Viral video: లిఫ్ట్‌లో ఇరుక్కుపోయిన చిన్నారి.. 20 నిమిషాలు నరకయాతన

లఖ్‌నవూలోని ఓ అపార్ట్‌మెంట్‌ లిఫ్ట్‌లో బాలిక చిక్కుకున్న వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా (Viral Video) మారింది.

Published : 05 Oct 2023 01:57 IST

Image: divya_gandotra

లఖ్‌నవూ: దేశంలోని పలు ప్రధాన నగరాల్లో అపార్ట్‌మెంట్ల సంఖ్య పెరుగుతోంది. నివాసితుల సౌకర్యం కోసం అపార్ట్‌మెంట్ల నిర్వాహకులు వాటిలో లిఫ్ట్‌లు ఏర్పాటు చేస్తున్నారు. అయితే, నిర్వహణ కొరవడటం కారణంగా లిఫ్ట్‌లు తరచూ మధ్యలోనే ఆగిపోతుంటాయి. కొన్నిసార్లు అవి ప్రమాదవశాత్తూ కూలిపోయిన ఘటనలూ మనం చూస్తున్నాం. తాజాగా ఉత్తరప్రదేశ్‌ (Uttar pradesh)లోని లఖ్‌నవూలో ఓ అపార్ట్‌మెంట్‌ లిఫ్ట్‌లో బాలిక చిక్కుకున్న వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. దాదాపు 20 నిమిషాల పాటు లిఫ్ట్‌ తలుపులు తెరుచుకోకపోవడంతో ఆ చిన్నారి నరకయాతన అనుభవించింది. 

కుల్గాం జిల్లాలో ఎన్‌కౌంటర్‌.. ఇద్దరు ఉగ్రవాదులు హతం

వివరాల్లోకి వెళితే.. లఖ్‌నవూలోని కుర్సీ రోడ్‌లో జానేశ్వర్‌ ఎన్‌క్లేవ్ ఉంది. ఈ అపార్ట్‌మెంట్‌ సముదాయంలో నివసిస్తున్న ఓ బాలిక బుధవారం మధ్యాహ్నం లిఫ్ట్‌ ఎక్కింది. అది మధ్యలోనే ఆగిపోవడంతో ఒంటరిగా ఉన్న ఆ బాలిక తీవ్ర భయాందోళనకు గురైంది. అయినా ధైర్యం తెచ్చుకుని తలుపులు తెరవడానికి తన వంతు ప్రయత్నం చేసింది. అది రాకపోయేసరికి బిగ్గరగా అరవడం మొదలుపెట్టింది. తనను ఎవరైనా రక్షించాలని ఆమె కెమెరా వైపు చూసి ప్రాధేయపడుతున్న సీసీటీవీ దృశ్యాలు వెలుగులోకి వచ్చాయి. ఆ సమయంలో బాలిక స్కూల్ డ్రెస్‌లో కన్పిస్తోంది. దాదాపు 20 నిమిషాల తరువాత బాలికను లిఫ్ట్‌లో నుంచి సురక్షితంగా బయటకు తీసుకొచ్చినట్లు తెలిసింది.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని