నా ముఖం కాదు.. మార్కులు చూడండి

‘చాణక్యుడిని కూడా అందంగా లేడని వేధించారు. అవేవీ అతనిపై ప్రభావం చూపలేదు. నేను అంతే నాపై వచ్చిన ట్రోల్‌లు నన్ను పెద్దగా బాధించలేదు.

Published : 29 Apr 2024 04:17 IST

ట్రోలర్లకు యూపీ టాపర్‌ దీటైన జవాబు

ఇంటర్నెట్‌డెస్క్‌: ‘చాణక్యుడిని కూడా అందంగా లేడని వేధించారు. అవేవీ అతనిపై ప్రభావం చూపలేదు. నేను అంతే నాపై వచ్చిన ట్రోల్‌లు నన్ను పెద్దగా బాధించలేదు. నా మార్కులు ముఖ్యం. ముఖంపై ఉన్న వెంట్రుకలు కాదు’ అని తనపై సామాజిక మాధ్యమంలో వచ్చిన ట్రోల్స్‌కు ధీటుగా సమాధానం చెబుతోంది ఉత్తర్‌ప్రదేశ్‌ టాపర్‌. పిన్న వయసులోనే హుందాగా వ్యవహరిస్తూ తనను అవహేళన చేస్తున్న వారి ఆట కట్టిస్తోంది. అసలేం జరిగిందంటే..ఉత్తర్‌ప్రదేశ్‌లో ఈ నెల 20న పదో తరగతి పరీక్ష ఫలితాలు వెలువడ్డాయి. ఈ పరీక్షల్లో ప్రాచీ నిగమ్‌ 98.5శాతంతో టాపర్‌గా నిలిచింది. దీంతో ఆమె చిత్రాలు మీడియాలో వచ్చాయి. హార్మోన్లలో మార్పుల కారణంగా ముఖంపై అవాంఛిత రోమాలు ఉండటంతో ఆమెను సోషల్‌మీడియాలో ట్రోల్‌ చేయడం మొదలుపెట్టారు. దీనిపై స్పందించిన కాంగ్రెస్‌ పార్టీ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ, ఆమె భర్త రాబర్ట్‌ వాద్రా బాలికను అభినందించారు. ఆన్‌లైన్‌ ట్రోలింగ్‌ను పట్టించుకోవద్దని ధైర్యం చెప్పారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని