి విద్యార్థి అమర్నాథ్‌పై పెట్రోల్‌ పోసి నిప్పంటించిన ఘటన తీవ్ర కలకలం సృష్టించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో బాధిత కుటుంబానికి న్యాయం చేయాలంటూ రేపల్లె ఎమ్మెల్యే అనగాని సత్యప్రసాద్‌ చెరుకుపల్లి ఐలాండ్‌ సెంటర్‌ వద్ద రాస్తారోకో నిర్వహించారు. బాలుడి మృతదేహాన్ని రాజోలు తీసుకువస్తుండగా మార్గమధ్యంలో చెరుకుపల్లి వద్ద అడ్డుకుని ఆందోళన చేపట్టారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

4. 15 ఏళ్ల సీఈఓపై లింక్డ్‌ఇన్‌ బ్యాన్‌.. దుమ్మెత్తిపోస్తున్న నెటిజన్లు!

పాఠశాల చదువు పూర్తి చేసుకున్న అతగాడు.. ఏకంగా ఓ కంపెనీకి సీఈఓ అయ్యాడు. నలుగురికీ ఉపాధి కల్పించే స్థాయికి ఎదిగాడు. అలాంటి వ్యక్తికి వింత అనుభవం ఎదురైంది. ప్రముఖ జాబ్‌ సెర్చ్‌ వెబ్‌సైట్‌ లింక్డ్‌ఇన్‌ (LinkedIn) అతడిపై నిషేధం విధించింది. కారణం అతడి వయసు 15 ఏళ్లు కావడం! లింక్డ్‌ఇన్‌ నిబంధనల ప్రకారం ప్రొఫైల్‌ నిర్వహించాలంటే 16 ఏళ్లు ఉండాలట. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

5. ఆకస్మిక వరదలు.. చిక్కుకుపోయిన 2400 మంది పర్యాటకులు!

సిక్కిం (Sikkim)ను భారీ వర్షాలు కుదిపేస్తున్నాయి. మూడు రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో జనజీవనం అస్తవ్యస్తమైంది. ఆకస్మిక వరదల (Flash Floods) ధాటికి రోడ్లు కొట్టుకుపోయాయి. ఈ కారణంగా ఉత్తర సిక్కిం (North Sikkim) జిల్లాలోని లాచెన్- లాచుంగ్ ప్రాంతంలో 2,400 మందికిపైగా పర్యాటకులు చిక్కుకుపోయినట్లు అధికారులు వెల్లడించారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

6. వీల్‌ఛైర్‌ లేక.. కుమారుడిని స్కూటర్‌పై మూడో అంతస్తుకు తీసుకెళ్లిన తండ్రి

రాజస్థాన్‌లోని ఓ ఆసుపత్రిలో వీల్‌ఛైర్‌ అందుబాటులో లేకపోవడంతో ఓ తండ్రి గాయపడిన తన కుమారుడిని స్కూటర్‌పై ఎక్కించుకుని పై అంతస్తుకు తీసుకెళ్లాల్సి వచ్చింది. కోట జిల్లాలో గురువారం జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. కోట ప్రాంతానికి చెందిన మనోజ్‌ జైన్‌ వృత్తిరీత్యా న్యాయవాది. ఆయన కుమారుడికి ఇటీవల కాలు ఫ్రాక్చర్‌ అయ్యింది. కట్టు మార్పించేందుకు గత గురువారం స్థానిక ఎంబీఎస్‌ ఆసుపత్రికి తీసుకొచ్చారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

7. పాఠశాలలో మారణహోమం.. 38 విద్యార్థులు సహా 41 మంది మృతి!

ఉగాండా (Uganda)లో దారుణం చోటుచేసుకుంది. కాంగో (Congo) సరిహద్దు సమీపంలో ఉన్న ఎంపాండ్వే పట్టణంలోని ఓ పాఠశాలపై సాయుధ తిరుగుబాటుదారులు జరిపిన దాడి (Attack On School)లో 38 మంది విద్యార్థులు సహా 41 మంది మృతి చెందారు. మరికొందరు తీవ్రంగా గాయపడ్డారు. అలయిడ్‌ డెమొక్రటిక్‌ ఫోర్సెస్‌ (ADF)కు చెందినవారే ఈ ఘాతుకానికి పాల్పడినట్లు పోలీసులు వెల్లడించారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

8. చైనాలో కొత్త ట్రెండ్‌.. లక్షల జీతాన్ని వదులుకొని..!

చేస్తున్న ఉద్యోగం వీడాలంటే ఒకటికి రెండుసార్లు ఆలోచిస్తాం. కానీ.. ఈ విషయంలో చైనా(China)లో కొత్త ధోరణి కనిపిస్తోంది. అక్కడి యువత (Chinese Youth) పెద్దమొత్తంలో జీతం అందుకుంటున్నా సరే.. సునాయాసంగా వైట్‌కాలర్(White collar Jobs) ఉద్యోగాలను వదులుకుంటుందట. వాటి స్థానంలో వెయిటర్స్‌, చెఫ్స్‌, క్లీనర్స్‌గా మారిపోతున్నారట. ఈ మేరకు కొన్ని వార్తా కథనాలు వెల్లడించాయి. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

9. రూ.88 వేల కోట్ల విలువైన రూ.500 నోట్లు ఏమైనట్లు?

దాదాపు రూ.88,032.5 కోట్ల విలువైన రూ.500 నోట్లకు సంబంధించిన సమాచారం ఆర్‌బీఐ వద్ద లేదని తెలుస్తోంది. సమాచార హక్కు చట్టం ప్రకారం మనోరంజన్‌రాయ్‌ అనే సామాజిక కార్యకర్త దరఖాస్తు చేయగా ఈ విషయం బయటపడింది. పాతనోట్లను రద్దు చేసి, కొత్త రూ.500 నోట్లను తీసుకొచ్చిన సమయంలో దేశంలోని 3 ముద్రణాలయాల నుంచి 8,810.65 మిలియన్ల రూ.500 నోట్లను ముద్రించారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

10. ఆ గ్యాంగ్‌స్టర్‌ను చంపితే రూ.20లక్షలు ఇస్తామని.. రూ.8వేలే చేతిలో పెట్టి..

ఉత్తర్‌ప్రదేశ్‌(Uttar Pradesh)లోని లఖ్‌నవూ కోర్టు ఆవరణలో పట్టపగలు అందరూ చూస్తుండగా గ్యాంగ్‌స్టర్‌ సంజీవ్‌ మహేశ్వరి జీవాను మరో దుండగుడు కాల్చి చంపిన ఘటన సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. కాల్పుల అనంతరం నిందితుడు విజయ్‌ యాదవ్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇప్పుడు విచారణలో భాగంగా అతడు ఆసక్తికర విషయం వెల్లడించాడు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని