Swachh Survekshan Awards: ‘క్లీన్‌ సిటీ’గా ఏడోసారి ఇందౌర్‌.. టాప్‌ 10లో తెలుగు రాష్ట్రాల నగరాలు

Swachh Survekshan Awards: దేశంలో అత్యంత పరిశుభ్ర నగరాల జాబితాలో తెలుగు రాష్ట్రాలు సత్తా చాటాయి. టాప్‌10లో నాలుగు స్థానాలు దక్కించుకున్నాయి. వరుసగా ఏడోసారి ఇందౌర్‌ క్లీన్‌ సిటీగా నిలిచింది.

Updated : 11 Jan 2024 15:22 IST

దిల్లీ: మధ్యప్రదేశ్‌లోని ఇందౌర్‌ (Indore) నగరం మరోసారి సత్తా చాటింది. దేశంలోనే అత్యంత పరిశుభ్ర నగరాల జాబితాలో తొలి స్థానం దక్కించుకొంది. 2023 సంవత్సరానికి గానూ ప్రకటించిన స్వచ్ఛ సర్వేక్షణ్‌ అవార్డు (Swachh Survekshan Awards 2023)ల్లో వరుసగా ఏడోసారి కైవసం చేసుకుంది.

ఈ ఏడాది ఇందౌర్‌తో పాటు గుజరాత్‌లోని సూరత్‌ (Surat) కూడా సంయుక్తంగా తొలి ర్యాంక్‌ దక్కించుకుంది. నవీ ముంబయి ఈ జాబితాలో మూడో స్థానంలో నిలిచింది. తెలుగు రాష్ట్రాలకు చెందిన విశాఖపట్నం (4), విజయవాడ(6), తిరుపతి (8), హైదరాబాద్‌ (9) నగరాలు టాప్‌-10లో ఉన్నాయి.

రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము గురువారం ఈ అవార్డులను ప్రదానం చేశారు. ఈ కార్యక్రమంలో కేంద్రమంత్రి హర్దీప్‌సింగ్‌ పురి పాల్గొన్నారు. పరిశుభ్రతలో ఉత్తమ ప్రదర్శన కనబర్చిన రాష్ట్రాల్లో మహారాష్ట్ర అగ్రస్థానంలో ఉంది. మధ్యప్రదేశ్‌, ఛత్తీస్‌గఢ్‌ రెండు, మూడు స్థానాల్లో నిలిచాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు