ప్రతి సీజన్‌లో భాగస్వామిని మార్చేసే.. సహజీవన బంధాలపై హైకోర్టు ఘాటు వ్యాఖ్యలు

వివాహ వ్యవస్థ అందించే సామాజిక భద్రత సహజీవన సంబంధాలు (Live-In Relationships) ఇవ్వలేవని అలహాబాద్‌ హైకోర్టు అభిప్రాయం వ్యక్తం చేసింది. అలాగే ఈ బంధాలపై ఆందోళ వ్యక్తం చేసింది.

Published : 02 Sep 2023 13:03 IST

అలహాబాద్‌: సహజీవన సంబంధాల (Live-In Relationships)పై అలహాబాద్‌ హైకోర్టు ఘాటు వ్యాఖ్యలు చేసింది. భారత్‌లోని వివాహ వ్యవస్థ (institution of marriage)ను ఒక క్రమంలో ధ్వంసం చేసేలా ఈ సహజీవన వ్యవస్థ పని చేస్తోందని ఆందోళన వ్యక్తం చేసింది. అత్యాచార ఆరోపణలు ఎదుర్కొంటున్న సహజీవన భాగస్వామికి బెయిల్ మంజూరు చేస్తూ ఈ వ్యాఖ్యలు చేసింది. 

ఒక వ్యక్తికి వివాహ వ్యవస్థ అందించే సామాజిక భద్రత, అంగీకారం, స్థిరత్వం.. సహజీవన సంబంధాలు అందించవు. ప్రతి సీజన్‌లో భాగస్వామిని మార్చే ఈ క్రూరమైన భావన ఒక స్థిరమైన, ఆరోగ్యవంతమైన సమాజానికి లక్షణంగా పరిగణించలేం. వివాహ వ్యవస్థ కనుమరుగైన తర్వాతే మన దగ్గర ఈ బంధం సాధారణమవుతుంది. వివాహ వ్యవస్థలో భాగస్వామితో నిజాయతీగా లేకపోవడం, సహజీవన సంబంధాల (Live-In Relationships)ను కలిగి ఉండటం ప్రగతిశీల సమాజానికి సూచనలుగా చెలామణీ అవుతున్నాయి. అలాంటి ధోరణికి యువత ఆకర్షితులు కావడం పెరుగుతోంది. ఈ తీరుతో దీర్ఘకాలంలో చోటుచేసుకునే పరిణామాల పట్ల అవగాహన లేకపోవడమే అందుకు కారణం

- అలహాబాద్‌ హైకోర్టు

వివాహేతర సంబంధాల సంతానానికీ.. తల్లిదండ్రుల ఆస్తిలో హక్కు: సుప్రీం

పెళ్లి చేసుకుంటానని నమ్మించి, ఇచ్చిన మాట తప్పాడని ఉత్తర్‌ప్రదేశ్‌కు చెందిన 19 ఏళ్ల యువతి తన సహజీవన భాగస్వామిపై కేసు పెట్టింది. తాను గర్భవతినని, తన భాగస్వామి పెళ్లికి అంగీకరించడం లేదని అందులో పేర్కొంది. అలాగే అత్యాచార ఆరోపణలు కూడా చేసింది. ఈ కేసులో నిందితుడికి బెయిల్‌ మంజూరు చేస్తూ కోర్టు పై వ్యాఖ్యలు చేసింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని