Top Ten News @ 9 AM: ఈనాడు.నెట్‌లో టాప్‌ 10 వార్తలు

ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం...

Published : 17 Aug 2023 09:00 IST

1. తిరుమలలో చిక్కిన మరో చిరుత

తిరుమలలో మరో చిరుత చిక్కింది. లక్ష్మీనరసింహస్వామి ఆలయం వద్ద ఏర్పాటు చేసిన బోనులో చిరుత చిక్కినట్లు అటవీశాఖ, తితిదే అధికారులు తెలిపారు. ఇటీవల అలిపిరి నడక మార్గంలో చిరుత దాడి చేయడంతో నెల్లూరు జిల్లాకు చెందిన ఆరేళ్ల బాలిక లక్షిత మృతిచెందిన విషయం తెలిసిందే.ఈ నేపథ్యంలో చిరుతను బంధించేందుకు నడక మార్గంలో మూడు ప్రాంతాల్లో బోన్లు ఏర్పాటు చేశారు.పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

2. విశాఖ- సికింద్రాబాద్‌ వందేభారత్‌ రద్దు

విశాఖపట్నం నుంచి సికింద్రాబాద్‌ వెళ్లాల్సిన వందేభారత్‌ ఎక్స్‌ప్రెస్‌(Vande Bharat Express)ను నేడు రద్దు చేసినట్లు రైల్వే అధికారులు తెలిపారు. గురువారం ఉదయం 5.45కి బయల్దేరాల్సిన రైలును సాంకేతిక కారణాలతో రద్దు చేసినట్లు చెప్పారు. ఈ అసౌకర్యానికి చింతిస్తున్నామన్నారు.పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

3. ప్రేమ పేరుతో వాలంటీరు మోసం

ప్రేమ పేరుతో ఓ యువతిని మోసం చేసి పరారైన ఓ వాలంటీరు ఉదంతం కాశినాయన మండలంలో బుధవారం వెలుగులోకి వచ్చింది. మండలంలోని ఓ గ్రామానికి చెందిన ఓ యువతి (22), మాచవరం చెన్నారెడ్డి గ్రామ వాలంటీర్లుగా పనిచేస్తున్నారు. వీరు మూడేళ్లుగా ప్రేమించుకుంటున్నారు. ఈ విషయం ఇరు కుటుంబాలకు తెలియడంతో మందలించారు.పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

4. కాంగ్రెస్‌ టికెట్‌ దరఖాస్తు రుసుం రూ.50 వేలు..!

వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌ టికెట్లు ఆశించే వారి నుంచి దరఖాస్తు రుసుం రూ.50 వేలు చొప్పున వసూలు చేయాలని పార్టీ యోచిస్తోంది. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులైతే రూ.25 వేలు చెల్లించేలా సడలింపు ఇవ్వాలని భావిస్తోంది. దీనిపై గురువారం సాయంత్రం అధికారికంగా ప్రకటించే అవకాశాలున్నాయి. అభ్యర్థుల ఎంపికకు పార్టీ ఉపకమిటీని ఏర్పాటు చేసింది.పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

5. వేడెక్కిన జనగామ రాజకీయం

జనగామ నియోజకవర్గ భారాస రాజకీయం వేడెక్కింది. స్థానిక ముఖ్యనేతలు కొందరు బుధవారం హైదరాబాద్‌లోని ఓ హోటల్‌లో సమావేశమవడం... ఎమ్యెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి సైతం నేరుగా వారి వద్దకే వెళ్లడం చర్చనీయాంశమైంది. వచ్చే ఎన్నికల్లో జనగామ నుంచి రైతుబంధు సమితి రాష్ట్ర అధ్యక్షుడు, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్‌రెడ్డికి టికెట్‌ కేటాయించాలని అధిష్ఠానాన్ని కోరడానికే... జనగామ, చేర్యాల ప్రాంతాలకు చెందిన భారాస నేతలు, పలువురు స్థానిక సంస్థల ప్రతినిధులు హైదరాబాద్‌ వచ్చినట్లు తెలుస్తోంది.పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

6. ఓరుగల్లు నుంచి ఎన్నికల శంఖారావం!

ఎన్నికల ప్రచారాన్ని భారాస ఓరుగల్లు నుంచి ప్రారంభించాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. ఈ మేరకు భారీ బహిరంగ సభను నిర్వహించేందుకు రంగం సిద్ధం చేస్తోంది. సీఎం కేసీఆర్‌ సహా గులాబీ నేతలంతా పాల్గొనే ఈ సభను అక్టోబరు 16న హనుమకొండ జిల్లా ఉనికిచర్ల ప్రాంతంలో జరిపేందుకు తేదీ ఖరారైంది. ఈ సభను ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించాలని అధిష్ఠానం నుంచి ఉమ్మడి వరంగల్‌ నేతలకు ఆదేశాలు వచ్చినట్లు సమాచారం.పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

7. ఇక పన్ను పోటే

ఎన్నికలొచ్చిన ప్రతిసారీ ఆస్తిపన్ను రాయితీలు ప్రకటించే జీహెచ్‌ఎంసీ.. తాజాగా ఆ రాయితీలకు కత్తెర వేస్తోంది. 2016 ఎన్నికల్లో రూ.1000 ఆస్తిపన్ను చెల్లిస్తోన్న భవనాలకు రూ.101కి తగ్గించింది. అనంతరం సునామీ సర్వే పేరుతో లబ్ధి పొందిన 1.33 లక్షల నిర్మాణాలను సర్వే చేసింది. సగానికిపైగా భవనాలు రాయితీకి అనర్హమని తేలాయి. పైగా వాటి పన్ను భారీగా పెరిగింది.పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

8. జాబిల్లి చుట్టూ ఏముందో తెలుసుకుందాం..

జాబిల్లి చుట్టూ ఏముందో తెలుసుకునేందుకు చంద్రయాన్‌-3 పేరుతో ఇస్రో పంపించిన వ్యోమనౌక విక్రమ్‌ ల్యాండర్‌.. ప్రజ్ఞాన్‌ రోవర్‌ల కదలికల సమాచారాన్ని నగరంలోని ప్లానెటరీ సొసైటీ ఆఫ్‌ ఇండియా ఎప్పటికప్పుడు అందించనుంది. చంద్రయాన్‌-3లో కీలకమైన ఆపరేషన్‌ ‘మూన్‌ బౌండ్‌ మానివర్‌’ను ఇస్రో శాస్త్రవేత్తలు బుధవారం పూర్తిచేశారు.పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

9. 10 రోజుల్లో ఏఈఈ మెరిట్‌ జాబితా

తెలంగాణలోని వివిధ ప్రభుత్వ విభాగాల్లో 1,540 అసిస్టెంట్‌ ఎగ్జిక్యూటివ్‌ ఇంజినీర్‌ (ఏఈఈ) పోస్టుల భర్తీకి కంప్యూటర్‌ బేస్డ్‌ రిక్రూట్‌మెంట్‌ టెస్ట్‌ (సీబీఆర్‌టీ) విధానంలో నిర్వహించిన పరీక్ష మెరిట్‌ జాబితా త్వరలోనే వెలువడనుంది. సివిల్‌ పోస్టులకు సంబంధించి పరీక్ష మార్కులను మాత్రం నార్మలైజేషన్‌ విధానంలో లెక్కించనున్నారు. ఈ నియామకాలకు సంబంధించి న్యాయవివాదం పరిష్కారమైన వారం, పది రోజుల్లోనే ఫలితాలను విడుదల చేసేందుకు కమిషన్‌ కసరత్తు ప్రారంభించింది.పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

10. రాష్ట్రపతి పాలనలో రాష్ట్రాన్ని కేంద్ర పాలిత ప్రాంతంగా విభజించొచ్చా?

రాష్ట్రపతి పాలన కొనసాగుతున్న సమయంలో జమ్మూకశ్మీర్‌ రాష్ట్రాన్ని రెండు కేంద్ర పాలిత ప్రాంతాలుగా విభజించొచ్చా...? అని బుధవారం సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం ప్రశ్నించింది. జమ్మూకశ్మీర్‌కు ప్రత్యేక హోదా కల్పించే అధికరణం 370 రద్దును సవాల్‌ చేస్తూ దాఖలైన పిటిషన్లపై వాదనల సందర్భంగా సీజేఐ జస్టిస్‌ డి.వై.చంద్రచూడ్‌ నేతృత్వంలోని ఐదుగురు సభ్యుల ధర్మాసనం ఈ ప్రశ్న లేవనెత్తింది.పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు