Brave Dog : సైనికుడిని కాపాడేందుకు.. ప్రాణ త్యాగం చేసిన జాగిలం

భారత ఆర్మీకి చెందిన ఓ జాగిలం (కెంట్) ఉగ్రవాదులతో దాడిలో సైనికుడి ప్రాణాలను రక్షించి తన ప్రాణాలను కోల్పోయింది.

Updated : 13 Sep 2023 19:29 IST

దిల్లీ : ఉగ్రవాదుల దాడిలో సైనికుడిని రక్షించే సమయంలో ఇండియన్‌ ఆర్మీకి చెందిన కెంట్ (Kent) అనే ఆరేళ్ల జాగిలం ప్రాణాలు కోల్పోయింది. మంగళవారం జమ్మూకశ్మీర్‌లోని రాజౌరీలో సెర్చ్‌ ఆపరేషన్‌ చేపడుతున్న బృందం.. కెంట్‌ను తీసుకువెళ్లింది. ఈ క్రమంలో ఉగ్రవాదులకు, భద్రతా దళాలకు మధ్య ఎదురుకాల్పులు జరిగాయి.

‘ఆపరేషన్‌ సుజలిగాల’లో భాగంగా ఒక దట్టమైన పొద దగ్గర సైనికుల బృందం కెంట్‌ను అనుసరిస్తోంది. ఈ క్రమంలో ఉగ్రవాదులను పసిగట్టిన జాగిలం సైన్యాన్ని అప్రమత్తం చేసింది. అయితే.. ఇరువర్గాల మధ్య భారీగా కాల్పుల జరిగాయి. ఈ నేపథ్యంలో ఓ సైనికుడిని ఉగ్రవాదులు చుట్టుముట్టడంతో కెంట్ వారికి ఎదురుగా వెళ్లింది. భారీ కాల్పుల మధ్య ఆ జాగిలం తీవ్రంగా గాయపడి మరణించింది.

కెంట్ త్యాగాన్ని గుర్తు చేసుకుంటూ భారత సైన్యం ఎక్స్‌(ట్విటర్‌)లో నివాళుల అర్పిస్తూ.. ‘ఇది ఎంతో విచారకరమైన వార్త.. 21వ ఆర్మీ డాగ్‌ యూనిట్‌లోని లాబ్రడార్‌ జాతికి చెందిన ఆడ జాగిలం (కెంట్) తన సైనికుడి ప్రాణాలను రక్షించే క్రమంలో ప్రాణాలను కోల్పోయింది. దేశం కోసం చేసిన గొప్ప త్యాగం ఇది’ అని పేర్కొంది.

ఇక ఈ ఎదురుకాల్పుల్లో ఓ ఉగ్రవాదిని మట్టుబెట్టగా.. ఓ ఆర్మీ జవాను ప్రాణాలు కోల్పోయారు. మరో ఇద్దరు జవాన్లకు, ఓ ప్రత్యేక పోలీసు అధికారికి గాయాలు అయ్యాయని జమ్మూ జోన్ అడిషనల్ డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ ముఖేశ్‌ సింగ్ తెలిపారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని