Air Force: వాయుసేన అపాచీ హెలికాప్టర్‌ అత్యవసర ల్యాండింగ్‌..!

వాయుసేనకు చెందిన ఓ అటాక్‌ హెలికాప్టర్‌ లద్ధాఖ్‌లో అత్యవసరంగా ల్యాండ్‌ అయింది. గత నాలుగేళ్లలో ఇలాంటి ఘటనలు చోటుచేసుకోవడం ఇది మూడోసారి. 

Updated : 04 Apr 2024 15:52 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: లద్ధాఖ్‌లో నిర్వహిస్తున్న యుద్ధ శిక్షణలో అపశ్రుతి చోటుచేసుకొంది. వాయుసేనకు చెందిన అటాక్‌ హెలికాప్టర్‌ అపాచీ దెబ్బతింది. దీంతో అత్యవసరంగా ల్యాండింగ్‌ చేయాల్సివచ్చింది. కఠిన భౌగోళిక పరిస్థితుల కారణంగా ఈ ప్రమాదం చోటుచేసుకొందని ఐఏఎఫ్‌ తెలిపింది. దీనిలో ఇద్దరు పైలట్లు సురక్షితంగా బయటపడ్డారు. హెలికాప్టర్‌ను సమీపంలోని వాయుసేన స్థావరానికి చేర్చారు. ఈ ఘటనకు గల కారణాలను కనుగొనేందుకు కోర్ట్‌ ఆఫ్‌ ఎంక్వైరీ చేపట్టింది. 

గతేడాది మేలో కూడా ఈ రకానికి చెందిన హెలికాప్టర్‌ మధ్యప్రదేశ్‌లోని భింద్‌ వద్ద అత్యవసరంగా ల్యాండ్‌ అయింది. అప్పట్లో సాంకేతిక లోపాన్ని గుర్తించడంతో పైలట్లు దీనిని అక్కడి పొలాల్లో అత్యవసరంగా దించేశారు. 2020లో కూడా హోషియార్‌పుర్‌లో ఒక హెలికాప్టర్‌ ఇలానే ల్యాండ్‌ అయింది. 

కేజ్రీవాల్‌ అంశంలో మాకు పక్షపాతం లేదు: వివరణ ఇచ్చిన అమెరికా

ప్రపంచంలోనే అత్యుత్తమ అటాక్‌ హెలికాప్టర్‌గా అపాచీ పేరు తెచ్చుకొంది. వీటి కొనుగోలుకు 2015లో భారత్‌, అమెరికాతో ఒప్పందం చేసుకొంది. ఈ డీల్‌ విలువ రూ.13,952 కోట్లు. మొత్తం 22 అత్యాధునిక అపాచీలు మన దళాల చేతికి వచ్చాయి. తాజాగా ఆర్మీ కూడా ఆరు అపాచీలను కొనడానికి ప్రయత్నాలు చేస్తోంది. దీనికోసం 2020లో రూ.5,691 కోట్లు విలువైన ఒప్పందాన్ని చేసుకొంది. ఈ హెలికాప్టర్లను ఎగిరే యుద్ధ ట్యాంకులుగా నిపుణులు అభివర్ణిస్తారు. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని