ఎన్‌సీఎస్‌సీ ఛైర్‌పర్సన్‌గా విజయ్‌ సాంప్లా

భాజపా నేత, కేంద్ర మాజీ మంత్రి విజయ్‌ సాంప్లా షెడ్యూల్డ్‌ కులాల జాతీయ కమిషన్‌ (ఎన్‌సీఎస్‌సీ) ఛైర్‌పర్సన్‌గా రెండోసారి నియమితులయ్యారు. ఈమేరకు రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ బుధవారం

Published : 28 Apr 2022 05:21 IST

దిల్లీ: భాజపా నేత, కేంద్ర మాజీ మంత్రి విజయ్‌ సాంప్లా షెడ్యూల్డ్‌ కులాల జాతీయ కమిషన్‌ (ఎన్‌సీఎస్‌సీ) ఛైర్‌పర్సన్‌గా రెండోసారి నియమితులయ్యారు. ఈమేరకు రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ బుధవారం నియామక ఉత్తర్వులను జారీ చేశారు. గతంలో ఇదే పదవిలో ఉన్న సాంప్లా ఈ ఏడాది జరిగిన పంజాబ్‌ అసెంబ్లీ ఎన్నికలకు ముందు రాజీనామా చేశారు. అనంతరం ఆ ఎన్నికల్లో పోటీచేశారు. 2014లో పంజాబ్‌లోని హోశియార్‌పుర్‌ లోక్‌సభ స్థానం నుంచి ఎన్నికైన ఆయన అనంతరం కేంద్ర మంత్రిగా బాధ్యతలు చేపట్టారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

    ap-districts
    ts-districts

    సుఖీభవ

    చదువు