ఉత్తరాఖండ్‌ అడవిలో మంటలు.. రంగంలోకి ఐఏఎఫ్‌ హెలికాప్టర్‌

ఉత్తరాఖండ్‌లోని నైనీతాల్‌ జిల్లాలోని అడవిలో చెలరేగిన మంటలను అదుపుచేసేందుకు అధికారులు శనివారం భారత వైమానిక దళ హెలికాప్టర్‌ను రంగంలోకి దించారు.

Published : 28 Apr 2024 05:25 IST

దేహ్రాదూన్‌: ఉత్తరాఖండ్‌లోని నైనీతాల్‌ జిల్లాలోని అడవిలో చెలరేగిన మంటలను అదుపుచేసేందుకు అధికారులు శనివారం భారత వైమానిక దళ హెలికాప్టర్‌ను రంగంలోకి దించారు. శుక్రవారమే ఇక్కడి పైన్‌ ఏరియాలోని హైకోర్టు కాలనీకి సమీపంలోకి మంటలు రావడంతో ఈ నిర్ణయం తీసుకున్నారు. ఇక్కడి కాలనీలోని ఇళ్ల దగ్గరకు, ఐదు కిలోమీటర్ల దూరంలోని ఆర్మీ కంటోన్మెంట్‌ సమీపంలోకి మంటలు చేరువవుతుండడంతో భారత వాయుసేనకు చెందిన ఎంఐ-17 వి5 హెలికాప్టర్‌ సహాయంతో అగ్నికీలలను అదుపు చేసేందుకు యత్నిస్తున్నారు. ‘‘నైనీతాల్‌లోని వాయుసేన స్థావరం సమీపంలోని అటవీ ప్రాంతం వరకు మంటలు వచ్చేస్తుండడంతో ఎంఐ-17 వి5 హెలికాప్టర్‌తో బాంబీ బకెట్‌ ఆపరేషన్‌ ప్రారంభించాం’’ అని భారత వాయుసేన ఎక్స్‌ వేదికగా తెలిపింది. మరోవైపు, అడవికి నిప్పు పెట్టేందుకు యత్నిస్తున్న ముగ్గురు వ్యక్తులను రుద్రప్రయాగ్‌లో అధికారులు అరెస్టు చేశారు. అడవిలో కార్చిచ్చులకు సంబంధించి తాజాగా 31 ఘటనలు చోటుచేసుకున్నాయని,  82.38 ఎకరాల విస్తీర్ణంలో అడవి ధంసమైందని వివరించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని