Top 10 News @ 9 PM: ఈనాడు.నెట్‌లో టాప్‌ 10 వార్తలు

ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం...

Updated : 02 Jul 2023 21:02 IST

1. Rahul Gandhi: కాంగ్రెస్‌ అధికారంలోకి వస్తే వృద్ధులకు రూ.4వేలు పింఛను: రాహుల్‌గాంధీ

కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి వస్తే చేయూత పేరుతో వృద్ధులు, వితంతులకు రూ.4వేలు పింఛను ఇస్తామని కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీ ప్రకటించారు.  పోడుభూములన్నీ గిరిజనులకు పంపిణీ చేస్తామని హామీ ఇచ్చారు. మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి కాంగ్రెస్‌లో చేరిక, భట్టి పాదయాత్ర ముగింపు సందర్భంగా ఖమ్మంలో నిర్వహించిన తెలంగాణ జనగర్జన సభలో రాహుల్‌గాంధీ ముఖ్యఅతిథిగా పాల్గొని ప్రసంగించారు. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి

2. Viveka Murder: వివేకా హత్యకేసులో కీలక పరిణామం.. సుప్రీంకోర్టును ఆశ్రయించిన దస్తగిరి

మాజీ మంత్రి వైఎస్‌ వివేకానందరెడ్డి హత్యకేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఆర్థిక స్థోమత లేనందున న్యాయసహాయం కల్పించాలంటూ దస్తగిరి సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఈమేరకు సుప్రీంకోర్టు లీగల్‌సెల్‌ సర్వీసెస్‌ కమిటీకి విజ్ఞాపన పంపారు. వివేకా హత్య కేసులో తనను బాధితుడిగా పరిగణించాలంటూ ఆయన వ్యక్తిగత సహాయకుడు కృష్ణారెడ్డి  సుప్రీంకోర్టులో పిటిషన్‌ వేశారు. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి

3. రేపే కేంద్ర మంత్రివర్గం భేటీ.. మంత్రివర్గంలోకి ఫడణవీస్‌, పలువురు కీలక నేతలు..?

కేంద్ర మంత్రివర్గంలో త్వరలోనే కీలక మార్పులు చేసుకుంటాయనే వార్తలు వినిపిస్తున్నాయి. ముఖ్యంగా వచ్చే ఏడాదిలో జరిగే సార్వత్రిక ఎన్నికలతోపాటు పలు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని కేంద్ర కేబినెట్‌లో పలువురికి అవకాశం కల్పించనున్నారనే ఊహాగానాలు వెలువడుతున్నాయి. ఈ క్రమంలోనే సోమవారం ప్రధాని మోదీ అధ్యక్షతన జరగనున్న కేంద్ర కేబినెట్‌ భేటీపై ఆసక్తి నెలకొంది. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి

4. Ajit Pawar: బాబాయ్ బాటలో నడిచి.. రెండుసార్లు తిరుగుబాటు చేసి..!

మహారాష్ట్ర డిప్యూటీ సీఎం ఎన్సీపీ నేత, అజిత్‌ పవార్‌ ప్రమాణ స్వీకారం చేయడం అక్కడి రాజకీయాలను మరోసారి కుదిపేసింది. ఎన్సీపీ అధినేత శరద్‌ పవార్‌ బాటలో నడిచిన అజిత్‌.. కొంతకాలంగా ఆయనకు ఎదురుతిరుగుతున్న సందర్భాలు రాష్ట్ర రాజకీయాల్లో ఆసక్తి రేపుతున్నాయి. 2019లో భాజపాతో చేతులు కలిపిన విధంగానే.. అజిత్‌ పవార్‌ మరోసారి తిరుగుబాటు ఫార్ములాను ప్రయోగించి సంచలనం సృష్టించారు. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి

5. Maharashtra Politics: ‘మహా’ రాజకీయాల్లో ట్విస్టులే ట్విస్టులు

మహారాష్ట్ర రాజకీయాలు (Maharashtra Politics) చదరంగాన్ని తలపిస్తున్నాయి. ఎప్పుడు ఏం జరుగుతుందో ఊహించలేనంతగా కీలక మార్పులు చోటు చేసుకుంటున్నాయి. ఏ పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తోందో, ఎప్పుడు కుప్పకూలిపోతుందో తెలియని పరిస్థితులు ఏర్పడుతున్నాయి. తాజాగా ప్రతిపక్ష ఎన్సీపీ (NCP) కూడా అదే బాటలో పయనిస్తోంది. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి

6. NIA: వారందర్నీ అండమాన్‌జైలుకు తరలించండి: ఎన్ఐఏ

ఉత్తరభారతదేశంలోని వివిధ జైళ్లలో శిక్ష అనుభవిస్తున్న కొందరు నేరగాళ్లను అండమాన్‌ కేంద్ర కారాగారానికి తరలించాలని కోరుతూ ఎన్‌ఐఏ కేంద్ర హోం మంత్రిత్వ శాఖకు లేఖ రాసింది. ముఖ్యంగా దిల్లీలోని తీహాడ్‌ జైలులో శిక్ష అనుభవిస్తున్న 10 నుంచి 12 మంది నేరగాళ్లను వీలైంత త్వరగా అండమాన్‌కు పంపాలని లేఖలో కోరింది. కొందరు నేరస్థులు జైల్లోనే ఉంటూ..గ్యాంగ్‌లు నిర్వహిస్తున్నట్లు ఎన్‌ఐఏ పేర్కొంది. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి

7. రణ్‌వీర్‌ - దీపిక - రామ్‌చరణ్‌ పవర్‌ప్యాక్డ్‌ వైరల్‌ వీడియో.. యాడ్‌ కోసమేనా..?

తెలుగు, హిందీ చిత్ర పరిశ్రమలకు చెందిన స్టార్‌ సెలబ్రిటీలను ఒకే స్క్రీన్‌పై చూడటానికి సినీ ప్రియులు ఎప్పుడూ ఆసక్తి కనబరుస్తుంటారు. ఇప్పుడు అలాంటి క్రేజీ కాంబోకు సంబంధించిన ఓ వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. ఇంతకీ ఆ వీడియోలో ఏం ఉంది? ఏయే స్టార్స్‌ అందులో కనిపించారు? పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి

8. FlashBack: ఒకే ఓవర్‌లో 35.. బుమ్రా అంటే బౌలరే కాదు.. స్టాండ్స్‌లో పడే పిడుగు కూడా!

టెస్టు బ్యాటింగ్‌లో రికార్డులు బ్యాటర్ల పేరుపైనే కాదు.. బౌలర్ల పైనా ఉంటాయని స్టాండ్స్‌లో బంతి పడేలా చెప్పాడు టీమిండియా పేసర్‌ జస్ప్రీత్‌ బుమ్రా (Jasprit Bumrah). సరిగ్గా ఏడాది కిందట ఇదే రోజు (జులై 2). ఎడ్జ్‌బాస్టన్‌లో ఇంగ్లండ్‌తో సిరీస్‌లో భాగంగా ఐదో టెస్టు ఆడింది భారత్‌. రెండో రోజు 377 పరుగులకు 9 వికెట్లు కోల్పోవడంతో.. బుమ్రా క్రీజ్‌లో అడుగుపెట్టాడు. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి

9. Wagner: ప్రిగోజిన్‌.. మా సైన్యానికి శిక్షణ ఇవ్వండి..: బెలారస్‌ అధ్యక్షుడు

రష్యాలో తిరుగుబాటు చేసి.. తాజాగా బెలారస్‌లో తలదాచుకొన్న వాగ్నర్‌ ప్రైవేటు సైన్యానికి కొత్త పని లభించనుంది. తమ దేశ సైనికులకు వాగ్నర్‌ సైనికులు శిక్షణ ఇవ్వాలని బెలారస్‌ అధ్యక్షుడు అలెగ్జాండర్‌ లుకషెంకో ఆహ్వానించారని బెలారస్‌ అధికారిక పత్రిక బెల్టా న్యూస్‌ ఏజెన్సీ పేర్కొంది. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి

10. Jack Dorsey: ‘ట్విటర్‌ను నడపటం కష్టం’ మస్క్‌ నిర్ణయంపై మాజీ సీఈఓ

ప్రముఖ మైక్రో బ్లాగింగ్‌ సైట్‌ ట్విటర్‌ (Twitter)లో పోస్టుల వీక్షణకు పరిమితులు తీసుకొచ్చిన ఎలాన్‌ మస్క్‌ ( Elon Musk) నిర్ణయంపై ట్విటర్‌ మాజీ సీఈఓ జాక్‌ డోర్సే (Jack Dorsey) స్పందించారు. ట్విటర్‌ను నడిపించటం కష్టం అంటూ.. మస్క్‌ నిర్ణయం అనంతరం జాక్‌ తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ఈ విషయాన్ని ఆయన ట్విటర్ అధికార ఖాతా ద్వారా ట్వీట్ చేశారు. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని