Ayodhya: శ్రీరాముడి ఆశీస్సులు కొనసాగాలని ప్రార్థిద్దాం: మారిషస్‌ ప్రధాని

Ayodhya: శ్రీరాముడి ప్రాణప్రతిష్ఠ సందర్భంగా మారిషస్‌లోనూ ప్రత్యేక వేడుకలు నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా అధికారులకు రెండు గంటల ప్రత్యేక సెలవు కూడా ప్రకటించారు.

Updated : 22 Jan 2024 09:25 IST

అయోధ్య: అయోధ్యలో శ్రీరాముడి ప్రాణప్రతిష్ఠ (consecration of the Ram temple) వేడుకలను  యావత్‌ దేశంతో పాటు విదేశాల్లోనూ నిర్వహించుకుంటున్నారు. భారత్‌తో సన్నిహిత సంబంధాలున్న మారిషస్‌లోనూ ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ఈ సందర్భంగా ఆ దేశ ప్రధానమంత్రి  ప్రవింద్‌ కుమార్‌ జగన్నాథ్‌ ప్రత్యేక సందేశం ఇచ్చారు. ‘‘శ్రీరాముడు అయోధ్యకు తిరిగొస్తున్న వేళ మనమంతా సంతోషిద్దాం. మన మార్గంపై వెలుగులు ప్రసరింపజేసి శాంతి, శ్రేయస్సు వైపు అడుగులు వేసేలా ఆయన బోధనలు, ఆశీస్సులు కొనసాగాలని ప్రార్థిద్దాం. జై హింద్‌’’ అని ‘ఎక్స్‌’లో పోస్ట్‌ చేశారు.

రామరాజ్యం బోధిస్తున్న రాజధర్మం!

అంతకుముందు అయోధ్య రామమందిర (Ayodhya Ram Mandir) ప్రారంభోత్సవానికి మారిషస్‌ ఎలా సిద్ధమవుతుందో.. ఆ దేశ హై కమిషనర్‌ హేమండోయల్ దిల్లుం జనవరి 15న వివరించారు. మారిషస్‌ ప్రజలంతా ఐక్యంగా ఈ ఆధ్వాత్మిక వేడుకను నిర్వహించుకోవడానికి సిద్ధమయ్యారని చెప్పారు. దేశంలోని అన్ని ఆలయాల్లో దీపాలు వెలిగించనున్నట్లు తెలిపారు. మందిరాలన్నీ రామనామ జపంతో మార్మోగనున్నట్లు వెల్లడించారు. ఈ వేడుక కేవలం భారతీయులకేగాక మారిషస్‌ ప్రజలకూ చాలా ప్రత్యేకమని వివరించారు. ప్రాణప్రతిష్ఠ (consecration of the Ram temple) కార్యక్రమాన్ని వీక్షించడంతో పాటు స్థానికంగా చేపడుతున్న ప్రత్యేక కార్యక్రమాల్లో పాల్గొనేందుకు వీలుగా మారిషస్‌లోని అధికారులకు రెండు గంటల ప్రత్యేక సెలవు కూడా ప్రకటించినట్లు హై కమిషనర్‌ తెలిపారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని