బడికి వెళ్లాలంటే.. కొండలు ఎక్కాల్సిందే

ఉత్తరాఖండ్‌లో భారీవర్షాల కారణంగా కొండచరియలు విరిగిపడి రోడ్లు దెబ్బతినడంతో రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడి ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు.

Published : 09 Aug 2023 08:51 IST

ఉత్తరాఖండ్‌లో భారీవర్షాల కారణంగా కొండచరియలు విరిగిపడి రోడ్లు దెబ్బతినడంతో రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడి ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. చమోలీ జిల్లాలోని గోపేశ్వర్‌ గ్రామ విద్యార్థులు బడికి వెళ్లేందుకు ఏకంగా కొండలనే ఎక్కాల్సి వస్తోంది. ఈ ఊరి చుట్టూ ఉన్న దాదాపు 30కు పైగా రోడ్లు మూసుకుపోయాయి. దీంతో కొండలు ఎక్కేందుకు చిన్నారులు.. తల్లిదండ్రుల సహాయం తీసుకొంటున్నారు. కొండలు ఎక్కుతున్న సమయంలో జారి కిందపడతారేమోనని తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గోపేశ్వర్‌తోపాటు చుట్టుపక్కల మరో రెండు మూడు గ్రామాల్లో ఇవే పరిస్థితులు ఉన్నట్లు చమోలీ జిల్లా కలెక్టర్‌ తెలిపారు. 150 మంది విద్యార్థులు ఇక్కడి నుంచి స్కూలుకు వెళుతున్నారని, వారికోసం ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తామని చెప్పారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని