Indian navy: భారత్‌ సరికొత్త నౌకా విధ్వంసక క్షిపణి పరీక్ష

భారత్‌ తొలిసారి గగనతలం నుంచి ప్రయోగించే నౌకా విధ్వంసక క్షిపణిని బుధవారం విజయవంతంగా పరీక్షించింది. దీనిని డిఫెన్స్‌ రీసెర్చి అండ్‌ డెవలప్‌మెంట్‌ ఆర్గనైజేషన్‌ అభివృద్ధి చేసింది.

Published : 18 May 2022 20:09 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: భారత్‌ తొలిసారి గగనతలం నుంచి ప్రయోగించే నౌకా విధ్వంసక క్షిపణిని బుధవారం విజయవంతంగా పరీక్షించింది. దీనిని డిఫెన్స్‌ రీసెర్చి అండ్‌ డెవలప్‌మెంట్‌ ఆర్గనైజేషన్‌ అభివృద్ధి చేసింది. దీనికి సంబంధించిన ఫుటేజీని ఇండియన్‌ నేవీ ట్విటర్‌లో పోస్టు చేసింది. భారత్‌ ఆయుధ పరీక్షా కేంద్రమైన ఒడిశాలోని బాలాసోర్‌ నుంచి ఈ క్షిపణిని సీకింగ్‌ 42బీ హెలికాప్టర్‌ నుంచి ప్రయోగించారు. మరో హెలికాప్టర్‌తో క్షిపణి మార్గాన్ని గమనించారు.

గగనతలం నుంచి ప్రయోగించేలా భారత్‌ తయారు చేసిన తొలి నౌకా విధ్వంసక క్షిపణి ఇదే అని డీఆర్‌డీవో పేర్కొంది. ఈ క్షిపణి విజయవంతంగా ‘సీ స్కిమ్మింగ్‌ ట్రజెక్టరి’ ప్రకారం ప్రయాణించి నిర్దేశిత లక్ష్యాన్ని ఛేదించినట్లు వెల్లడించింది. ఈ క్షిపణి నియంత్రణ, గైడెన్స్‌, మెషిన్‌ అల్గొరిథమ్స్‌ పనితీరును విశ్లేషించినట్లు తెలిపింది. టెస్ట్‌ రేంజి మొత్తం, ప్రభావం చూపించే పాయింట్లలో ముఖ్యమైన సెన్సర్లను ఏర్పాటు చేసి ఈ ప్రయోగం మొత్తాన్ని రికార్డు చేశారు. భారత్‌ స్వయం సమృద్ధి దిశగా ఈ పరీక్ష కీలక ముందడుగని నావికాదళం అభివర్ణించింది. ఈ క్షిపణిలో చాలా రకాల కొత్త టెక్నాలజీలను వినియోగించినట్లు వెల్లడించింది. దీనిలో వాడిన లాంఛర్‌ను కూడా పూర్తిగా దేశీయంగానే అభివృద్ధి చేసినట్లు వివరించింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని