Amol Kale: ముంబయి క్రికెట్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడి హఠాన్మరణం

ముంబయి క్రికెట్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు అమోల్‌ కాలే (47) అమెరికాలోని న్యూయార్క్‌లో గుండెపోటుతో ప్రాణాలు కోల్పోయారు.

Updated : 10 Jun 2024 20:21 IST

న్యూయార్క్‌: ముంబయి క్రికెట్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు, వ్యాపారవేత్త అమోల్‌ కాలే (47) హఠాన్మరణం చెందారు. అమెరికాలోని న్యూయార్క్‌లో ఆయన (Amol Kale) గుండెపోటుతో ప్రాణాలు కోల్పోయారు. టీ-20 వరల్డ్‌ కప్‌ (T20 World Cup)లో భాగంగా భారత్‌- పాకిస్థాన్‌ మ్యాచ్‌ వీక్షించేందుకుగానూ ఆయన అసోసియేషన్‌ సభ్యులతో కలిసి అమెరికాకు వెళ్లారు.

కేంద్ర క్యాబినెట్‌కు రాజీనామా వార్తలు.. క్లారిటీ ఇచ్చిన సురేశ్‌ గోపి

మహారాష్ట్రలోని నాగ్‌పుర్‌కు చెందిన అమోల్‌.. 2022లో ఎంసీఏ అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడణవీస్‌కు సన్నిహితుడిగా పేరుంది. బీసీసీఐ ఆటగాళ్లకు ఇచ్చే మ్యాచ్ ఫీజులనే ముంబయి జట్టు సభ్యులకూ ఇచ్చేందుకు ముందుకురావడం, ముంబయిలోని వాంఖడే స్టేడియంలో భారత మాజీ క్రికెటర్‌ సచిన్ తెందూల్కర్ విగ్రహాన్ని ఏర్పాటుచేయడం వంటి ఎంసీఏ కీలక నిర్ణయాలు ఆయన హయాంలో తీసుకున్నవే. ఆయన పదవీ కాలంలోనే ముంబయి జట్టు 2023-24 సీజన్‌ ‘రంజీ ట్రోఫీ’ని కైవసం చేసుకుంది. ‘తితిదే’ బోర్డు సభ్యుడిగానూ ఉన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని