Swati Maliwal assault case: స్వాతి మాలీవాల్‌పై దాడి ఘటన.. కేజ్రీవాల్‌ తల్లిదండ్రులను ప్రశ్నించనున్న పోలీసులు

Swati Maliwal assault case: ఆప్‌ రాజ్యసభ ఎంపీ స్వాతి మాలీవాల్‌పై దాడి కేసులో సీఎం కేజ్రీవాల్‌ తల్లిదండ్రులను దిల్లీ పోలీసులు ప్రశ్నించనున్నట్లు తెలుస్తోంది.

Updated : 23 May 2024 12:44 IST

దిల్లీ: ఆమ్‌ ఆద్మీ పార్టీ రాజ్యసభ సభ్యురాలు స్వాతి మాలీవాల్‌ (Swati Maliwal assault case)పై దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌ సహాయకుడు బిభవ్‌ కుమార్‌ (Kejriwal PA Bibhav Kumar) దాడి వ్యవహారం దేశ రాజధాని రాజకీయాలను కుదిపేస్తోంది. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు ముమ్మరంగా దర్యాప్తు చేస్తున్నారు. సీఎం నివాసంలోనే తనపై దాడి జరిగినట్లు ఎంపీ ఫిర్యాదు చేయడంతో అక్కడి సీసీటీవీ దృశ్యాలను పరిశీలిస్తున్నారు. ఇదే సమయంలో కేజ్రీవాల్‌ (Arvind Kejriwal) తల్లిదండ్రులను కూడా పోలీసులు ప్రశ్నించనున్నట్లు తెలుస్తోంది.

అనారోగ్యంతో బాధపడుతున్న తమ వృద్ధ తల్లిదండ్రులను విచారించేందుకు దిల్లీ పోలీసులు సిద్ధమయ్యారంటూ సీఎం నిన్న రాత్రి ‘ఎక్స్‌’లో పోస్ట్‌ చేశారు. ఈ క్రమంలోనే గురువారం ఉదయం సివిల్‌ లైన్స్‌లోని కేజ్రీవాల్‌ అధికారిక నివాసానికి పోలీసులు రానున్నట్లు ఆప్‌ వర్గాలు వెల్లడించాయి. సీఎం తల్లిదండ్రులతో పాటు ఆయన సతీమణి సునీత నుంచి వాంగ్మూలం తీసుకోనున్నట్లు తెలిపాయి. అయితే సీఎం తల్లిదండ్రులను నేడు ప్రశ్నించబోమని పోలీసులు చెప్పినట్లు తెలుస్తోంది.

మాలీవాల్‌పై దాడి కేసు.. బిభవ్‌ మళ్లీ దిల్లీకి తరలింపు

స్వాతి మాలీవాల్‌పై దాడి ఘటనపై కేజ్రీవాల్‌ నిన్న తొలిసారిగా స్పందించిన సంగతి తెలిసిందే. ‘‘ఈ ఘటనపై సమగ్ర విచారణ జరుగుతుందని ఆశిస్తున్నా. న్యాయం జరగాలి. ఈ కేసులో రెండు కోణాలు ఉన్నాయి. ఇరుపక్షాల వైపు నిష్పక్షపాతంగా విచారణ జరిపినప్పుడే సరైన న్యాయం అందుతుంది. ప్రస్తుతం ఈ అంశం న్యాయస్థానం పరిధిలో ఉన్నందున.. ఏమీ మాట్లాడలేను’’ అని ఆయన తెలిపారు. మరోవైపు, తనపై ఉద్దేశపూర్వకంగానే ఆప్‌ (AAP) నేతలు ఆరోపణలు చేస్తున్నారని స్వాతి దుయ్యబట్టారు. తన వ్యక్తిగత ఫొటోలు లీక్‌ చేసేందుకు కుట్రలు జరుగుతున్నాయని ఆమె ఆందోళన వ్యక్తం చేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని