Top Ten News @ 9 AM: ఈనాడు.నెట్‌లో టాప్‌ 10 వార్తలు

ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం...

Updated : 28 Aug 2023 09:15 IST

1. ఎన్ని విద్యుత్తు ప్రాజెక్టులొచ్చాయో.. చెబుతారా సీఎం గారూ?

విద్యుత్‌ రంగంలో పెట్టుబడులు.. మరిన్ని ఉద్యోగాల కల్పనే లక్ష్యం. విద్యుత్‌ ఉత్పత్తికి.. విక్రయించే వారికి అనుకూల విధానాలుండాలి. ఇక్కడ ప్లాంట్లు పెట్టేవారికి సానుకూల వాతావరణం కల్పించేలా చూడాలి. భూములు లీజుకు ఇచ్చే వారికి.. ఏటా లీజు మొత్తం అందుతుంది. ఎనర్జీ ఎక్స్‌పోర్ట్‌ పాలసీ రూపొందించి.. వచ్చే రెండేళ్లలో భారీ ఎత్తున విద్యుత్‌ ప్రాజెక్టులు ప్రోత్సహించాలి. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

2. మంచే అయినా.. మించొద్దు!

ఆరోగ్యంపై ఆసక్తి.. ఇన్‌ఫ్లుయెన్సర్ల ప్రభావం వెరసి రకరకాల విత్తనాలు డైట్‌లో చేసుకోవడం ఇప్పుడు మామూలైంది. తినడం మంచిదే! అయితే మోతాదు మించితే అనారోగ్యాలకి దారితీస్తాయంటారు నిపుణులు. అవిసెలు.. వీటిల్లోని ఫైటో ఈస్ట్రోజెన్‌ హార్మోనుల్లో అసమ తుల్యతను సరిచేస్తుంది. నెలసరి తేడాలు, అధిక బరువు, గర్భధారణ సమస్యల్ని క్రమబద్ధీకరిస్తుంది. అయితే వీటిని స్పూనుకి మించి తీసుకోకూడదు.పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

3. ఇవి పాటిస్తే.. మీరే టాపర్‌!

విద్య, ఉద్యోగం, ఆట, పాట.. ఎందులో టాపర్‌గా నిలవాలన్నా మంచి అలవాట్లు, చక్కని ప్రణాళిక ఎంతో కీలకం. విద్యార్థిగా ఉన్నప్పటి నుంచే వీటిని ప్రణాళికతో అమలు చేస్తే భవిష్యత్తులో కోరుకున్న విభాగంలో రాణించడం సులువవుతుంది. రోజూ తరగతులకు హాజరై, అసైన్‌మెంట్లు పూర్తిచేస్తే సరిపోదు. దీంతోపాటు ఆచరించాల్సిన ఇతర అంశాలెన్నో ఉన్నాయి. వాటిని దినచర్యలో భాగం చేసుకోవాలి!పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

4. ఈ ఎమ్మెల్యేలు మాకొద్దు..

ఈ ఎమ్మెల్యే మాకొద్దు... ఈయనో అవినీతి చక్రవర్తి... ఎక్కడినుంచో వచ్చి మాపై పెత్తనం చేస్తున్నారు.. ఇవన్నీ అధికారపార్టీ ఎమ్మెల్యేలపై ప్రతిపక్షాల విమర్శలు కావు. వైకాపాలోనే కొందరు ఎమ్మెల్యేలపై ఆ పార్టీ కార్యకర్తలు, ద్వితీయశ్రేణి నాయకులు ఇలా కాలుదువ్వుతున్నారు. ‘ఈ ఎమ్మెల్యే మాకొద్దు’ అంటూ కొన్ని నియోజకవర్గాల్లో పోస్టర్లు, ఫ్లెక్సీలు వేస్తున్నారు. మరికొందరు పార్టీ ఇన్‌ఛార్జులకు ఫిర్యాదులు చేస్తున్నారు. కొన్ని నియోజకవర్గాల్లో పరిస్థితిని పరిశీలిస్తే...పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

5. వీఓఐపీ మోసాలు

సైబరాబాద్‌ పోలీసులు రెండు నెలల క్రితం ఓ నకిలీ కాల్‌సెంటర్‌పై దాడి చేసి.. 115 మందిని పట్టుకున్నారు. అమెరికా దేశస్థుల ఫోన్‌ నంబర్లు సేకరించి, అక్కడి ఫెడరల్‌ బ్యూరో ఆఫ్‌ ఇన్వెస్టిగేషన్‌(ఎఫ్‌బీఐ) అధికారుల మాదిరిగానే వీరు మాట్లాడేవారని గుర్తించారు. ‘మీ పేరిట మాదకద్రవ్యాల పార్సిల్‌ వచ్చింది. దీన్ని మేం గుర్తించాం. ఈ కేసు నుంచి తప్పించాలంటే మేం అడిగినంత డబ్బులు ఇవ్వాలి’ అంటూ బెదిరించేవారు. హైదరాబాద్‌ నుంచే ఫోన్‌ చేసినా.. అమెరికా నంబర్ల నుంచి వస్తున్నట్లు నమ్మించేవారు.పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

6. సాగులో ఉన్నా.. ఆన్‌లైన్‌లో లేవు

సాగు భూముల వివరాలు ఆన్‌లైన్‌లో కనిపించక పలువురు రైతులు ఆందోళన చెందుతున్నారు. ఆరేళ్ల క్రితం రాష్ట్రంలో కొత్త పాసుపుస్తకాల జారీ చేపట్టాక కొందరు రైతుల సర్వే నంబర్లు ఆన్‌లైన్‌లో నమోదు కాలేదు. రెవెన్యూ సిబ్బంది పలు కారణాలతో ఆయా సర్వే నంబర్లను తొలగించారు. ఆ తరువాత తిరిగి చేర్చడం సాధ్యం కావడం లేదు. దీంతో క్షేత్రస్థాయిలో సాగులోనే ఉన్నా.. ఆన్‌లైన్‌ రికార్డుల్లో మాత్రం భూమి వివరాలు కనిపించడం లేదు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

7. తమిళ దర్శకుడితో నాని?

కథానాయకుడు నాని ప్రస్తుతం ‘హాయ్‌ నాన్న’ను ముగించే పనిలో ఉన్నారు. ఈ సినిమా తర్వాత వివేక్‌ ఆత్రేయ దర్శకత్వంలో ఓ చిత్రం చేసేందుకు అంగీకారం తెలిపారు. కాగా, ఇప్పుడాయన తమిళ దర్శకుడు శిబి చక్రవర్తితో ఓ సినిమా చేయనున్నారని సమాచారం. ఇప్పటికే కథా చర్చలు పూర్తయ్యాయని.. స్క్రిప్ట్‌ ఆసక్తికరంగా ఉండటంతో నాని పచ్చజెండా ఊపారని తెలిసింది. తెలుగు, తమిళ భాషల్లో ద్విభాషా చిత్రంగా రూపొందించనున్నారని టాక్‌.పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

8. మాటల కోతలు.. రాయితీపై వాతలు

అక్కాచెల్లెమ్మల ఆర్థిక సామాజిక సాధికారతకు.. వారిళ్లలో వెలుగులు చూడాలని సున్నావడ్డీని ఏటా క్రమం తప్పకుండా నేరుగా వారి ఖాతాల్లోకి జమ చేస్తున్నాం.  -ఈ నెల 11న కోనసీమ జిల్లా అమలాపురం సభలో సున్నా వడ్డీ రాయితీ నిధుల విడుదల బటన్‌ నొక్కుతూ ముఖ్యమంత్రి జగన్‌ అన్న మాటలివి. ఇదంతా జరిగి 16 రోజులైంది. ఉమ్మడి జిల్లాలో స్వయం సహాయక సభ్యులందరి ఖాతాల్లోకి మరి సున్నావడ్డీ రాయితీ జమైందా అంటే  30 శాతం కూడా కాలేదు.పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

9. జీతం రూ.500.. 20 నెలలుగా బకాయిలు

రెండున్నర దశాబ్దాల క్రితం నిర్ణయించిన నెలకు రూ.500 నామమాత్రపు గౌరవ వేతనాన్ని పెంచాలని బూత్‌ లెవల్‌ అధికారులు (బీఎల్వోలు) కోరుతున్నారు. మహిళా కూలీలకు ఇచ్చే రోజువారీ వేతనం కంటే తమ నెల జీతం తక్కువేనని పలువురు వాపోతున్నారు. గతంలో ఎక్కువ మంది రెవెన్యూ సిబ్బందినే బీఎల్వోలుగా నియమించేవారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

10. ఎంపీగా చేశా.. ఎమ్మెల్యేగా ఆశ

రాజధానిలో రానున్న శాసనసభ ఎన్నికల్లో కాంగ్రెస్‌ తరఫున బరిలో దిగేందుకు అగ్రనేతలు, యువనాయకులు, కొత్తవారు ఆసక్తి చూపారు. మాజీ ఎంపీలు, ఎమ్మెల్యేలు మరోసారి గెలవాలని టిక్కెట్ల కోసం దరఖాస్తు చేసుకున్నారు. తెలంగాణలో నాల్గోవంతుకుపైగా శాసనసభ స్థానాలు ఇక్కడే ఉండడం, అధికార బారాసపై ప్రజల్లో విశ్వాసం సడలుతోందన్న అభిప్రాయం, పార్టీకి అనుకూల పవనాలు వీస్తున్నాయనే భావనతో మాజీ కేంద్రమంత్రి సహా నలుగురు మాజీ ఎంపీలు, ఇద్దరు మాజీ ఎమ్మెల్యేలు దరఖాస్తులు సమర్పించారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని