Kangana Ranaut: బాలీవుడ్‌పై కంగన ఫైర్‌.. కాసేపటికే పోస్టు డిలీట్‌

విమానాశ్రయంలో తనకు జరిగిన చేదు అనుభవంపై బాలీవుడ్ నటీనటుల నుంచి స్పందన రాకపోవడంపై నటి కంగనా రనౌత్‌ (Kangana Ranaut) తనదైన శైలిలో విమర్శలు చేశారు. 

Updated : 07 Jun 2024 14:27 IST

ముంబయి: బాలీవుడ్‌ నటి, భాజపా ఎంపీ కంగనా రనౌత్‌ (Kangana Ranaut)ను చండీగఢ్‌ విమానాశ్రయంలో ఓ సీఐఎస్‌ఎఫ్‌ మహిళా కానిస్టేబుల్‌ దాడి చేసిన ఘటన కలకలం సృష్టించిన సంగతి తెలిసిందే. విజయోత్సాహంలో ఉన్న ఆమెకు ఈ అనూహ్య పరిణామం షాకిచ్చింది. దీనిపై ఇన్‌స్టా వేదికగా స్పందించిన ఆమె.. తర్వాత తన పోస్టులో కొంతభాగాన్ని తొలగించారు. 

‘‘All eyes on Rafah గ్యాంగ్‌.. ఇది మీకు మీ పిల్లలకు కూడా జరగొచ్చు. ఒకరిపై జరిగిన దాడిని మీరు వేడుక చేసుకుంటే.. అదే ఘటన మీకూ ఎదురుకావొచ్చు. అలాంటి పరిస్థితికి సిద్ధంగా ఉండండి’’ అని ఇన్‌స్టా స్టోరీలో షేర్ చేశారు. ‘‘నామీద ఎయిర్‌పోర్టులో జరిగిన ఘటనపై మీరు మౌనంగా ఉండొచ్చు లేక వేడుక చేసుకుంటూ ఉండొచ్చు. భవిష్యత్తులో మీరు మనదేశంలో అయినా, విదేశాల్లో అయిన అలా రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తుంటే.. ఇజ్రాయెల్‌ లేక పాలస్తీనాకు చెందినవారు మీపై లేక మీ పిల్లలపై దాడికి పాల్పడొచ్చు. ఇజ్రాయెల్ బందీల కోసమో లేక రఫా కోసం మీ అభిప్రాయం చెప్పినందుకు అలా జరగొచ్చు. అప్పుడు మీ వాక్‌స్వాతంత్ర్యం హక్కుల కోసం నేను పోరాడుతున్నానని గుర్తిస్తారు. నేను అలాచేస్తున్నందుకు మీరు ఆశ్చర్యపోతారు. ఎందుకంటే నేను మీలాగా కాదు కదా’’ అని వ్యాఖ్యానించారు. తర్వాత ఆ పోస్టును డిలీట్ చేశారు. 

కంగనా రనౌత్‌కు చెంపదెబ్బ

ఇజ్రాయెల్‌-హమాస్‌ మధ్య కాల్పుల విరమణకు అభ్యర్థిస్తూ సినీ నటీనటులు ‘‘ఆల్‌ ఐస్ ఆన్ రఫా’’ అని రాసి ఉన్న ఒక ఇమేజ్‌ను షేర్ చేసిన సంగతి తెలిసిందే. అలియా భట్‌, ప్రియాంకా చోప్రా, కరీనా కపూర్, వరుణ్ ధావన్ తదితరులంతా దానిని షేర్ చేసిన వారిలో ఉన్నారు. తనపై దాడి ఘటనపై వారి నుంచి ఎలాంటి స్పందన లేకపోవడమే ఆమె ఆగ్రహానికి కారణమై ఉండొచ్చని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. గురువారం విమానాశ్రయంలో భద్రతా తనిఖీ చేసుకొని ముందుకు వెళుతున్న కంగనపై అక్కడ విధులు నిర్వహిస్తున్న సీఐఎస్‌ఎఫ్‌ మహిళా కానిస్టేబుల్‌ కుల్విందర్‌ కౌర్‌ దాడి చేసిన సంగతి తెలిసిందే. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని