Rajasthan: అవాక్కైన డాక్టర్లు..! పొట్టలో మేకులు.. సూదులు.. తాళం చెవులు

కడుపు నొప్పితో బాధపడుతోన్న ఓ యువకుడికి శస్త్రచికిత్స చేసిన వైద్యులు.. అతని పొట్టలో నుంచి మేకులు, సూదులు, బోల్టుల వంటి లోహాపు వస్తువుల్ని తొలగించారు.

Published : 29 May 2024 00:06 IST

జైపుర్‌: కడుపు నొప్పితో బాధపడుతోన్న ఓ యువకుడికి శస్త్రచికిత్స నిర్వహించిన వైద్యులకు ఊహించని షాక్‌ తగిలింది. అతని పొట్టలో నుంచి మేకులు, సూదులు, తాళం చెవులు, నట్లు, బోల్టుల వంటి లోహాపు వస్తువులు బయటపడటం గమనార్హం. రాజస్థాన్‌ (Rajasthan) రాజధాని జైపుర్‌లో ఈ వ్యవహారం వెలుగుచూసింది.

ఆస్పత్రి వైద్యులు తెలిపిన వివరాల ప్రకారం.. తీవ్ర కడుపు నొప్పితో బాధపడుతూ ఓ యువకుడు (21) ఇటీవల జైపుర్‌లోని సవాయ్‌ మాన్‌సింగ్‌ ఆస్పత్రిలో చేరాడు. దీంతో వైద్యులు అతడికి ఎక్స్‌రే, సీటీ స్కాన్‌ వంటి పరీక్షలు నిర్వహించారు. ఈ క్రమంలోనే అతడి పొట్టలో ఇనుప వస్తువులు పేరుకుపోయినట్లు గుర్తించారు. వాటిలో కొన్ని పెద్ద పేగులోకీ వెళ్లిపోయినట్లు గమనించారు. దీంతో వైద్య బృందం అతడికి లాప్రోస్కోపీ, కొలనోస్కోపీ నిర్వహించింది. దాదాపు మూడు గంటలపాటు శస్త్రచికిత్స నిర్వహించి ఆ వస్తువులను తొలగించినట్లు వైద్యులు వెల్లడించారు. రోగి ఆరోగ్య పరిస్థితి ప్రస్తుతం స్థిరంగా ఉందని చెప్పారు.

దొరకని శరీర భాగాలు.. మిస్టరీగానే బంగ్లా ఎంపీ మృతి ఘటన!

అయితే.. ఆ యువకుడి మానసిక స్థితి సరిగ్గా లేదని, ఈ క్రమంలోనే ఇనుప మేకులు, సూదులు వంటివాటిని మింగినట్లు అంతకుముందు అతడి కుటుంబ సభ్యులు తెలిపారు. ఈ క్రమంలోనే నొప్పి రావడంతో తొలుత ఆళ్వార్‌లోని ఆస్పత్రికి తరలించామని, అనంతరం జైపుర్‌కు తీసుకొచ్చినట్లు చెప్పారు. మరోవైపు.. సరైన చికిత్స కోసం అతడి మానసిక పరిస్థితిని విశ్లేషిస్తున్నట్లు వైద్యులు తెలిపారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని