ఈ పానీపూరీ మోదీ చాలా నీట్‌ గురూ

గుజరాత్‌లో ప్రధాని మోదీని పోలిన ఒకాయన పానీపూరీ సెంటర్‌ నిర్వహిస్తూ అందరినీ ఆకట్టుకుంటున్నారు. ఆయన్ను చూసి నిజంగా మోదీయేనా అంటూ అక్కడికి వచ్చిన వారు అవాక్కవుతున్నారు.

Published : 29 Apr 2024 04:20 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: గుజరాత్‌లో ప్రధాని మోదీని పోలిన ఒకాయన పానీపూరీ సెంటర్‌ నిర్వహిస్తూ అందరినీ ఆకట్టుకుంటున్నారు. ఆయన్ను చూసి నిజంగా మోదీయేనా అంటూ అక్కడికి వచ్చిన వారు అవాక్కవుతున్నారు. అనిల్‌ భాయ్‌ ఠక్కర్‌ అనే వ్యక్తి గుజరాత్‌లోని ఆనంద్‌లో పానీపూరీ సెంటర్‌ నడుపుతున్నారు. చూడడానికి అచ్చం మోదీలానే హెయిర్‌ స్టైల్‌, తెల్లని గడ్డంతో ఉన్నారు. దీంతో స్థానికులు, అక్కడికి వచ్చిన వారంతా ఆయనతో సెల్ఫీలు దిగి సోషల్‌ మీడియాలో పంచుకుంటున్నారు. వారంతా తనపై చాలా ప్రేమ, గౌరవం చూపిస్తూ ‘మోదీ’ అని పిలుస్తారని అనిల్‌ భాయ్‌ సంతోషంగా చెబుతున్నారు. ‘‘ఈ స్ట్రీట్‌ఫుడ్‌ విక్రేత అచ్చం మోదీని పోలి ఉన్నారు. కేవలం రూపాన్ని మాత్రమే కాదు.. ప్రధాని విలువల నుంచి చాలా స్ఫూర్తి పొందారు. పరిశుభ్రతకు మోదీ ఇస్తున్న ప్రాధాన్యతను అనుసరిస్తూ తన స్టాల్‌ను కూడా ఎంతో శుభ్రంగా ఉంచారు’’ అంటూ ఓ ఫుడ్‌ వ్లాగర్‌ క్యాప్షన్‌ జోడించి ఇన్‌స్టాగ్రామ్‌ వేదికగా పంచుకున్నారు. దీంతో ఆ వీడియో కాస్తా నెట్టింట చక్కర్లు కొడుతోంది. దీన్ని చూసిన నెటిజన్లు ఆశ్చర్యపోతూ కామెంట్లు చేస్తున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని