Top Ten News @ 9 AM: ఈనాడు.నెట్‌లో టాప్‌ 10 వార్తలు

ఈనాడు.నెట్‌లోని పది ముఖ్యమైన వార్తలు..

Updated : 13 Apr 2023 09:01 IST

1. 218, 222 రూట్లలో.. ఏసీ డబుల్‌ డెక్కర్లు

హైదరాబాద్‌ నగర ప్రజలు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న 10 డబుల్‌డెక్కర్‌ ఏసీ బస్సులు మరో 5 నెలల్లో గ్రేటర్‌ జోన్‌కు సమకూరనున్నాయి. అయితే ఇవి ఆగస్టు - సెప్టెంబరు మధ్య 5, ఏడాది చివరిలో మరో 5 రానున్నాయని ఉన్నతాధికారులు చెబుతున్నారు. ఇందుకోసం ప్రధాన రహదారులను ఇప్పటికే విస్తరించారు. యూటర్న్‌లు లేని మార్గాలనే ఈ డబుల్‌డెక్కర్‌ బస్సులకు వినియోగించనున్నామన్నారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

2. సమాచారానికి రూపునిచ్చే.. క్విక్‌సైట్‌!

గుట్టలకొద్దీ డేటా.. వివిధ మార్గాల నుంచి   వచ్చి పడుతూనే ఉంటుంది.. దాన్ని సరైన పద్ధతిలో విశ్లేషించడం, భద్రంగా నిల్వ చేయడం సవాలే! ఆ పనిని చాలా సులభంగా, వేగంగా, ప్రభావవంతంగా చేస్తుంది ‘క్విక్‌సైట్‌’. నేటి మార్కెట్‌లో ఇది డిమాండ్‌ ఉన్న డేటా మేనేజింగ్‌ టూల్‌. బిజినెస్‌ ఇంటెలిజెన్స్‌లో దీన్ని అధికంగా ఉపయోగిస్తున్నారు. ఈ అప్లికేషన్‌ను నేర్చుకోవడం కొత్త ఉద్యోగావకాశాలకు  బాటలు వేస్తుంది! పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

3. కోరుట్ల గులాబీలకు కేటీఆర్‌ ఫిదా

కోరుట్ల పట్టణ ప్రగతి నర్సరీలో మొక్కలు పెంచి పంపకానికి సిద్ధంగా ఉంచిన 22 వేల వివిధ రకాల గులాబీ మొక్కల చిత్రాలను చూసి మున్సిపల్‌ శాఖ మంత్రి కేటీఆర్‌ ముగ్ధులయ్యారు. తన వ్యక్తిగత ట్విటర్‌ ఖాతాలో నర్సరీలోని నాలుగు ఫొటోలను పోస్ట్‌ చేశారు. ఈ అందమైన ఫొటోలు ఎక్కడి నుంచి వచ్చాయో ఊహించండి అంటూ నెటిజన్లను నేరుగా ప్రశ్నించారు. జగిత్యాల జిల్లా కోరుట్ల పురపాలక సంఘం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న నర్సరీలో విరబూసిన గులాబీలంటూ తానే సమాధానం ఇచ్చారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

4. ఎండ సుర్రున.. మీటర్‌ గిర్రున!

గత కొద్దిరోజులుగా ఎండలు సుర్రుమంటున్నాయి. ఉమ్మడి జిల్లాలో గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. భానుడి తాపానికి భయపడి అవసరముంటే తప్ప ఇళ్ల నుంచి బయటకు రావడానికే భయపడుతున్నారు. మండే ఎండలు.. ఉక్కపోత నుంచి ఉపశమనం కోసం ఏసీలను ఎక్కువగా వినియోగిస్తున్నారు. ఫ్యాన్‌లకు 24 గంటలూ పనిచెబుతున్నారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

5.  భానుడి ప్రతాపం.. పిల్లలపై ప్రభావం!

ఎండలు ముదిరాయి. నాలుగు రోజులుగా సూర్యుడు తన ప్రతాపాన్ని చూపుతున్నాడు. ఉదయం 10 గంటలకే వేడిగాలులు వీస్తున్నాయి. మరోవైపు పిల్లలకు వేసవి సెలవులు వచ్చాయి. ఆడుకోవడానికి బయటకు వెళ్తుంటారు. తల్లిదండ్రులు అప్రమత్తంగా ఉండాలని.. ఉదయం 10 నుంచి సాయంత్రం 6 గంటల వరకు పిల్లలను ఇంటి నుంచి బయటకు వెళ్లనివ్వొద్దని వైద్యులు చెబుతున్నారు. తప్పనిసరైతే కనీస జాగ్రత్తలు తీసుకోవాలని.. లేకపోతే వడదెబ్బతో పాటు ఇతర వ్యాధులకు గురయ్యే ప్రమాదముందని హెచ్చరిస్తున్నారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

6. బ్యాంకు ఖాతాల్లోకి బూచోళ్లు

నరసరావుపేట మండల పరిషత్తు కార్యాలయ ఉద్యోగి ఒకరు తన కుటుంబ సభ్యులను హైదరాబాద్‌ పంపించేందుకు ఇటీవల చరవాణిలో ఆన్‌లైన్‌ టికెట్‌ బుక్‌ చేసుకుంటున్నారు. బస్సు సీటు రిజర్వేషన్‌ ఓకే చేస్తున్న క్రమంలో సర్వర్‌ స్తంభించింది. క్షణాల్లో కస్టమర్‌ కేర్‌ నుంచి వచ్చిన కాల్‌ సూచనతో వారు పంపిన లింక్‌ను ఓపెన్‌ చేశారు. అంతే ఖాతాలో రూ.49వేలు ఉపసంహరించినట్లు సంక్షిప్త సమాచారం వచ్చింది. విషయం గ్రహించేలోపు ఇంకో ఖాతాలో రూ.30 వేలు తీశారు. క్రెడిట్‌ కార్డుల యాప్‌ను బ్లాక్‌ చేసి మిగతా సొమ్ము పోకుండా నిలువరించుకున్నారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

7. అచ్చెరువొందేలా.. 50 మినీ ట్యాంక్‌ బండ్లు

రాజధాని పరిధిలో 50 చెరువులను పర్యాటక ప్రాంతాలుగా మార్చాలని సర్కార్‌ నిర్ణయించింది. ఇందులో భాగంగా తటాకాల వద్ద పచ్చదనం పెంపొందించడంతోపాటు బోటింగ్‌ను ఏర్పాటు చేయనున్నారు. ఒక్కో కాసారాన్ని అభివృద్ధి చేసే బాధ్యతను ఒక్కో ప్రైవేటు కంపెనీకి అప్పగించారు. సంబంధిత సంస్థలు కార్పొరేట్‌ సామాజిక బాధ్యత కింద ఈ పనులను చేపట్టబోతున్నాయి. వర్షాకాలం నాటికి చెరువు కట్టలను పూర్తిస్థాయిలో పటిష్ఠం చేయాలంటూ సంబంధిత సంస్థలను సర్కార్‌ ఆదేశించింది. ఈ మొత్తం ప్రాజెక్టుకు రూ.250 కోట్ల వరకు వ్యయం చేసే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

8. వేకువనే మేలుకోవడం మీకు అలవాటా?

ఆలస్యంగా నిద్రపోవడం, పొద్దెక్కాక గానీ లేవకపోవడం చాలామంది విద్యార్థుల అలవాటు. కానీ త్వరగా నిద్రకు ఉపక్రమించి తెల్లవారుజామునే మేలుకోవడం వల్ల ఎన్నో ప్రయోజనాలుంటాయి. పనులేవీ కావడంలేదనీ, అసలు సమయమే సరిపోవడం లేదని బాధపడాల్సిన పనే ఉండదు. టైమ్‌ చాలక ముఖ్యమైన పనులను వాయిదా వేయాల్సిన అవసరమూ ఉండదు. ఇవేకాకుండా మరెన్ని ఉపయోగాలు ఉన్నాయో చూద్దామా? పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

9. Indian Railway: మండే ఎండల్లో.. ‘చల్లగా’ ప్రయాణాలు.. రైళ్లలో ఏసీ బోగీలకు డిమాండ్‌

రైళ్లలో ఏసీ బోగీలకు డిమాండ్‌ పెరుగుతోంది. కొద్ది రోజులుగా ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి. వేడిమి నుంచి ఉపశమనం పొందేందుకు.. ముఖ్యంగా పగటివేళ, దూరప్రాంత ప్రయాణాలు చేసేవారు రైళ్లలో ఏసీ ప్రయాణానికి ప్రాధాన్యమిస్తున్నారు. దేశవ్యాప్తంగా ప్రధాన మార్గాల్లో తిరిగే రైళ్లలోని ఏసీ బోగీల్లో టికెట్లన్నీ అయిపోయి వెయిటింగ్‌ (నిరీక్షణ) జాబితా పెరుగుతోంది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

10. దివ్యాంగుల కోసం కింది బెర్తులు.. రైల్వే శాఖ ఏర్పాట్లు

దివ్యాంగుల సుఖ ప్రయాణానికి వారితోపాటు వారి సహాయకులకు ప్రత్యేకించి కింది బెర్తులను కేటాయించేందుకు రైల్వే శాఖ ఏర్పాట్లు చేస్తోంది. ఈ సౌకర్యం ఇప్పటికే వయోవృద్ధులు, ఒంటరి ప్రయాణం చేస్తున్న మహిళలు, చిన్న పిల్లలతో వెళుతున్న మహిళలకు రైల్వే శాఖ కల్పిస్తోంది. ప్రస్తుతం దివ్యాంగుల కోసం స్లీపర్‌ క్లాస్‌లో 4 బెర్తులు (రెండు లోయర్‌.. రెండు మిడిల్‌), థర్డ్‌ ఏసీలో ఒకటి లోయర్‌, ఒకటి మిడిల్‌.. 3ఈ క్లాస్‌లో ఒకటి లోయర్‌, ఒకటి మిడిల్‌ రిజర్వు చేస్తున్నారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని