Vande Bharat Express: నేడు విశాఖ- సికింద్రాబాద్‌- విశాఖ వందేభారత్‌ రద్దు.. ప్రయాణికుల తీవ్ర అసంతృప్తి

విశాఖపట్నం నుంచి సికింద్రాబాద్‌ వెళ్లాల్సిన వందేభారత్‌ ఎక్స్‌ప్రెస్‌ (Vande Bharat Express)ను నేడు రద్దు చేసినట్లు రైల్వే అధికారులు తెలిపారు.

Updated : 17 Aug 2023 10:22 IST

విశాఖపట్నం (రైల్వేస్టేషన్‌): విశాఖపట్నం నుంచి సికింద్రాబాద్‌ వెళ్లాల్సిన వందేభారత్‌ ఎక్స్‌ప్రెస్‌(Vande Bharat Express)ను నేడు రద్దు చేసినట్లు రైల్వే అధికారులు తెలిపారు. గురువారం ఉదయం 5.45కి బయల్దేరాల్సిన రైలును సాంకేతిక కారణాలతో రద్దు చేసినట్లు చెప్పారు. ఈ అసౌకర్యానికి చింతిస్తున్నామన్నారు. వందేభారత్ రద్దు సమాచారాన్ని ఉదయం 5 గంటల నుంచి ప్రయాణికులకు చేరవేసినట్లు తెలిపారు. ప్రత్యామ్నాయంగా ఉదయం 7 గంటలకు మరో రైలును ఏర్పాటు చేశామని.. వందేభారత్‌ స్టాపుల్లోనే అది ఆగుతుందని తెలిపారు. వందేభారత్‌ రద్దుతో ప్రయాణికులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. 

సికింద్రాబాద్‌- విశాఖ వందేభారత్‌ కూడా..

మరోవైపు సికింద్రాబాద్‌ నుంచి ఇవాళ మధ్యాహ్నం 3 గంటలకు విశాఖ బయల్దేరాల్సిన వందేభారత్‌ కూడా రద్దయింది. సాంకేతిక కారణాలతో దాని స్థానంలో ప్రత్యామ్నాయ రైలును ఏర్పాటు చేస్తున్నట్లు దక్షిణ మధ్య రైల్వే ప్రకటించింది. దీనికి సంబంధించిన సమాచారాన్ని ఇప్పటికే ప్రయాణికులకు చేరవేశామని తెలిపింది. ఒకవేళ టికెట్‌ను రద్దు చేసుకుంటే ఆ మొత్తాన్ని పూర్తిగా రీఫండ్‌ చేస్తామని స్పష్టం చేసింది. వందేభారత్‌కు ప్రత్యామ్నాయంగా ఏర్పాటు చేసిన ఈ రైలులో వెళ్లే ప్రయాణికులకు టికెట్‌ ధరలో వ్యత్యాసం ఉన్న మొత్తాన్ని చెల్లిస్తామని తెలిపింది. వందేభారత్‌లో ఉండే విధంగానే ఈ రైలులోనూ క్యాటరింగ్‌ సదుపాయం కల్పిస్తామని పేర్కొంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని