Ashok Gehlot: కేంద్రమంత్రి ఆడియో క్లిప్‌ లీక్‌ చేయమన్నారు: రాజస్థాన్‌ మాజీ సీఎం గహ్లోత్‌పై ఆరోపణలు

ఫోన్‌ ట్యాపింగ్ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న మాజీ అధికారి ఒకరు రాజస్థాన్‌ మాజీ సీఎం అశోక్‌ గహ్లోత్‌ (Ashok Gehlot)పై తీవ్ర ఆరోపణలు చేశారు. 

Updated : 25 Apr 2024 12:29 IST

దిల్లీ: రాజస్థాన్ మాజీ ముఖ్యమంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత అశోక్‌ గహ్లోత్‌ (Ashok Gehlot)పై తీవ్ర ఆరోపణలు వచ్చాయి. ఒకప్పటి ఆయన సహాయకుడే వీటిని చేశారు. గహ్లోత్‌ తనకు కొందరు మంత్రుల ఆడియో క్లిప్స్ ఇచ్చి వాటిని మీడియాకు విడుదల చేయాలని చెప్పినట్లు పేర్కొన్నారు. 

ఐపీఎల్‌ స్ట్రీమింగ్‌ కేసు.. నటి తమన్నాకు సమన్లు

ఫోన్‌ట్యాపింగ్ (Illegal phone tapping case ) కేసులో గహ్లోత్‌ వద్ద ఓఎస్‌డీగా పనిచేసిన లోకేశ్‌ కుమార్‌ విచారణ ఎదుర్కొంటున్నారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ‘‘ఈ కేసులో దిల్లీలోని క్రైమ్‌ బ్రాంచ్‌ తనను ఎన్నిసార్లు విచారించినా ఇప్పటివరకు మౌనంగా ఉన్నాను. కానీ, అసలు ఈ ఘటనకు కారకులైన వ్యక్తి నన్ను వదిలించుకోవాలని నిర్ణయించుకున్నారు. సోషల్ మీడియా ద్వారా రికార్డింగ్స్‌ నాకు అందాయని నేను గతంలో చెప్పాను. అది నిజం కాదు. కేంద్రమంత్రి గజేంద్ర సింగ్‌ షెకావత్, కాంగ్రెస్ నేత భన్వర్‌లాల్ శర్మతో సహా మరికొందరి వాయిస్‌లను గహ్లోత్‌ నాకు ఓ పెన్‌డ్రైవ్‌లో ఇచ్చారు. వాటిని మీడియాకు విడుదల చేయమని చెప్పారు. మాజీ సీఎం నాయకత్వంలోని సమస్యల గురించి చెప్పేందుకు సచిన్‌ పైలట్‌, ఆయన సన్నిహితులు కాంగ్రెస్ హై కమాండ్‌ వద్దకు వెళ్లారని తెలియగానే వారి ఫోన్లను ట్యాప్‌ చేయించారు. అలాగే పైలట్‌ ముఖ్యమంత్రి అయ్యే అవకాశాలను దెబ్బతీశారు. గహ్లోత్‌ ప్రభుత్వాన్ని పడగొట్టడం వెనక భాజపా ఉందనడం నిజం కాదు’’ అని ఆరోపించారు. ఫోన్‌ రికార్డింగ్స్ గురించి తమ ఇద్దరి మధ్య జరిగినట్లుగా ఉన్న క్లిప్స్‌ను లోకేశ్‌ మీడియా సమావేశంలో వినిపించారు. ఆయన స్వప్రయోజనాల కోసం ప్రజలను ఉపయోగించుకొని,  తర్వాత వారిని వదిలేస్తారని వ్యాఖ్యలు చేశారు. ఈ రికార్డింగ్స్‌లో తన ప్రమేయం లేదని చెప్పారు. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు