Top Ten News @ 9 AM

ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం...

Updated : 19 Jun 2021 09:04 IST

1. విద్యార్థి వీసా స్లాట్ల పెంపు

అమెరికాలో చదువుకోవాలనుకునే విద్యార్థులకు కొంత ఊరట లభించనుంది. విద్యార్థుల నుంచి పెరుగుతున్న డిమాండు మేరకు వీసా స్లాట్లు పెంచాలని భారతదేశంలోని అమెరికా రాయబార కార్యాలయం నిర్ణయించింది. జులై, ఆగస్టు నెలల్లో అమెరికాలో విద్యా సంవత్సరం ప్రారంభమవుతుంది. కరోనా తీవ్రత తగ్గుముఖం పట్టటంతో ఇటీవల వీసా కార్యకలాపాలు మొదలయ్యాయి. ప్రస్తుతం విద్యార్థి వీసాల ప్రక్రియ మాత్రమే నడుస్తోంది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

Haryana: వృక్షాలకు పింఛన్లు!

2. ప్రేయసితో పెళ్లిచూపులు

ప్రేమకోసం యుద్ధాలు జరిగాయని విన్నప్పుడు.. ప్రేమ కోసం ప్రాణాలు తీసుకున్నారని చదివినప్పుడు.. సిల్లీగా అనిపించేది నాకు. అందులో అంత గొప్పతనం ఏముందని ఆశ్చర్యపోయేవాణ్ని. చచ్చినా ఆ మాయలో పడొద్దూ.. అనుకునేవాణ్ని. కానీ జరిగింది వేరు. ఆ వలపు బాణానికి నేనూ చిక్కుకోక తప్పలేదు. కాలేజీలో ఎదురుపడింది ఆ మెరుపు తీగ. తొలిచూపులోనే మాయ చేసింది. నా ప్రవర్తనో, తనపై చూపిస్తున్న కేరింగ్‌నో.. మొత్తానికి తనకీ నచ్చేశాను. అయితే ఈ మూడేళ్లలో మేం పట్టుమని పదిసార్లు కలుసుకుంది లేదు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

3. Milkha Singh: ఫ్లయింగ్‌ సిఖ్‌ మిల్కా ఇకలేరు

దేశానికి ఎన్నో గొప్ప విజయాలు సాధించి పెట్టిన స్ప్రింట్‌ దిగ్గజం 91 ఏళ్ల మిల్కా సింగ్‌ కన్నుమూశారు. కరోనా నుంచి కోలుకుంటున్న ఆయన ఆరోగ్యం శుక్రవారం ఒక్కసారిగా క్షీణించింది. జ్వరం రావడంతో పాటు అతని ఆక్సిజన్‌ స్థాయిలు పడిపోవడంతో అత్యవసర చికిత్సా విభాగం (ఐసీయూ)లో వైద్యం అందించారు. అయినా ఫలితం లేకపోయింది. రాత్రి 11.30కు ఆయన తుదిశ్వాస విడిచారని మిల్కా కుటుంబం ప్రతినిధి తెలిపాడు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

* ఇది సినిమా కథ కాదు

4. TS News: లాక్‌డౌన్‌ తొలగింపు?

రాష్ట్రంలో లాక్‌డౌన్‌కు ముగింపు పలకాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది. జన సమ్మర్థం, రద్దీపై ఆంక్షలు కొనసాగించేందుకు యోచిస్తోంది. థియేటర్లు, పబ్బులు, క్లబ్బులు, బార్లు వంటి వాటి మూసివేత కొనసాగనుంది. వివాహాలు, అంత్యక్రియల లాంటి వాటిపై పాత నిబంధనలు అమలు చేయనుంది. శనివారం మధ్యాహ్నం రెండు గంటలకు ముఖ్యమంత్రి కేసీఆర్‌ అధ్యక్షతన రాష్ట్ర మంత్రిమండలి సమావేశంలో లాక్‌డౌన్‌తో పాటు ఇతర కీలక నిర్ణయాలు తీసుకోనున్నారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

5. ఫైజర్‌, మోడెర్నాలతో వీర్యకణాల సంఖ్య తగ్గదు

పురుషుల్లో సంతానోత్పత్తి సామర్థ్యానికి ఫైజర్‌, మోడెర్నా టీకాలు ఏమాత్రం హాని కలిగించవని తాజా అధ్యయనమొకటి తేల్చింది. వీర్యకణాల సంఖ్యను అవి తగ్గించవని నిర్ధారించింది. 18-50 ఏళ్ల మధ్య వయసున్న 45 మంది వాలంటీర్లపై అమెరికాలోని యూనివర్సిటీ ఆఫ్‌ మియామి పరిశోధకులు ఈ అధ్యయనాన్ని నిర్వహించారు. ఇందులో భాగంగా.. తొలి డోసు వేయడానికి 2-7 రోజుల ముందు వాలంటీర్ల నుంచి వీర్యం సేకరించారు. రెండో డోసు పూర్తయ్యాక దాదాపు 70 రోజులకు మరోసారి వీర్యం తీసుకున్నారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

Corona: స్మార్ట్‌ఫోన్‌ సాయంతో కొవిడ్‌ నిర్ధారణ

6. డ్రాగన్‌ దూకుడుకు ముకుతాడు

మెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ చైనాపై చిర్రుబుర్రులాడుతూ, ఆర్థిక ఆంక్షలతో తన పదవీ కాలం గడిపేశారు. చివరికి ఆయన ఒంటెత్తు పోకడలతో నష్టపోయింది చైనా కాదు- అమెరికాయేనని విమర్శలు మిన్నంటాయి. జో బైడెన్‌ అమెరికా అధ్యక్ష పదవిని చేపట్టినప్పటి నుంచి పంథా మార్చారు. చైనా బలాన్ని, అమెరికా బలహీనతను కచ్చితంగా బేరీజు వేసుకొని వాటిని అధిగమించడానికి ఆచితూచి అడుగులు వేస్తున్నారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

7. బ్లాక్‌ ఫంగస్‌లో తొలిదశే కీలకం

సాధారణంగా గాలి మన శరీరంలోకి ప్రవేశిస్తున్నప్పుడు ముక్కులో వడబోత ప్రక్రియ జరుగుతుంది. బ్యాక్టీరియా, వైరస్‌, ఫంగస్‌లను ఒక రకమైన జిగురు పదార్థంతో అడ్డుకుంటుంది. అక్కడ అతుక్కునేలా చేసి నెమ్మదిగా పొట్టలోకి చేరుస్తుంది. ప్రమాదకరమైన ఈ సూక్ష్మక్రిములు ఊపిరితిత్తుల్లోకి వెళ్లకుండా అడ్డుకుంటుంది. రోగ నిరోధక శక్తి తగ్గిన వారి ముక్కులో సూక్ష్మక్రిములను అడ్డుకునే శక్తి కూడా తగ్గుతుంది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

రక్త నాళాల్లో ‘కొడవళ్లు’

8. CM Jagan: ప్రత్యేక హోదాపై ఏమీ చేయలేం

ప్రత్యేక హోదా గురించి కేంద్రాన్ని పదే పదే అడగటం తప్ప ఏమీ చేయలేని పరిస్థితుల్లో ఉన్నామని ముఖ్యమంత్రి వై.ఎస్‌.జగన్‌మోహన్‌రెడ్డి అన్నారు. కేంద్రంలో సంకీర్ణ ప్రభుత్వం లేదని, లోక్‌సభలో వారికి కావాల్సిన పూర్తి ఆధిక్యత ఉందని... దేవుడి దయతో ఈ పరిస్థితులు ఎప్పుడో ఒకప్పుడు మారుతాయనే సంపూర్ణ విశ్వాసం తనకుందని చెప్పారు. దేవుడి ఆశీస్సులతో ఎప్పుడో ఒకప్పుడు మంచి జరుగుతుందని కోరుకుంటున్నానని తెలిపారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

9. ఆదిలోనే అనర్హులకు చెక్‌

రేషన్‌ కార్డుల జారీలో అనర్హులకు చెక్‌ పెట్టేందుకు పౌరసరఫరాల శాఖ రంగంలోకి దిగింది. కొత్తగా కార్డు కోసం దరఖాస్తు చేసుకున్న ప్రతి ఒక్కరి వివరాలను ‘360 డిగ్రీల సాఫ్ట్‌వేర్‌’తో జల్లెడ పడుతోంది. ఈ ప్రాథమిక ప్రక్రియలో అర్హులని తేలితేనే ఆ దరఖాస్తును పరిశీలిస్తారు. లేదంటే తిరస్కరించినట్లు సంబంధిత దరఖాస్తుదారుకు సమాచారం ఇవ్వనున్నట్లు అధికారులు పేర్కొంటున్నారు.చౌకధరల దుకాణాల ద్వారా పంపిణీ చేసే సరకులను చాలా మంది తీసుకోవడం లేదు. సరకుల కోటా చాలా వరకు మిగిలిపోతుంది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

* అధి‘కారుల’ దందా

10. CT Scan: పిల్లలకు సీటీ స్కాన్‌ వద్దు

పిల్లల్లో కొవిడ్‌-19 తీవ్రతను గుర్తించడానికి చెస్ట్‌ సీటీ స్కాన్‌ చేయవద్దని కేంద్ర వైద్య, ఆరోగ్య శాఖ తాజాగా జారీ చేసిన మార్గదర్శకాల్లో స్పష్టం చేసింది. ‘‘శ్వాస తీసుకోవడంలో తీవ్ర ఇబ్బందులుండి.. పరిస్థితులు మెరుగుపడలేదని అనిపించినప్పుడు మాత్రమే సీటీ స్కాన్‌ చేయాలి. లక్షణాలు లేని లేదా తేలికపాటి లక్షణాలున్న చిన్నారులకు ఎలాంటి వైద్య పరీక్షలు అవసరం లేదు. ఆక్సిజన్‌ స్థాయి 90-93 మధ్యలో ఉంటే మధ్యస్థాయి లక్షణాలున్న కేసులుగా గుర్తించాలి. ఇలాంటి కేసుల్లో సీబీసీ, ఈఎస్‌ఆర్‌, రక్తంలో చక్కెర, ఛాతీఎక్స్‌రే పరీక్షలు చేయొచ్చు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని