TS High Court: ఇద్దరు తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తులు బదిలీ

తెలంగాణ హైకోర్టుకు చెందిన ఇద్దరు న్యాయమూర్తులు బదిలీ అయ్యారు.

Updated : 13 Nov 2023 22:03 IST

హైదరాబాద్‌: తెలంగాణ హైకోర్టుకు చెందిన ఇద్దరు న్యాయమూర్తులు బదిలీ అయ్యారు. ఈ ఏడాది ఆగస్టు 10న వీరి బదిలీకి సుప్రీంకోర్టు కొలీజియం సిఫారసు చేయగా, ఇందుకు రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము తాజాగా ఆమోదం తెలిపారు. రాష్ట్రపతి ఆమోదం మేరకు కేంద్ర న్యాయశాఖ బదిలీ ఉత్తర్వులు విడుదల చేసింది. ఈ విషయాన్ని కేంద్ర న్యాయశాఖ మంత్రి అర్జున్ రామ్‌ మేఘ్వాల్‌ తన ఎక్స్‌ ఖాతాలో వెల్లడించారు. బదిలీ అయిన వారిలో జస్టిస్ ఎం.సుధీర్ కుమార్, జస్టిస్ సి.సుమలత ఉన్నారు. జస్టిస్ ఎం. సుధీర్ కుమార్‌ను మద్రాస్ హైకోర్టుకు, జస్టిస్ సి. సుమలతను కర్ణాటక హైకోర్టుకు బదిలీ చేస్తూ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.

మరోవైపు, ఇతర హైకోర్టులకు చెందిన ముగ్గురు న్యాయమూర్తులను సైతం వేరేచోటకు బదిలీ చేశారు. అలహాబాద్‌ హైకోర్టు జడ్జి జస్టిస్‌ వివేక్‌ కుమార్‌ సింగ్‌ను మద్రాస్‌ హైకోర్టుకు; కలకత్తా హైకోర్టు జడ్జి జస్టిస్‌ శేఖర్‌ బి షరాఫ్‌ అలహాబాద్‌ హైకోర్టుకు; కలకత్తా హైకోర్టు జడ్జి జస్టిస్‌ వివేక్‌ చౌధురి పట్నా హైకోర్టుకు జడ్జిలుగా బదిలీ అయ్యారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని