కేరళలో దోషికి మరణదండన, 92 ఏళ్ల జైలుశిక్ష.. జరిమానా

ఆరేళ్ల బాలుడిని హత్య చేసి, అతడి సోదరి (14)పై అత్యాచారం జరిపిన కేసులో దోషి సునీల్‌కుమార్‌ (44)కు కేరళలోని ఇడుక్కి స్పెషల్‌ పోక్సో కోర్టు శనివారం మరణదండనతోపాటు ఏకంగా 92 ఏళ్ల జైలుశిక్ష విధించింది.

Published : 23 Jul 2023 04:30 IST

ఈటీవీ భారత్‌: ఆరేళ్ల బాలుడిని హత్య చేసి, అతడి సోదరి (14)పై అత్యాచారం జరిపిన కేసులో దోషి సునీల్‌కుమార్‌ (44)కు కేరళలోని ఇడుక్కి స్పెషల్‌ పోక్సో కోర్టు శనివారం మరణదండనతోపాటు ఏకంగా 92 ఏళ్ల జైలుశిక్ష విధించింది. రూ.9.91 లక్షల జరిమానా వేసింది. డబ్బు కట్టకపోతే.. మరో 11 ఏళ్లు అదనంగా శిక్ష అనుభవించాలని తీర్పునిచ్చింది. విడివిడిగా నాలుగు యావజ్జీవ శిక్షలు, ఇతర సెక్షన్ల కింద కోర్టు వేసిన శిక్షాకాలం కలిపితే 92 ఏళ్లు అవుతుంది. ఇడుక్కి జిల్లాలోని అణాంచల్‌ సమీపంలో 2021 అక్టోబర్‌ 2వ తేదీ తెల్లవారుజామున తలుపులు పగులగొట్టి బాధితుల ఇంట్లోకి సునీల్‌ ప్రవేశించాడు. మొదట బాలుడి తలపై సుత్తితో కొట్టి చంపాడు. ఓ వృద్ధురాలిపై, పక్క గదిలో ఉన్న మహిళ తలపైనా దాడి చేశాడు. బాలికను షెడ్డులోకి తీసుకువెళ్లి అత్యాచారానికి పాల్పడ్డాడు. సునీల్‌ బాధితుల బంధువేనని.. కుటుంబ వివాదాల కారణంగా ఇలా చేశాడని దర్యాప్తులో తేలింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని