Gaddar: గద్దర్‌ భౌతికకాయానికి ప్రముఖుల నివాళి..ఫొటో గ్యాలరీ

ఎల్బీ స్టేడియంలో ప్రజాగాయకుడు గద్దర్‌ భౌతికకాయానికి పలువురు ప్రముఖులు నివాళులర్పించారు. వివిధ పార్టీల నేతలు, వివిధ వర్గాల ప్రజలు అంజలి ఘటించారు. 

Updated : 07 Aug 2023 11:28 IST

హైదరాబాద్‌: ఎల్బీ స్టేడియంలో ప్రజాగాయకుడు గద్దర్‌ భౌతికకాయానికి పలువురు రాజకీయ, సినీ ప్రముఖులు నివాళులర్పించారు. వివిధ పార్టీల నేతలు, వివిధ వర్గాల ప్రజలు అంజలి ఘటించారు. 

కేంద్రమంత్రి, భాజపా రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డి, తెలంగాణ శానససభ స్పీకర్‌ పోచారం శ్రీనివాస్‌రెడ్డి, సుప్రీంకోర్టు విశ్రాంత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఎన్‌.వి.రమణ, రాష్ట్ర మంత్రులు ఎర్రబెల్లి దయాకర్‌రావు, సబితా ఇంద్రారెడ్డి, తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌, ఇంద్రకరణ్‌రెడ్డి, నిరంజన్‌రెడ్డి.. ఏపీ మంత్రి బొత్స సత్యనారాయణ, ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, కాంగ్రెస్‌ సీనియర్‌ నేత జానారెడ్డి, భాజపా ఎమ్మెల్యే రఘునందన్‌రావు, హైదరాబాద్‌ మేయర్‌ గద్వాల విజయలక్ష్మి, సినీ ప్రముఖులు మంచు మోహన్‌బాబు, మనోజ్‌, కొణిదెల నాగబాబు, నిహారిక, అలీ, సీపీఐ తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు, తెదేపా నేత పరిటాల శ్రీరామ్‌ తదితరులు గద్దర్‌ పార్థివదేహం వద్ద నివాళులర్పించారు. అణగారిన వర్గాలు, తెలంగాణ కోసం ఆయన చేసిన పోరాటాన్ని ఈ సందర్భంగా పలువురు మంత్రులు గుర్తుచేసుకున్నారు.

Gaddar: మర్లవడ్డ గానం... మరపురాని గళం

మరోవైపు మధ్యాహ్నం 12 గంటలకు గద్దర్‌ అంతిమయాత్ర ప్రారంభం కానుంది. ఎల్బీ స్టేడియం నుంచి గన్‌పార్క్‌, అంబేడ్కర్‌ విగ్రహం, అమరవీరుల స్తూపం, ట్యాంక్‌బండ్‌ మీదుగా అల్వాల్‌లోని ఆయన నివాసం వరకు చేరుకోనుంది. భౌతికకాయాన్ని గద్దర్‌ నివాసంలో కాసేపు ఉంచిన తర్వాత బోధి విద్యాలయం వరకు తీసుకెళ్లి అక్కడ అంత్యక్రియలు నిర్వహించనున్నారు. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని