Top Ten News @ 9 AM: ఈనాడు.నెట్‌లో టాప్‌ 10 వార్తలు

ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం...

Updated : 09 Jul 2023 09:15 IST

1. డబ్బు కట్టు.. అడుగు పెట్టు

విశాఖ అంటేనే అందరికీ గుర్తొచ్చేది సముద్ర తీరం. ఇతర ప్రాంతాల నుంచి వచ్చే పర్యాటకులే కాకుండా, నగర వాసులు సైతం సరదాగా అలా బీచ్‌లో గడిపి రావాలనుకుంటారు. ‘రుషికొండ’ బీచ్‌కు వెళ్లాలనుకుంటే మాత్రం ఈ ఆలోచన మానుకోవాల్సిందే. ఈ బీచ్‌లోని సౌకర్యాల నేపథ్యంలో... బ్లూఫ్లాగ్‌ గుర్తింపు రావడంతో సందర్శకుల సంఖ్య పెరిగింది. దీంతో ఈ నెల 11 నుంచి రూ.20 ప్రవేశ రుసుం వసూలు చేయాలని అధికారులు నిర్ణయించారు. పదేళ్ల లోపు వారికి మినహాయించారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

2. పరిహారం సరే.. పనుల సంగతేంటి?

సరిగ్గా రెండేళ్ల కిందట రైతు దినోత్సవం సందర్భంగా రాయదుర్గం పర్యటనకు వచ్చిన సీఎం జగన్‌మోహన్‌రెడ్డి బైరవానితిప్ప ప్రాజెక్టు (బీటీపీ) భూసేకరణను 60 రోజుల్లో పూర్తిచేసి పనుల్ని వేగవంతం చేస్తామని హామీ ఇచ్చారు. అప్పటి నుంచి ఒక్క అడుగు ముందుకు పడలేదు. మళ్లీ శనివారం కళ్యాణదుర్గం వచ్చిన సీఎం... ఒకటి, రెండు రోజుల్లో నిర్వాసితులకు రూ.208 కోట్ల పరిహారం జమ చేస్తామని ప్రకటించారు. ప్రాజెక్టు పనులు ఎప్పుడు మొదలుపెడతారు?పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

3. ఒంగోలు లెక్కలు.. రామానుజానికీ అంతుచిక్కవు

ఒంగోలు నగరంలోని ఇంటి సంఖ్యల్లో చోటుచేసుకున్న గందరగోళాన్ని గణిత మేధావి శ్రీనివాస రామానుజం కూడా బహుశా అర్ధం చేసుకోలేరేమో. ఈ విషయమై ఎన్నికల కమిషన్‌ స్పందించింది. పక్కాగా ఇంటి సంఖ్యలతో ఓటరు జాబితాలను సిద్ధం చేయాలని ఇస్పటికే ఆదేశించింది. అయినా ఒంగోలు నగర పాలక సంస్థ అధికారులకు మాత్రం ఈ విషయమై ఉలకడం లేదు. డోర్‌ నంబర్లు మారుస్తూ గతంలో రాజపత్రం ఇచ్చినా.. ఆ వివరాలను గృహ యజమానులు తెలుసుకునేందుకు వీలుగా నిర్దిష్ట చర్యలు తీసుకోవడం లేదు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

4. నేను గొప్ప.. కాదు నేనే

కూరగాయలన్ని కలిసి సమావేశమయ్యాయి. ముందుగా లేచి నిలబడింది మిరపకాయ. మీ అందరిలో నేనే గొప్పదానిని .. ఎందుకంటే మార్కెట్‌లో నా ధర కిలోకు ఎప్పుడు వందకు అటు ఇటుగా ఉంటుంది.. కొరికితేనే కాదు కొరకకుండా కూడా మంట పుట్టించే సత్తా నాది.. అంటూ కాలర్‌ ఎగురవేసింది. అందుకే కూరగాయలకు నేనే రాజునంటూ ఉపన్యాసం ప్రారంభించింది. ఇంతలో.. ఓయ్‌ ఆగు అని గట్టిగా మాటలు వినబడడంతో ఉపన్యాసం ఆపి పక్కకు చూసింది మిరపకాయ.పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

5. ఇసుకలో కాసులు ఏరేశారు.. శివన్నా..!

డిండి ఎత్తిపోతల పథకంలో భాగంగా నిర్మిస్తున్న చర్లగూడెం (శివన్నగూడెం) ప్రాజెక్టులో భారీ ఇసుక కుంభకోణం జరిగినట్లు తెలిసింది. ఇసుక గోల్‌మాల్‌ విషయంలో ఇప్పటికే కొందరు హైకోర్టులో వ్యాజ్యం దాఖలు చేసిన సంగతి తెలిసిందే. 11.96 టీఎంసీల సామర్థ్యంతో ఈ ప్రాజెక్టును రూ.1500 కోట్లకు పైగా అంచనా వ్యయంతో చేపట్టారు. కట్ట నిర్మాణం, వివిధ అవసరాలకు ఈ ప్రాజెక్టుకు భారీ ఎత్తున ఇసుక అవసరం ఏర్పడింది. దీంతో ప్రభుత్వం శాలిగౌరారం మండలంలోని మూసీ పరివాహక ప్రాంతం వంగమర్తిలో ఉన్న ప్రభుత్వ రీచ్‌ నుంచి ఇసుక రవాణాకు అనుమతి ఇచ్చింది.పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

6. గుప్పుమంటున్నా.. గట్టి శిక్షలేవీ?

గంజాయి రవాణా, స్మగ్లర్లను ఎక్కడికక్కడ అణచివేస్తున్న పోలీసులకు.. దాన్ని వినియోగిస్తూ పట్టుబడ్డ వారిపై చర్యలు తీసుకోవడంలో ఎదురవుతున్న సవాళ్లు కొత్త తలనొప్పులు తెచ్చిపెడుతున్నాయి. మూడు కమిషనరేట్లలో చట్టప్రకారం వినియోగదారులపైనా కేసులు నమోదు చేస్తున్నా.. శిక్షలు కఠినంగా ఉండడం లేదు. దీన్ని అవకాశంగా తీసుకుంటున్న కొందరు కొత్త అవతారం ఎత్తుతున్నారు. ఖర్చుల కోసం తక్కువ మొత్తంలో గుట్టుగా నగరానికి గంజాయి చేరవేసి.. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

7. చిన్న పరిశ్రమలపై పెద్ద దెబ్బ!

పరిశ్రమలకు ప్రోత్సాహకాలపై వల్లమాలిన ప్రేమ ఒలకబోసిన ముఖ్యమంత్రి జగన్‌ ప్రోత్సాహకాల విషయంలో మెలికలపై మెలికలు పెడుతున్నారు. గతేడాది జులైలో శాసనమండలి ఎన్నికల సాకుతో వాయిదా వేశారు. కోడ్‌ ముగిశాక ఇస్తామన్న మంత్రి అమర్‌నాథ్‌ మాటలు నీటిమూటలయ్యాయి. ఈ ఏడాది ఫిబ్రవరిలో అడిగితే విశాఖ పెట్టుబడుల సదస్సు తర్వాత అన్నారు. అది ముగిసి నాలుగు నెలలైనా విడుదల జాడలేదు. కొత్తగా ఈ ఏడాది జులైలో ఇస్తామని చెబుతున్నారు.పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

8. అబద్ధాల బజారు.. దోచుకునే దుకాణం

కాంగ్రెస్‌ పార్టీ అంటే అబద్ధాల బజార్‌ (ఝూట్‌ కా బజార్‌), దోచుకునే దుకాణం (లూట్‌ కీ దుకాన్‌) అని ప్రధాని నరేంద్రమోదీ దుమ్మెత్తిపోశారు. రాజస్థాన్‌లో ఆ పార్టీ సర్కారుకు రోజులు దగ్గరపడ్డాయనీ, ఈసారి ఎన్నికల్లో ఓటమి ఖాయమని చెప్పారు. విద్వేష బజారులో ప్రేమ దుకాణం (నఫ్రత్‌ కా బజార్‌ మే మొహబ్బత్‌ కీ దుకాన్‌) తెరిచామని కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌గాంధీ ఇటీవల చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో ఆయన ఈ మాటలన్నారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

9. ఇన్ఫెక్షన్లొస్తాయ్‌.. జాగ్రత్త!

ఈకాలం మేనిని తాకే చల్లగాలి.. శరీరాన్ని సేదతీర్చే చినుకులకే కాదు.. అనారోగ్యాలకీ నెలవే! ముఖ్యంగా మనకి వెజైనల్‌ ఇన్ఫెక్షన్ల బెడద ఎక్కువ. అందుకే.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి! జననాంగాల శుభ్రతకు సబ్బుని వాడొద్దు. ఇంటిమేట్‌ వాష్‌లని దొరుకుతున్నాయి. వాటిని తరచూ వాడండి. ఇది చర్మంలోని పీహెచ్‌ స్థాయులను సమన్వయం చేసి, ఇన్ఫెక్షన్ల నుంచి కాపాడుతుంది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

10. కేసీఆర్‌ సారూ.. ఏదీ నగదు..?

కేసీఆర్‌ కిట్‌ పథకంతో ప్రభుత్వ దవాఖానాల్లో ప్రసవాలు పెరుగుతున్నాయి. కానీ పథకం పైసలు బాధితుల ఖాతాల్లో జమ కావడం లేదు. రెండేళ్ల నుంచి ఒక్క విడత కూడా జమ కాకపోవడం చూస్తే ఈ పథకాన్ని ఏ స్థాయిలో నీరుగారుస్తున్నారో అర్థం చేసుకోవచ్చు. ప్రసవించిన వెంటనే ఓ కిట్‌ అందిస్తున్నారు తప్ప నగదు విషయాన్ని పూర్తిగా మరిచిపోయారు.పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని