Delhi: ఇథియోపియా విమానం కాక్‌పిట్‌లో పొగలు.. దిల్లీలో అత్యవసర ల్యాండింగ్‌

ఇథియోపియా రాజధాని అడిస్ అబాబాకు బయలుదేరిన విమాన కాక్‌పిట్‌లో పొగలు వ్యాపించాయి. దీంతో విమానాన్ని తిరిగి దిల్లీలోనే అత్యవసరంగా ల్యాండ్‌ చేశారు. 

Updated : 14 Sep 2023 10:59 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: బయల్దేరిన కొద్దిసేపటికే కాక్‌పిట్‌లో పొగ వ్యాపించడంతో ఓ విమానాన్ని తిరిగి దిల్లీలో అత్యవసరంగా ల్యాండ్‌ చేశారు. ఈ ఘటన దిల్లీ (Delhi) నుంచి ఇథియోపియా రాజధాని అడిస్ అబాబా (Addis Ababa) బయలుదేరిన విమానంలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే..

ఇథియోపియన్ ఎయిర్ లైన్స్‌ (Ethiopian Airlines)కు చెందిన ET 687 బోయింగ్‌ 777-8 విమానం  240 మందికిపైగా ప్రయాణికులతో దిల్లీ నుంచి బయలుదేరింది. టేకాఫ్‌ అయిన కొద్దిసేపటికే విమాన కాక్‌పిట్‌ నుంచి కాలుతున్న వాసన రావడం మొదలైంది. చూస్తుండగానే కాక్‌పిట్‌లో పొగలు వ్యాపించాయి. దీంతో అప్రమత్తమైన పైలట్‌  గ్రౌండ్‌ కంట్రోల్‌ విభాగానికి సమాచారం అందించి .. విమానాన్ని తిరిగి దిల్లీ ఎయిర్‌ పోర్టుకు మళ్లించి అత్యవసర ల్యాండింగ్‌ చేశారు. అయితే, ఈ ఘటనలో ఎవరూ గాయపడలేదు.

తెలుగు విద్యార్థిని మృతి కేసులో అమెరికా పోలీసుల తీరుపై స్పందించిన భారత్‌.. దర్యాప్తునకు డిమాండ్‌..!

‘‘ఒక్కసారిగా విమానం మొత్తం పొగ వ్యాపించింది. దాంతో మాకు ఏమీ తోచలేదు. మేమంతా భయాందోళనకు గురయ్యాం. కాసేపటికి విమానాన్ని తిరిగి దిల్లీలో ల్యాండ్‌ చేశారు. అదృష్టవశాత్తు ఎలాంటి ప్రమాదం జరగలేదు. అందరం సురక్షితంగా బయటపడ్డాం’’ అని ఒక ప్రయాణికుడు తెలిపారు. ఈ ఘటనపై ఇథియోపియన్ ఎయిర్ లైన్స్‌ ఇంతవరకు స్పందించలేదు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని