Himanta Biswa Sarma: మనమూ 60 పేర్లు పెట్టేద్దాం : చైనాతో వివాదం వేళ ఆ సీఎం వ్యాఖ్యలు వైరల్

చైనా(China) కుయుక్తులకు కేంద్ర ప్రభుత్వం దీటుగా స్పందించాలని అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ అన్నారు.

Published : 03 Apr 2024 15:50 IST

గువాహటి: వాస్తవాధీన రేఖ వెంబడి సరిహద్దు వివాదం కొనసాగుతున్న వేళ చైనా (China) కవ్వింపు చర్యలకు పాల్పడుతూనే ఉంది. భారత్‌ (India)లో అంతర్భాగమైన అరుణాచల్‌ ప్రదేశ్‌ (Arunachal Pradesh)లోని ప్రాంతాలకు మరోసారి అధికారికంగా పేర్లు పెట్టి, రెచ్చగొట్టేందుకు యత్నించింది. ఈ సమయంలో అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ (Himanta Biswa Sarma) చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి.

‘‘చైనాను ఎదురుదెబ్బ కొట్టేలా మనం స్పందించాలి. కేంద్ర ప్రభుత్వంలోని అంశం కావడంతో దీనిపై నేను ఎక్కువగా స్పందించాలని అనుకోవడం లేదు. అయితే వారు 30 ప్రాంతాలకు పేర్లు పెడితే.. మనం 60 ప్రదేశాలకు పేర్లు మార్చాలి. చైనా అధీనంలోని ప్రాంతంలో 60 కొత్త పేర్లు విడుదల చేయాలని కేంద్రాన్ని అభ్యర్థిస్తున్నాను’’ అని శర్మ వ్యాఖ్యలు చేశారు.

భారీ భూకంపం.. ఊగిపోయిన ఫ్లైఓవర్‌

ఇదిలాఉంటే.. చైనా కుయుక్తులను ఇప్పటికే భారత ప్రభుత్వం ఖండించిన సంగతి తెలిసిందే.  విదేశాంగమంత్రి ఎస్‌. జై శంకర్ మాట్లాడుతూ.. ‘‘నేనొచ్చి మీ ఇంటి పేరు మారిస్తే.. ఆ ఇల్లు నాదవుతుందా..? అరుణాచల్‌ ప్రదేశ్‌ ఎల్లప్పుడూ భారత్‌లో అంతర్భాగమే. పేర్లు మార్చడం వంటి చర్యలతో ఎలాంటి ప్రభావం ఉండదు. వాస్తవాధీన రేఖ వద్ద మన సైన్యం ఉంది’’ అని స్పష్టం చేశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని