Fire Accident: మధ్యప్రదేశ్ సచివాలయంలో భారీ అగ్నిప్రమాదం

Fire Accident: మధ్యప్రదేశ్ సచివాలయంలో శనివారం భారీ అగ్నిప్రమాదం జరిగింది. మూడో అంతస్తులో పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి.

Updated : 09 Mar 2024 12:21 IST

భోపాల్‌: మధ్యపద్రేశ్‌ (Madhya Pradesh) రాజధాని భోపాల్‌లోని రాష్ట్ర సచివాలయం (secretariat) ‘వల్లభ్‌ భవన్‌’లో భారీ అగ్నిప్రమాదం (Fire Accident) జరిగింది. ఈ బహుళ అంతస్తుల భవనంలోని మూడో అంతస్తులో శనివారం ఉదయం మంటలు చెలరేగాయి. భవనం నుంచి పెద్ద ఎత్తున పొగలు రావడంతో గుర్తించిన పారిశుద్ధ్య కార్మికులు వెంటనే అధికారులను అప్రమత్తం చేశారు.

సమాచారమందుకున్న అగ్నిమాపక సిబ్బంది హుటాహుటిన అక్కడకు చేరుకుని.. 20 అగ్నిమాపక యంత్రాలతో సహాయక చర్యలు చేపట్టారు. ప్రస్తుతం మంటలు అదుపులోకి వచ్చాయని అధికారులు వెల్లడించారు. ఘటనలో ఎవరికీ ఎలాంటి హానీ జరగలేదు. మూడో అంతస్తులో భద్రపర్చిన కొన్ని కీలక డాక్యుమెంట్లు కాలిపోయినట్లు తెలుస్తోంది. ప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు