కౌన్సిలర్ల మధ్య కొట్లాట.. వచ్చేటప్పుడు సెక్యూరిటీ తెచ్చుకుంటే బెటరేమో..!

ఇక నుంచి సమావేశాలకు వచ్చేటప్పుడు వెంట భద్రతా సిబ్బందిని తెచ్చుకోవాలంటూ ఉత్తర్‌ప్రదేశ్‌ మాజీ ముఖ్యమంత్రి అఖిలేశ్‌ యాదవ్‌(Akhilesh Yadav) వ్యంగ్యంగా స్పందించారు. 

Updated : 29 Dec 2023 15:16 IST

లఖ్‌నవూ: కొందరు ప్రజా ప్రతినిధులు హోదాను మరిచారు.. ప్రజా సమస్యలను విస్మరించారు.. వీధి రౌడీలను మరిపించారు. ఏకంగా మున్సిపల్‌ కౌన్సిల్‌లో బల్లలు ఎక్కి మరీ తన్నుకొన్నారు. ఉత్తర్‌ప్రదేశ్‌ (Uttar Pradesh)లోని షామ్లి(Shamli) పురపాలక సంఘం(UP Municipal Meet) సమావేశంలో చోటు చేసుకొంది.

ఈ దృశ్యాలను ఆ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి, ఎస్పీ అధినేత అఖిలేశ్‌ యాదవ్‌(Akhilesh Yadav) సోషల్‌ మీడియాలో పోస్టు చేసి భాజపాపై విమర్శలు గుప్పించారు. ఈ ఘటన స్థానిక సంస్థల దుస్థితిని తెలియజేస్తోందన్నారు. ‘ఎలాంటి అభివృద్ధి లేనప్పుడు.. సమీక్షా సమావేశంలో ఇంకేం జరుగుతుంది. అందుకే షామ్లి కౌన్సిలర్ల ఘర్షణ చోటుచేసుకొంది. ప్రతి ఒక్కరూ సొంతంగా భద్రతను ఏర్పాటు చేసుకున్న తర్వాత సమీక్షా సమావేశాలకు వెళ్లాలి. ఇది భాజపా పాలనలో మనం నేర్చుకోవాల్సిన పాఠం’ అని అఖిలేశ్ మండిపడ్డారు.

‘తప్పుగా అనువదించి.. క్షమాపణలు చెప్పిన సీఎం..!’

షామ్లిలో రూ. నాలుగు కోట్ల విలువైన అభివృద్ధి పనుల గురించి చర్చించేందుకు కౌన్సిలర్లు ఈ సమావేశానికి వచ్చినట్లు మీడియా కథనాలు వెల్లడించాయి. అయితే, ఈ ఘర్షణ సమయంలో మున్సిపల్‌ ఛైర్మన్‌, స్థానిక ఎమ్మెల్యే అక్కడే ఉండటం గమనార్హం.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని