Rajnath Singh: స్వతంత్ర భారత చరిత్రలో తొలిసారి.. రూ.21 వేల కోట్లు దాటిన రక్షణ ఎగుమతులు

2023-24లో రూ.21,083 కోట్ల మేర రక్షణ ఎగుమతులు సాధించామని, రూ.21 వేల కోట్ల మార్కు దాటడం స్వతంత్ర భారత చరిత్రలో ఇదే తొలిసారని రక్షణశాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ వెల్లడించారు.

Published : 01 Apr 2024 19:37 IST

దిల్లీ: భారత్‌ నుంచి రక్షణ రంగ ఎగుమతులు (Defence Exports) ఆల్‌ టైం గరిష్ఠానికి చేరుకున్నాయి. 2023- 24 ఆర్థిక సంవత్సరంలో ఏకంగా రూ.21,083 కోట్ల మేర రక్షణ ఉత్పత్తులు, సాంకేతికతలను విదేశాలకు సరఫరా చేసినట్లు రక్షణశాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ (Rajnath Singh) వెల్లడించారు. స్వతంత్ర భారత చరిత్రలో ఈ రంగంలో రూ.21వేల కోట్ల మార్కును అధిగమించడం ఇదే తొలిసారని ‘ఎక్స్‌’ వేదికగా ప్రకటించారు.

‘‘దేశ రక్షణ ఎగుమతులు సరికొత్త శిఖరాగ్రాన్ని తాకాయి. 2023-24లో ఇది రూ.21,083 కోట్లకు చేరుకుంది. గత ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే 32.5 శాతం వృద్ధి నమోదైంది. ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలోని ప్రభుత్వం.. రక్షణరంగంలో తయారీ, ఎగుమతులను ప్రోత్సహించేందుకు అనేక కార్యక్రమాలు చేపట్టింది. ప్రభుత్వ, ప్రైవేటు పరిశ్రమలు ఇటీవల సంవత్సరాల్లో గణనీయమైన పనితీరును కనబర్చాయి’’ అని రాజ్‌నాథ్‌ ట్వీట్‌ చేశారు.

రష్యా సైన్యంలో భారతీయులు.. స్పందించిన జై శంకర్‌

2024-25 నాటికి ఈ ఎగుమతులను రూ.35 వేల కోట్లకు చేర్చాలని కేంద్రం లక్ష్యంగా పెట్టుకుంది. ఈ క్రమంలోనే.. ‘మేక్‌ ఇన్‌ ఇండియా’ స్ఫూర్తితో దేశీయ రక్షణ ఉత్పత్తి రంగాన్ని ప్రోత్సహించేందుకు పలు చర్యలు తీసుకుంటోంది. అధికారిక వివరాల ప్రకారం.. 2022-23 ఆర్థిక సంవత్సరంలో ఈ ఎగుమతుల విలువ రూ.15,920 కోట్లు, 2021-22 రూ.12,814 కోట్లు, 2020-21లో రూ.8,434 కోట్లు, 2019-20లో రూ.9,115 కోట్లు, 2018-19లో రూ.10,745 కోట్లుగా ఉంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని