SCO meet: షాంఘై సదస్సులో ‘ఆషికీ 2’ పాట.. వీడియో వైరల్‌

షాంఘై సదస్సు (SCO meet) ప్రారంభోత్సవానికి సంబంధించిన ఓ వీడియో ప్రస్తుతం వైరల్‌ అవుతోంది. ఆ కార్యక్రమంలో ఓ భారతీయ పాటను గాయకులు ఆలపించి ఆకట్టుకున్నారు.

Published : 26 Oct 2023 14:59 IST

ఇంటర్నెట్ డెస్క్‌: కిర్గిస్థాన్‌ వేదికగా షాంఘై సహకార సదస్సు (SCO meet) ప్రారంభమైంది. ఈ సదస్సు ప్రారంభోత్సవ కార్యక్రమంలో అరుదైన సన్నివేశం కన్పించింది. ఓ భారతీయ పాట (Indian song)ను ఈ వేడుకలో ఆలపించారు. ఇందుకు సంబంధించిన వీడియోను భారత విదేశాంగ మంత్రి ఎస్‌. జైశంకర్‌ (S Jaishankar) తన ఎక్స్‌ ఖాతాలో పంచుకున్నారు.

బుధవారం సాయంత్రం జరిగిన ఈ సదస్సు ప్రారంభోత్సవంలో ప్రముఖ బాలీవుడ్‌ చిత్రం ‘ఆషికీ 2 ('Aashiqui 2)’లోని ‘తుమ్‌ హి హో (Tum Hi Ho)’ పాటను గాయకులు లైవ్‌లో పాడి ఆకట్టుకున్నారు. ప్రస్తుతం ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. 

కిర్గిస్థాన్‌లోని బిష్కెక్‌లో ప్రారంభమైన ఈ సదస్సుకు ప్రధాని మోదీ తరఫున జైశంకర్‌ హాజరయ్యారు. సదస్సులో భాగంగా సభ్య దేశాల మంత్రులతో ఆయన ద్వైపాక్షిక సమావేశాలు జరపనున్నారు. షాంఘై సహకార సదస్సు గ్రూప్‌లో భారత్‌, చైనా, ఇరాన్‌, కజకిస్థాన్‌, కిర్గిస్థాన్‌, పాకిస్థాన్‌, రష్యా, తజకిస్థాన్‌, ఉజ్బెకిస్థాన్‌ సభ్య దేశాలుగా ఉన్నాయి.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని