Sharad Pawar: పుతిన్‌కు మోదీకీ తేడా లేదు: శరద్‌ పవార్‌

ప్రజాస్వామ్యాన్ని ప్రధాని మోదీ నెమ్మదిగా నాశనం చేస్తున్నారంటూ ఎన్సీపీ (శరద్‌ పవార్‌) అధినేత శరద్‌ పవార్‌ ఆరోపించారు. ఆయనను రష్యా అధ్యక్షుడు పుతిన్‌తో పోల్చారు.

Published : 15 Apr 2024 00:10 IST

ముంబయి: ప్రధాని నరేంద్ర మోదీ (PM Modi)పై నేషనలిస్ట్‌ కాంగ్రెస్‌ పార్టీ (శరద్‌ పవార్‌) అధినేత శరద్‌ పవార్‌ (Sharad Pawar) కీలక వ్యాఖ్యలు చేశారు. మోదీని రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్‌ పుతిన్‌తో పోల్చారు. ప్రధాని దేశ ప్రజాస్వామ్యాన్ని ప్రమాదంలో పడేస్తున్నారని ఆరోపించారు. షోలాపూర్ జిల్లాలోని అక్లూజ్‌లో విలేకరులతో మాట్లాడిన ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.

‘‘రష్యా అధ్యక్షుడు పుతిన్‌ ప్రజాస్వామ్యాన్ని నెమ్మదిగా నాశనం చేస్తున్నారు. అచ్చం అలాగే మోదీ ప్రవర్తిస్తున్నారు. ప్రతిపక్షంలో ఎవరూ ఎన్నికవ్వాలని ఆయన కోరుకోవడం లేదు. ఇద్దరి తీరు ఒకేలా ఉంది. ఎన్నికల కోడ్‌ అమలులో ఉండగానే.. ఒక ముఖ్యమంత్రి (సీఎం కేజ్రీవాల్‌ను ఉద్దేశిస్తూ)ని అరెస్టు చేశారు. ప్రజాస్వామ్యాన్ని నెమ్మదిగా నాశనం చేస్తున్నారు. ఈ చర్య నిరంకుశత్వం వైపు దేశాన్ని మళ్లించడమే అవుతుంది’’ అని పవార్‌ ఆరోపించారు.

అందుకే భారత్‌లో విపక్షాలు బలహీనపడ్డాయ్‌: అమర్త్య సేన్‌

భాజపా మేనిఫెస్టోపై వేసిన ప్రశ్నకు స్పందించిన శరద్‌.. ‘‘ప్రజాస్వామ్యంలో అధికార పార్టీలా ప్రతిపక్షం కూడా ముఖ్యమే. భాజపా మేనిఫెస్టోపై వ్యాఖ్యానించడం ఇది సరైన సమయం కాదు’’ అని అన్నారు. మాధా, షోలాపూర్‌ ఎంపీ స్థానాల అభ్యర్థుల ఎంపికపై చర్చించేందుకు మాజీ డిప్యూటీ సీఎం విజయ్‌సింగ్‌ మోహితే పాటిల్‌ నివాసానికి వెళ్లిన సందర్భంగా శరద్‌ పవార్‌ ఈ వ్యాఖ్యలు చేశారు. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని