మణిపుర్‌లో రెచ్చిపోయిన మిలిటెంట్లు

ఈశాన్య రాష్ట్రం మణిపుర్‌లో మిలిటెంట్లు రెచ్చిపోయారు. బిష్ణుపుర్‌ జిల్లాలోని భద్రతా సిబ్బంది శిబిరంపై రెండు గంటల పాటు కాల్పులకు తెగబడ్డారు.

Published : 28 Apr 2024 05:08 IST

భద్రతా సిబ్బంది శిబిరంపై 2 గంటల పాటు కాల్పులు
ఇద్దరు జవాన్ల మృతి, మరో ఇద్దరికి గాయాలు

ఇంఫాల్‌: ఈశాన్య రాష్ట్రం మణిపుర్‌లో మిలిటెంట్లు రెచ్చిపోయారు. బిష్ణుపుర్‌ జిల్లాలోని భద్రతా సిబ్బంది శిబిరంపై రెండు గంటల పాటు కాల్పులకు తెగబడ్డారు. ఈ ఘటనలో ఇద్దరు సీఆర్పీఎఫ్‌ సిబ్బంది అమరులయ్యారు. మరో ఇద్దరికి గాయాలయ్యాయి. నరన్‌సైనా ప్రాంతంలోని ఇండియా రిజర్వ్‌ బెటాలియన్‌ శిబిరంపై శుక్రవారం అర్ధరాత్రి దాటిన తర్వాత మిలిటెంట్లు కాల్పులకు దిగినట్లు అధికారులు తెలిపారు. కొండ ప్రాంతం నుంచి విచక్షణారహితంగా కాల్పులు జరపడంతో పాటు బాంబులు విసిరినట్లు పేర్కొన్నారు. ఈ ఘటనలో సీఆర్పీఎఫ్‌ సబ్‌ ఇన్‌స్పెక్టర్‌ ఎన్‌.సర్కార్‌, హెడ్‌ కానిస్టేబుల్‌ అరూప్‌ సైనీ మరణించగా, మరో ఇద్దరు జవాన్లు గాయపడినట్లు వెల్లడించారు. దాడికి పాల్పడిన వారి ఆచూకీ కోసం గాలింపు చర్యలు చేపట్టినట్లు పోలీసులు తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని