Arvind Kejriwal: కస్టడీలో క్షీణించిన కేజ్రీవాల్‌ ఆరోగ్యం.. ఆప్‌ వర్గాల వెల్లడి

Arvind Kejriwal: ఈడీ కస్టడీలో ఉన్న దిల్లీ సీఎం అరవింద్‌ కేజ్రీవాల్‌ షుగర్‌ లెవల్స్ పడిపోయినట్లు తెలుస్తోంది. ఈమేరకు ఆప్‌ వర్గాలు ఆరోపించాయి.

Published : 27 Mar 2024 16:50 IST

దిల్లీ: మద్యం విధానానికి (Delhi excise policy Scam case) సంబంధించిన మనీలాండరింగ్‌ కేసులో అరెస్టయిన దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌ (Arvind Kejriwal:) ప్రస్తుతం ఈడీ (ED) కస్టడీలో ఉన్నారు. అయితే గత కొన్ని రోజులుగా ఆయన ఆరోగ్యం క్షీణించినట్లు తెలుస్తోంది. డయాబెటిక్‌తో బాధపడుతున్న ఆయనకు కస్టడీలో షుగర్‌ లెవల్స్‌ దారుణంగా పడిపోయాయని ఆమ్‌ఆద్మీ పార్టీ వర్గాలు ఆరోపించాయి.

‘‘చక్కెర స్థాయిల్లో తీవ్ర హెచ్చుతగ్గులు ఉంటున్నట్లు తెలుస్తోంది. ఒక దశలో షుగర్‌ లెవల్‌ 46ఎంజీ స్థాయికి పడిపోయింది. ఇది అత్యంత ప్రమాదకర పరిస్థితి అని వైద్యులు చెబుతున్నారు’’ అని ఆప్‌ వర్గాలు పేర్కొన్నాయి. అంతకుముందు కేజ్రీవాల్‌ సతీమణి సునీత కూడా తన వీడియో సందేశంలో ఈ విషయాన్ని ప్రస్తావించారు. ‘‘ఈడీ కస్టడీలో ఉన్న ఆయనను కలిసినప్పుడు షుగర్‌ లెవల్స్‌ పడిపోతున్నట్లు చెప్పారు. ఆయన ఆరోగ్యంగా ఉండాలని ప్రార్థిద్దాం’’ అని అన్నారు.

ఆ డబ్బు ఎక్కడుందో కేజ్రీవాల్‌ రేపు కోర్టులో చెబుతారు: సతీమణి సంచలన ప్రకటన

కేజ్రీవాల్‌ కస్టడీ గురువారం (మార్చి 28)తో ముగియనుంది. రేపు ఆయనను కోర్టులో హాజరుపర్చనున్నారు. ఆ సమయంలో కేసు గురించి నిజాలన్నీ సీఎం బయటపెడతారని సునీత తెలిపారు. మద్యం కేసులో డబ్బుకు సంబంధించిన ఆధారాలను ఇవ్వనున్నట్లు పేర్కొన్నారు. మరోవైపు, తన అరెస్టును సవాల్‌ చేస్తూ సీఎం దాఖలు చేసిన పిటిషన్‌పై దిల్లీ హైకోర్టు నేడు విచారణ జరుపుతోంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని