Top Ten News @ 9 AM: ఈనాడు.నెట్‌లో టాప్‌ 10 వార్తలు

ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం...

Updated : 07 Aug 2023 09:14 IST

1. పరిహారం కోరితే.. పరిహాసం చేశారు..!

గత ఏడేళ్లుగా ఆందోళనలు, పోరాటాలు చేస్తున్నా పరిహారం దక్కడం లేదని మల్లవల్లి పారిశ్రామికవాడ నిర్వాసితులు జనసేన అధినేత పవన్‌కల్యాణ్‌ ఎదుట తమ గోడు వెళ్లబోసుకున్నారు. ఎవరూ తమ గోడు పట్టించుకోని తరుణంలో తమకు ఆపద్బాంధవుడిలా కనిపించారని అన్నారు. మల్లవల్లి పారిశ్రామికవాడ నిర్వాసిత రైతుల భరోసా యాత్రను జనసేనాని పవన్‌ కల్యాణ్‌ ఆదివారం మధ్యాహ్నం నిర్వహించారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

2. ఐరాసకు నచ్చినా.. పాలకులు మెచ్చలే

ప్రపంచ ఉత్తమ పర్యాటక గ్రామంగా నిలిచిన భూదాన్‌ పోచంపల్లిలో అభివృద్ధి ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న చందంగా తయారైంది. 2021 నవంబరులో అవార్డు ప్రకటించిన అనంతరం కేంద్ర, రాష్ట్ర పర్యాటక మంత్రులు కిషన్‌రెడ్డి, శ్రీనివాస్‌గౌడ్‌ స్పందిస్తూ గ్రామాభివృద్ధికి మరింత చేయూతనిస్తామన్న హామీలు ఇప్పటికీ నీటిమూటలుగానే మిగిలిపోయాయి. ఏడాదిన్నర గడుస్తున్నా.. గ్రామానికి సంబంధించి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఒక్క రూపాయి కూడా విడుదల చేయకపోవడం గమనార్హం.పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

3. ఏరులో ఆట కాదు.. బడిబాట

ఏలూరు జిల్లా ముసునూరు మండలం బలివే నుంచి పెదవేగి మండలం విజయరాయి వెళ్లాలంటే తమ్మిలేరు దాటాల్సిందే. పాఠశాలలు, కళాశాలల విద్యార్థులు ఏడాది పొడవునా నీటిలో రాకపోకలు సాగించాల్సి వస్తోంది. బలివేలో ప్రాథమిక పాఠశాల మాత్రమే ఉంది. ఉన్నత విద్య కోసం విజయరాయి వెళ్లాల్సి వస్తోంది. ఉదయం, సాయంత్రం వేళల్లో పిల్లల కోసం తల్లిదండ్రులు ఏటిగట్లపై పడిగాపులు కాచి దగ్గరుండి తీసుకెళ్లాల్సిన పరిస్థితి.పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

4. 64 ఏళ్ల నాథూ కాకా.. గుండ్రటి ఈ-బైక్‌ రూపకర్త

ఏడో తరగతి వరకు చదివిన నాథూభాయ్‌ పటేల్‌ (64)కు ద్విచక్ర వాహనాల మెకానిక్‌గా 40 ఏళ్ల అనుభవం ఉంది. గుజరాత్‌లోని సూరత్‌ జిల్లా అథవాకు చెందిన ఈయనకు మొదటినుంచీ ఏదో ఒకటి కొత్తగా చేయాలనే ఆసక్తి ఎక్కువ. ఈ తపనతోనే నాలుగు నెలలు కష్టపడి గుండ్రటి ఆకారంలో ఈ-బైక్‌ రూపొందించాడు. దీని తయారీకి మొత్తం రూ.85 వేలు ఖర్చయింది. ఒక్కసారి ఛార్జ్‌ చేస్తే 30 కిలోమీటర్ల వరకు వెళ్లవచ్చని నాథూభాయ్‌ తెలిపాడు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

5. నేను శివుణ్ని.. మళ్లీ బతికిస్తానని వృద్ధురాలిని కొట్టి చంపాడు

రాజస్థాన్‌లోని ఉదయ్‌పుర్‌ జిల్లా గోగుండా తహసీల్‌ పరిధిలో దారుణం జరిగింది. తాను శివుడి అవతారమని చెప్పుకొన్న ఓ వ్యక్తి.. వృద్ధురాలిపై గొడుగుతో దాడి చేసి హతమార్చాడు. ఆ సమయంలో ఇద్దరు మైనర్లు, నాథూసింగ్‌ అనే మరో వ్యక్తి అక్కడే ఉన్నారు. వారిలో ఒకరు దాడి దృశ్యాలను చిత్రీకరించారు. పూటుగా మద్యం తాగిన ప్రతాప్‌సింగ్‌ (70) తాను శివుడి అవతారమని ఊగిపోయాడు.పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

6. స్టెనోగ్రాఫర్‌గా చేరతారా?

ఇంటర్మీడియట్‌ విద్యార్హతతో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగావకాశం వచ్చింది. స్టాఫ్‌ సెలక్షన్‌ కమిషన్‌ (ఎస్‌ఎస్‌సీ) 1207 స్టెనోగ్రాఫర్‌ పోస్టుల భర్తీకి ప్రకటన జారీ చేసింది.  ఆన్‌లైన్‌ పరీక్ష, స్కిల్‌ టెస్టులతో నియామకాలు చేపడతారు. బ్యాంకు, రైల్వే ఉద్యోగాల సన్నద్ధతతో ఈ పరీక్షనూ ఎదుర్కోవచ్చు. కేంద్ర కొలువులపై ఆసక్తి ఉండి ఇంటర్మీడియట్‌ పూర్తిచేసుకున్న విద్యార్థులు స్టెనోగ్రాఫర్‌ గ్రేడ్‌ సి, గ్రేడ్‌ డిలో పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు.పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

7. జగనన్నా.. నిర్వాసితుల నిత్య కష్టాలు పట్టవా?

పోలవరం ప్రాజెక్టు పూర్తికావడంపై ప్రభుత్వం అంచనాల మాటెలా ఉన్నా.. ప్రాజెక్టు పరిధిలోని నిర్వాసితులకు నిత్యం కష్టాల నడుమ జీవనం సాగిస్తున్నారు. పరిహారం, పునరావాసానికి ఈనాటికీ పురిటినొప్పులు తప్పడం లేదు. విలీన మండలాలైన వరరామచంద్రాపురం, కూనవరం మండలాల్లోని నిర్వాసితులకు నిర్మిస్తున్న పునరావాస కాలనీలు అయిదేళ్లయినా ఇంకా నిర్మాణ దశలోనే ఉన్నాయి.పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

8. గో‘దారి’లోకి వస్తారా?

ఓ వైపు ప్రభుత్వంపై వ్యతిరేకత, మరోవైపు పార్టీలో కుమ్ములాటలు.. వీటన్నింటినీ మించి వారాహి యాత్రతో జనసేన అధినేత పవన్‌కల్యాణ్‌ చూపిన ప్రభావం.. ఈ క్రమంలో ఉభయగోదావరి జిల్లాల్లో పార్టీ ఎలాంటి వ్యూహాన్ని అమలు చేయాలనే అంశంపై ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి తన పార్టీ నేతలతో సోమవారం కీలక భేటీ నిర్వహించనున్నారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

9. అయోధ్య ఆలయం కోసం 400 కిలోల తాళం

అయోధ్యలో నిర్మిస్తున్న భవ్య రామ మందిరం కోసం ఉత్తర్‌ప్రదేశ్‌కు చెందిన ఓ నిపుణుడు 400 కేజీల బరువైన తాళం తయారు చేశారు. తాళాల నగరంగా పేరున్న అలీగఢ్‌కు చెందిన సత్యప్రకాశ్‌ శర్మ రాముడి భక్తుడు. తాళాల తయారీలో నిపుణుడు కూడా. ఆయన కుటుంబం 100 సంవత్సరాలకు పైగా తాళాల తయారీ పనులు చేస్తోంది. మరోవైపు, అయోధ్య రామాలయం కోసం సత్యప్రకాశ్‌ శర్మ కొన్ని నెలలపాటు శ్రమించి ప్రపంచంలోనే అతిపెద్దదైన చేతితో తయారుచేసిన తాళాన్ని సిద్ధం చేశారు.పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

10. అన్నవరంలో కొత్త నిబంధన.. ఒకసారి గది తీసుకుంటే మళ్లీ 3 నెలల తర్వాతే

అన్నవరం దేవస్థానంలో వసతిగదిని ఒకసారి తీసుకుంటే మళ్లీ మూడు నెలల వరకు తీసుకునే అవకాశం లేకుండా అధికారులు నిబంధన పెట్టారు. వసతిగదిని తీసుకునే సమయంలో భక్తుడి ఆధార్‌ నంబరును సిబ్బంది నమోదు చేస్తారు. ఇలా ఒక ఆధార్‌ నంబరుపై గదిని పొందిన తర్వాత మళ్లీ 90 రోజుల వరకూ కేటాయింపునకు అవకాశం లేకుండా సాఫ్ట్‌వేర్‌ను తీర్చిదిద్దారు.పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని