Freedom Fighter: 49 ఏళ్ల మహిళతో 103 ఏళ్ల వృద్ధుడి వివాహం..

మధ్యప్రదేశ్‌కు చెందిన 103 ఏళ్ల స్వాతంత్య్ర సమర యోధుడు 49 ఏళ్ల మహిళను వివాహం చేసుకున్నారు. వీరికి సంబంధించిన ఫొటోలు నెట్టింట వైరల్‌గా మారాయి. 

Updated : 30 Jan 2024 12:20 IST

భోపాల్‌: మధ్యప్రదేశ్‌లో అరుదైన ఘటన చోటు చేసుకొంది. దేశ స్వాతంత్ర్యం కోసం పోరాడిన (Freedom Fighter) ఓ వ్యక్తి ఒంటరితనంతో జీవించలేక తన కంటే వయసులో 54 ఏళ్ల చిన్నదైన మహిళను వివాహం చేసుకున్నాడు. వీరికి సంబంధించిన ఫొటోలు, వీడియోలు వైరల్‌గా మారాయి.

భోపాల్‌ (Bhopal)కు చెందిన హబీబ్‌ నజర్‌ దేశ స్వాతంత్ర్యం కోసం పోరాడారు. ప్రస్తుతం ఆయన వయసు 103 ఏళ్లు. గతంలో ఆయనకు రెండు వివాహాలు జరిగాయి. ఇద్దరు భార్యలు కూడా మరణించారు. ఆ తర్వాత ఆయనను పట్టించుకునే వారు లేకుండా పోయారు. దీంతో ఒంటరితనంతో బాధపడుతున్న ఆయన మరో పెళ్లి చేసుకున్నారు. భర్తను కోల్పోయిన 49 ఏళ్ల ఫిరోజ్‌ జహన్‌ను వివాహమాడారు. గతేడాదే వీరి పెళ్లి జరిగినా.. వీరికి సంబంధించిన ఫొటోలు తాజాగా వైరల్‌గా మారాయి.

పాకిస్థానీ నావికుల్ని కాపాడిన భారత్‌

నజర్‌ మాట్లాడుతూ.. ‘‘జీవితంలో నాకు ఎలాంటి లోటు లేదు. రెండో భార్య మరణించిన అనంతరం ఒంటరితనంతో జీవించలేకపోయా. అందుకే ఫిరోజ్‌ సమ్మతితో ఆమెను మూడో వివాహం చేసుకున్నా’’ అని పేర్కొన్నారు. తాను ఓ వృద్ధుడిని పెళ్లి చేసుకోవడంలో ఎవరి బలవంతం లేదని.. ఆయన పూర్తి ఆరోగ్యంతో ఉన్నారని ఆమె తెలిపింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని