Top Ten News @ 9 AM: ఈనాడు.నెట్‌లో టాప్‌ 10 వార్తలు

Top News in Eenadu.net: ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం...

Updated : 06 Jul 2023 09:11 IST

1. తొలుత ఎస్సై ఎంపికల జాబితా వెల్లడి

ఎస్సై, కానిస్టేబుళ్ల నియామక ప్రక్రియలో తుది ఎంపికల జాబితా వెల్లడికి సమయం ఆసన్నమైంది. తుది రాతపరీక్షలో ఎంపికైన వారిలో నుంచి 97,175 మంది అభ్యర్థులు ధ్రువీకరణపత్రాల పరిశీలనకు హాజరయ్యారు. వీరిలో నుంచే కటాఫ్‌ మార్కుల ఆధారంగా తుది ఎంపిక జాబితాను తయారు చేస్తారు. అయితే, మొదట ఎస్సైలుగా ఎంపికైన 579, ఏఎస్సైలుగా ఎంపికైన ఎనిమిది మంది జాబితాలను వెల్లడించాలని నిర్ణయించారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

2. ఆర్‌-5 జోన్‌లో ఇళ్ల నిర్మాణానికి ‘సుప్రీం’ అనుమతిచ్చిందా?

రాజధాని అమరావతిలో ఇతర ప్రాంతాల వారికి ఇళ్ల స్థలాలు ఇచ్చేందుకు ఏర్పాటు చేసిన ఆర్‌-5 జోన్‌లో పట్టాల పంపిణీకి మాత్రమే సుప్రీంకోర్టు అనుమతిచ్చిందా? లేదా ఇళ్ల నిర్మాణానికీ అనుమతి ఇచ్చిందా? అన్న దానిపై స్పష్టత ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. మరోవైపు ప్రభుత్వం అక్కడ ఇళ్లు కట్టబోతోందా? అన్న విషయాన్ని కూడా తెలపాలని పేర్కొంది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

3. పాలిసెట్‌లో తొలిసారి స్లైడింగ్‌ విధానం

పాలిటెక్నిక్‌ కళాశాలల్లో ఈ విద్యా సంవత్సరం నుంచి ఒక బ్రాంచిలో చేరిన విద్యార్థులు మరో బ్రాంచికి మారే స్లైడింగ్‌ ప్రక్రియను ప్రవేశపెట్టనున్నారు. కన్వీనర్‌ ఆధ్వర్యంలోనే ఈ నూతన ప్రక్రియను నిర్వహిస్తారు. ఇప్పటివరకు పాలిసెట్‌లో రెండు విడతల కౌన్సెలింగ్‌ నిర్వహించి, ఆ తర్వాత మిగిలిపోయిన సీట్లకు స్పాట్‌ కౌన్సెలింగ్‌ జరుపుతున్నారు. ఈసారి రెండు విడతల కౌన్సెలింగ్‌ ముగిసిన తర్వాత అప్పటికే కళాశాలల్లో వివిధ కోర్సుల్లో చేరిన వారికి  స్లైడింగ్‌ నిర్వహిస్తారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

4. ఇక జీవో 111 పరిధిలో అభివృద్ధి

జీవో 111 ఎత్తివేత నేపథ్యంలో హైదరాబాద్‌ అంతటి మరో నగరాన్ని శివార్లలో నిర్మించొచ్చని పురపాలక, పరిశ్రమలు, ఐటీ శాఖల మంత్రి కేటీఆర్‌ పేర్కొన్నారు. ఇందుకు సంబంధించి రానున్న 15 రోజుల్లో మార్గదర్శకాలు రూపొందిస్తామని తెలిపారు.  పురపాలక శాఖలో తొమ్మిదేళ్లలో సాధించిన అభివృద్ధిపై ప్రగతి నివేదికను ఇక్కడి మెట్రోభవన్‌లో బుధవారం ఆయన ఆవిష్కరించారు.పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

5. ఎమ్మెల్యేపై సర్పంచి నవ్య ఆరోపణలపై ఆధారాలు లేవు!

ఎమ్మెల్యే టి.రాజయ్య తనను లైంగికంగా వేధింపులకు గురి చేశారని సర్పంచి నవ్య ఇచ్చిన ఫిర్యాదులో ఎలాంటి ఆధారాలు లేవని బుధవారం జాతీయ, రాష్ట్ర మహిళా కమిషన్‌కు నివేదిక ఇచ్చినట్లు స్థానిక పోలీసులు తెలిపారు. తనను రాజయ్య లైంగికంగా వేధింపులకు గురి చేశారని ఆరోపిస్తూ హనుమకొండ జిల్లా ధర్మసాగర్‌ మండలం జానకిపురం సర్పంచి కురుసపల్లి నవ్య మార్చి 10న విలేకర్ల సమావేశంలో ఆవేదన వ్యక్తం చేసిన విషయం తెలిసిందే.పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

6. అంతరిక్ష వ్యాపారంలో భారత్‌ ఆశ్చర్యపరిచే పోటీదారు!

భారతదేశ ప్రతిష్ఠాత్మక అంతరిక్ష కార్యక్రమంపై అమెరికాకు చెందిన ‘ది న్యూయార్క్‌ టైమ్స్‌’(ఎన్‌వైటీ) ప్రశంసల వర్షం కురిపించింది. అంతరిక్ష రంగంలో సాంకేతికతల అభివృద్ధికి ఏర్పాటైన అంకుర సంస్థల(స్టార్టప్స్‌) కృషిని ప్రత్యేకంగా ప్రస్తావించింది. ఓ విస్పోటం మాదిరిగా సాంకేతికాభివృద్ధి, నవోన్వేషణలు జరుగుతున్నాయని, త్వరలోనే చైనాకు ప్రధాన పోటీదారుగా మారగలదని పేర్కొంది.పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

7. వ్యక్తిగత డేటా పరిరక్షణకు బిల్లు

‘డిజిటల్‌ వ్యక్తిగత డేటా పరిరక్షణ బిల్లు (డీపీడీపీ)-2023’ ముసాయిదాను పార్లమెంటులో ప్రవేశపెట్టడానికి కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ప్రధాని నరేంద్రమోదీ అధ్యక్షతన బుధవారం జరిగిన కేబినెట్‌ సమావేశం ఈ నిర్ణయం తీసుకుంది. నిబంధనల్ని ఉల్లంఘించిన ప్రతిసారీ సంబంధిత సంస్థలు రూ.250 కోట్ల వరకు జరిమానా చెల్లించాల్సి ఉంటుందని ముసాయిదా పేర్కొంది.పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

8. అమెరికా పౌరసత్వ పరీక్ష కఠినతరం

అమెరికాలో పౌరసత్వం పొందదలచిన వారికి నిర్వహించే పరీక్షలో మార్పులు చేయబోతున్నారు. ఆంగ్ల భాషా పరిజ్ఞానం బాగా తక్కువగా ఉండే విదేశీ అభ్యర్థులకు ఇది అవరోధంగా పరిణమించవచ్చనే ఆందోళన వ్యక్తమవుతోంది. 2008లో తగు మార్పులు చేర్పులతో పౌరసత్వ పరీక్ష విధానాన్ని ఖరారు చేశారు. డోనాల్డ్‌ ట్రంప్‌ అధ్యక్షుడైన తరవాత 2020లో ఈ పరీక్షను మహా కఠినంగా మార్చి విదేశీ అభ్యర్థులను నిరుత్సాహపరిచారు.పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

9. 4న చరిత్రలోనే అత్యధిక సగటు ఉష్ణోగ్రత!

చరిత్రలోనే అత్యధిక సగటు ఉష్ణోగ్రత మంగళవారం (4వ తేదీన) నమోదైంది. వరుసగా 3, 4 తేదీల్లో (సోమ, మంగళ) ప్రపంచ సగటు ఉష్ణోగ్రతలు 17.01 డిగ్రీల సెల్సియస్‌ (62.6 డిగ్రీల ఫారన్‌హీట్‌), 17.18 డిగ్రీల సెల్సియస్‌గా (62.9 డిగ్రీల ఫారన్‌హీట్‌) నమోదయ్యాయి. ఇవి చరిత్రలోనే అత్యంత అధికమైనవి. అమెరికాలోని మైన్‌ విశ్వవిద్యాలయానికి చెందిన పరిశోధకులు ఈ విషయాన్ని తెలిపారు.పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

10. మదుపర్ల సంపద రూ.300 లక్షల కోట్లు

దేశీయ స్టాక్‌మార్కెట్లలో పెట్టుబడులు పెట్టిన మదుపర్ల సంపదగా పరిగణించే బీఎస్‌ఈలోని నమోదిత సంస్థల మార్కెట్‌ విలువ, చరిత్రలో తొలిసారిగా బుధవారం రూ.300 లక్షల కోట్లకు చేరింది. 2023లో ఇప్పటివరకు బీఎస్‌ఈలోని కంపెనీల మార్కెట్‌ విలువ రూపాయి, డాలర్‌ రూపేణ 6.6% పెరిగింది. బీఎస్‌ఈ, నిఫ్టీ సూచీలు 6 శాతానికి పైగా పెరిగాయి. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని