Prajwal Revanna: ప్రజ్వల్‌ రేవణ్ణపై అరెస్ట్‌ వారెంట్‌ జారీ

Prajwal Revanna: లైంగిక ఆరోపణలు ఎదుర్కొంటున్న జేడీఎస్‌ ఎంపీ ప్రజ్వల్‌ రేవణ్ణపై ఎంపీ, ఎమ్మెల్యేల ప్రత్యేక న్యాయస్థానం అరెస్ట్‌ వారెంట్‌ జారీ చేసింది.

Updated : 19 May 2024 13:28 IST

 

Prajwal Revanna | బెంగళూరు: మహిళలపై లైంగిక దౌర్జన్య ఆరోపణలు ఎదుర్కొంటున్న హాసన ఎంపీ ప్రజ్వల్‌ రేవణ్ణపై (Prajwal Revanna) అరెస్ట్‌ వారెంట్‌ జారీ అయ్యింది. ఎంపీ, ఎమ్మెల్యేల ప్రత్యేక న్యాయస్థానం శనివారం వారెంట్‌ జారీ చేసింది. ఈ కేసుపై ఏర్పాటు చేసిన ప్రత్యేక దర్యాప్తు బృందం (SIT) ముందు విచారణకు హాజరు కాకపోవటంతో అధికారులు కోర్టును ఆశ్రయించారు.

మూడు వారాలుగా పరారీలో ఉన్న ప్రజ్వల్‌ (Prajwal Revanna) జర్మనీ నుంచి లండన్‌కు రైల్లో వెళ్లాడని సిట్‌ ధ్రువీకరించుకుంది. ఇప్పటికే పలుసార్లు భారత్‌కు టికెట్లు బుక్‌ చేసుకొని రద్దు చేసుకున్నట్లు గుర్తించింది. దీంతో చేసేది లేక కోర్టును ఆశ్రయించి సిట్‌ అరెస్టు వారెంటును జారీ చేసింది. ఇప్పటికే ప్రజ్వల్‌పై ఇంటర్‌పోల్‌ బ్లూ కార్నర్ నోటీసు జారీ అయిన విషయం తెలిసిందే. ఆయన్ని మరింత కట్టడి చేసేందుకు బ్యాంక్‌ ఖాతాలపై అధికారులు దృష్టి సారించారు.

తనకు బదులు మరొకరిని వైద్య పరీక్షలకు పంపి..

ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న ప్రజ్వల్‌ (Prajwal Revanna) తండ్రి హెచ్‌.డి.రేవణ్ణ ప్రస్తుతం బెయిల్‌పై బయటకొచ్చారు. అంతకుముందు ఆయన ఏడు రోజులు జైల్లో ఉన్న విషయం తెలిసిందే. దోషిగా తేలితే ప్రజ్వల్‌పై చర్యలకు మాకు ఎలాంటి అభ్యంతరం లేదని ఆయన తాత, మాజీ ప్రధాని హెచ్‌.డి.దేవేగౌడ శనివారం స్పష్టం చేశారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని