Vistara: గాల్లోనే చిన్నారికి పునర్జన్మ ఇచ్చిన వైద్యులు..!

ప్రాణాపాయ స్థితిలో ఉన్న రెండేళ్ల చిన్నారిని విమానంలో ప్రయాణిస్తున్న ఎయిమ్స్‌ (AIIMS) నిపుణుల బృందం కాపాడింది. 

Updated : 28 Aug 2023 12:47 IST

దిల్లీ: విమాన ప్రయాణంలో ఊపిరి ఆగిపోయిన స్థితిలో ఉన్న రెండేళ్ల చిన్నారిని ఒక వైద్య బృందం కాపాడింది. బెంగళూరు (Bangalore) నుంచి దిల్లీ ( Delhi)కి బయలుదేరిన విస్తార (Vistara) సంస్థకు చెందిన యూకే 814 విమానంలో ఆదివారం ఈ ఘటన చోటు చేసుకుంది. ఇంతకీ ఏం జరిగిందంటే..

గుండెలో సమస్యతో బాధపడుతున్న రెండేళ్ల చిన్నారిని అత్యవసర చికిత్స నిమిత్తం బెంగళూరు నుంచి దిల్లీకి తీసుకెళుతున్నారు. ఈ  విమానం టేకాఫ్‌ అయిన కాసేపటికి చిన్నారి పరిస్థితి విషమంగా మారింది. ఒక్కసారిగా పాప ఊపిరి తీసుకోవడం ఆపేసింది. అంతేకాకుండా పెదాలు, వేళ్లు నీలిరంగులోకి మారాయి. నాడి కొట్టుకోవడం నిలిచిపోయింది. దీంతో విమానాన్ని అత్యవసరంగా నాగ్‌పుర్‌ వైపు మళ్లించారు. ఇండియన్ సొసైటీ ఫర్ వాస్కులర్ అండ్ ఇంటర్వెన్షనల్ రేడియాలజీ (ISVIR) సదస్సుకు వెళ్లి అదే విమానంలో తిరిగి వస్తున్న దిల్లీ ఎయిమ్స్‌ (AIIMS)కు చెందిన ఒక వైద్య బృందం చిన్నారి పరిస్థితిని తెలుసుకొంది. వెంటనే పాపను కాపాడేందుకు వారు ముందుకు వచ్చారు.

హాట్‌ చాక్లెట్‌తో చిన్నారికి గాయాలు.. విస్తారా విమానంలో ఘటన

చిన్నారి ఊపిరి తీసుకొనేందుకు వీలుగా శ్వాస నాళాల్లో ఏర్పాట్లు చేశారు. సీపీఆర్‌ చేయడంతో తిరిగి ఊపిరి పీల్చుకుంది. 45 నిమిషాల పాటు తీవ్రంగా శ్రమించి ప్రథమచికిత్స ద్వారా చిన్నారి ప్రాణాలను రక్షించారు. అనంతరం ఆసుపత్రికి తరలించారు. విమానంలో జరిగిన ఘటనతో పాటు చిన్నారి ఆరోగ్య పరిస్థితి గురించి ఎయిమ్స్‌ ట్విటర్‌లో షేర్‌ చేసింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు