ఇన్ఫెక్షన్లొస్తాయ్‌.. జాగ్రత్త!

ఈకాలం మేనిని తాకే చల్లగాలి.. శరీరాన్ని సేదతీర్చే చినుకులకే కాదు.. అనారోగ్యాలకీ నెలవే! ముఖ్యంగా మనకి వెజైనల్‌ ఇన్ఫెక్షన్ల బెడద ఎక్కువ. అందుకే.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి!

Published : 09 Jul 2023 01:02 IST

ఈకాలం మేనిని తాకే చల్లగాలి.. శరీరాన్ని సేదతీర్చే చినుకులకే కాదు.. అనారోగ్యాలకీ నెలవే! ముఖ్యంగా మనకి వెజైనల్‌ ఇన్ఫెక్షన్ల బెడద ఎక్కువ. అందుకే.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి!

  • జననాంగాల శుభ్రతకు సబ్బుని వాడొద్దు. ఇంటిమేట్‌ వాష్‌లని దొరుకుతున్నాయి. వాటిని తరచూ వాడండి. ఇది చర్మంలోని పీహెచ్‌ స్థాయులను సమన్వయం చేసి, ఇన్ఫెక్షన్ల నుంచి కాపాడుతుంది. కాటన్‌ లోదుస్తులనే వాడండి. సింథటిక్‌ రకాలు తేమను పీల్చుకోవు. దీంతో ఇన్ఫెక్షన్లకి అవకాశం ఉంటుంది. కాటన్‌వి గాలి ప్రసరణ బాగా జరిగేలా చేయడమే కాదు.. తేమనీ త్వరగా పీల్చుకుంటాయి.
  • నెలసరి సమయంలోనూ జాగ్రత్తగా ఉండాలి. శానిటరీ ప్యాడ్లను ప్రతి 4-5 గంటలకోసారి మార్చుకోవడంతోపాటు తరచూ శుభ్రపరచుకోవాలి. అయితే ముందుగా చేతులు సబ్బుతో శుభ్రం చేసుకోవడం తప్పనిసరి. అప్పుడే బ్యాక్టీరియా వ్యాప్తిని ఆపొచ్చు.
  • ఈ కాలం వర్షాలు ఎప్పుడు పలకరిస్తాయో తెలియదు. తడిస్తే.. వెంటనే దుస్తులు మార్చేసుకోండి. ఉబ్బకి చెమటలు పోసినా ఇదే సూత్రం వర్తిస్తుంది. ఎక్కువసేపు తడితో ఉన్న వస్త్రాలూ బ్యాక్టీరియా, వైరస్‌లకు నెలవే. స్నానం చేశాక హడావుడిగా దుస్తులు చుట్టేసుకోక పూర్తిగా తడిపోయేలా తుడుచుకోండి. లేదంటే తేమ దుస్తులకు అలాగే పట్టి ఉండి, సూక్ష్మజీవులకు ఆవాసంగా మారగలవు.
  • చినుకుల వేళ త్వరగా దప్పికేయదు. అలాగని నీటిని తాగకుండా ఉండొద్దు. తగినంత నీరు తీసుకుంటేనే శరీరంలోని మలినాలు బయటకు వెళ్లిపోతాయి. అప్పుడిక యూరిన్‌ ఇన్ఫెక్షన్ల బెడదా ఉండదు.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్