Top Ten News @ 9 AM: ఈనాడు.నెట్‌లో టాప్‌ 10 వార్తలు

ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం...

Updated : 07 Sep 2023 09:08 IST

1. తిరుమలలో చిక్కిన మరో చిరుత

తిరుమలలో మరో చిరుత చిక్కింది. అలిపిరి నడకమార్గంలో నరసింహస్వామి ఆలయం- 7వ మైలు మధ్య ప్రాంతంలో బోనులో చిక్కినట్లు అటవీశాఖ అధికారులు తెలిపారు. దీనితో కలిపి రెండు నెలల కాలంలో మొత్తం ఐదు చిరుతలను అధికారులు పట్టుకున్నారు. నాలుగు రోజుల క్రితమే ఈ చిరుత కెమెరా కంట పడింది.పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

2. మూడు కూటముల ముద్దుగుమ్మ

మన రాజధాని దిల్లీ ఆతిథ్యం ఇస్తుండటంతో... దేశమంతా జీ20 పేరు మారుమోగుతోంది. ప్రధాని మోదీ అధ్యక్షతన అమెరికా, చైనా, బ్రిటన్‌, ఫ్రాన్స్‌, జర్మనీ, ఆస్ట్రేలియాలాంటి ప్రపంచ అగ్రనేతలతో పాటు 40కిపైగా దేశాల అధినేతలు హస్తినలో రెండ్రోజుల పాటు భేటీ కాబోతున్నారు! ఇంతకూ ఏంటీ జీ20? దీని లక్ష్యాలేంటి? ప్రాధాన్యమేంటి? సవాళ్లేంటి?పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

3. మేల్కొంటేనే.. రామప్పకు గుర్తింపు!

రామప్ప ఆలయానికి యునెస్కో గుర్తింపు రావడానికి ఎంతో కృషి జరిగింది. దాన్ని కాపాడుకునే దిశలో మాత్రం పూర్తిస్థాయి ప్రయత్నాలు కొనసాగడంలేదన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి. యునెస్కో అడిగిన నివేదికలను పంపించడంలో జాప్యం చోటుచేసుకుంటే ‘గుర్తింపు’ సందేహస్పదమే అన్న అనుమానాలు ముసురుకుంటున్నాయి.పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

4. ఒకసారి చెబితే.. 22 భాషల్లోకి తర్జుమా!

డిగ్రీ, పీజీ విద్యార్థులు ఇకపై వారి మాతృభాషలోనే డిజిటల్‌ పద్ధతిలో పాఠాలు నేర్చుకోనున్నారు. ఇంగ్లిష్‌ సహా ఇతర భాషల్లో చెప్పిన వీడియో పాఠం... ‘స్పీచ్‌ ట్రాన్స్‌లేషన్‌’ సాఫ్ట్‌వేర్‌ ద్వారా దానంతటదే అనువాదమై విద్యార్థులకు ‘రాత’రూపంలో అందనుంది. ఇప్పటివరకు ఎనిమిది భాషల్లో అందుబాటులో ఉన్న 45 వేల డిజిటల్‌ పాఠాలను 22 భాషల్లోనూ వచ్చేలా ప్రత్యేక సాఫ్ట్‌వేర్‌ను ట్రిపుల్‌ఐటీ హైదరాబాద్‌, ఐఐటీ మద్రాస్‌, ఐఐటీ బాంబేలోని ఆచార్యులు సంయుక్తంగా అభివృద్ధి చేస్తున్నారు.పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

5. టీకాకు పెద్దలు దూరం

వివిధ రకాల వ్యాధి నిరోధక టీకాలకు 50 ఏళ్లు ఆపై వయసు దాటిన వారు దూరంగా ఉంటున్నారు. దేశ వ్యాప్తంగా హైదరాబాద్‌ సహా 16నగరాల్లో ‘ది అసోసియేషన్‌ ఆఫ్‌ ఫిజీషియన్స్‌ ఇన్‌ ఇండియా’(ఏపీఐ) చేసిన తాజా అధ్యయనంలో ఈ విషయం తేలింది. సరైన మార్గదర్శకాలు లేకపోవడం వల్ల కూడా వైద్యులు పెద్దలకు టీకాలను సిఫార్సు చేయలేకపోతున్నట్లు అధ్యయనం విశ్లేషించింది.పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

6. సేద్యానికి పగలే కరెంటు ఇవ్వండి

వ్యవసాయ బోర్లకు రోజూ పగటిపూట మాత్రమే కరెంటు సరఫరా చేయాలని కేంద్ర విద్యుత్‌ శాఖ అన్ని రాష్ట్ర ప్రభుత్వాలకు తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది. మధ్యాహ్నం వేళ సౌర విద్యుదుత్పత్తి అధికంగా ఉంటుందని, ఆ సమయంలో వ్యవసాయానికి సరఫరా చేయడం ద్వారా దేశంలో విద్యుత్‌ డిమాండును తీర్చడానికి అవకాశం ఉంటుందని స్పష్టం చేసింది.పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

7. వైకాపా రాళ్ల దాడిలో మాజీ ఎమ్మెల్యేకు విరిగిన పక్కటెముక

పశ్చిమగోదావరి జిల్లా భీమవరంలోని గునుపూడి వద్ద యువగళం పాదయాత్ర బృందంపై మంగళవారం జరిగిన రాళ్ల దాడిలో గాయపడిన ఉండి మాజీ ఎమ్మెల్యే వేటుకూరి వెంకట శివరామరాజు (కలువపూడి శివ)ను చికిత్స నిమిత్తం బుధవారం మధ్యాహ్నం హైదరాబాద్‌కు తరలించారు. వైకాపా మూకలు విసిరిన రాయి ఆయన ఛాతీ భాగంలో తగలడంతో పక్కటెముక విరిగినట్లు తెదేపా నాయకులు తెలిపారు.పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

8. గద్వాల ఎమ్మెల్యేగా డీకే అరుణ పేరుతో గెజిట్‌ ముద్రణ

గద్వాల ఎమ్మెల్యేగా డీకే అరుణ పేరుతో ఎన్నికల సంఘం గెజిట్‌ ముద్రణ ప్రక్రియను పూర్తిచేసింది. హైకోర్టు తీర్పు మేరకు ఈ నియోజకవర్గం నుంచి ఎన్నికైన ఎమ్మెల్యేగా డీకే అరుణను పేర్కొంటూ సోమవారం కేంద్ర ఎన్నికల సంఘం నోటిఫికేషన్‌ జారీ చేసిన విషయం తెలిసిందే. ఈమేరకు రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి వికాస్‌రాజ్‌ గెజిట్‌ ముద్రణ పూర్తిచేశారు.పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

9. కుల్‌దీప్‌ తిరిగొచ్చాడిలా..

ఇప్పుడు మూడు ఫార్మాట్లలో కుల్‌దీప్‌ టీమ్‌ఇండియాకు రెగ్యులర్‌ స్పిన్నర్‌. వన్డే ప్రపంచకప్‌లోనూ కీలక బౌలర్‌గా బరిలోకి దిగుతున్నాడీ ఉత్తర్‌ప్రదేశ్‌ కుర్రాడు. రెండేళ్ల కిందట పతనం చవిచూసిన కుల్‌దీప్‌.. ఇప్పుడీ స్థాయికి చేరుకోవడం అనూహ్యం. మరి ఈ మార్పు ఎలా సాధ్యం అంటే..పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

10. టీవీఎస్‌ అపాచీ ఆర్‌టీఆర్‌ 310 బైకు

టీవీఎస్‌ మోటార్‌ కంపెనీ అపాచీ ఆర్‌టీఆర్‌ 310 బైకును విపణిలోకి విడుదల చేసింది. దీని ధర   రూ.2.42-2.64 లక్షలు (ఎక్స్‌-షోరూమ్‌)గా నిర్ణయించారు. దేశీయ, అంతర్జాతీయ విపణుల కోసం రూపొందించిన ఈ బైకులో 312.2 సీసీ ఇంజిన్‌ను అమర్చారు.పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని