‘ఆ పోస్టు డిలీట్‌ చేసి, క్షమాపణలు చెప్పండి’: కాంగ్రెస్‌కు కేంద్రమంత్రి నోటీసు

ఇంటర్వ్యూలో తాను మాట్లాడిన మాటలను కాంగ్రెస్(Congress) వక్రీకరించిందని, ఆ పార్టీ వెంటనే క్షమాపణలు చెప్పాలని కేంద్రమంత్రి నితిన్‌ గడ్కరీ(Nitin Gadkari) డిమాండ్ చేశారు. 

Updated : 02 Mar 2024 14:14 IST

దిల్లీ: తాను మాట్లాడిన మాటలను వక్రీకరించి, సామాజిక మాధ్యమాల్లో పెట్టిన పోస్టుపై కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ(Nitin Gadkari) ఆగ్రహం వ్యక్తం చేశారు. దీనిపై కాంగ్రెస్(Congress) అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, జనరల్‌ సెక్రటరీ జైరాం రమేశ్‌కు లీగల్ నోటీసులు పంపారు.

తమిళనాట సీతారామన్‌, జైశంకర్‌లను పోటీకి దింపాలి : అన్నాడీఎంకే నేత

‘గ్రామస్థులు, పేదలు, రైతులు, కూలీలు సంతోషంగా లేరు. గ్రామాల్లో మంచి రోడ్లు లేవు. తాగునీరు, మంచి ఆసుపత్రులు, పాఠశాలలు అందుబాటులో లేవు’ అంటూ గడ్కరీ మాట్లాడినట్టుగా ఉన్న వీడియోను కాంగ్రెస్ పోస్టు చేసింది. ఈ ప్రభుత్వ హయాంలో తీసుకుంటున్న చర్యల గురించి తాను చేసిన ప్రసంగాన్ని వక్రీకరించి ఈ పోస్టు పెట్టిందంటూ మంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘ఆ సందర్భం ఉద్దేశాన్ని బయటపెట్టకుండా, అర్థం మారేలా ఆ క్లిప్పింగ్‌లో మార్పులు చేశారు. ప్రజల్లో గందరగోళం సృష్టించేందుకు, నన్ను కించపరిచేందుకు కాంగ్రెస్ నేతలు చేసిన ప్రయత్నమిది. భారతీయ జనతా పార్టీలో సైద్ధాంతిక చీలికను సృష్టించేందుకు, సభ్యులను రెచ్చగొట్టే దురుద్దేశపూర్వక చర్యే ఇది’ అని తన నోటీసులో గడ్కరీ విమర్శించారు.

నోటీసు అందించిన 24 గంటల్లో ఆ పోస్టును తొలగించాలని డిమాండ్ చేశారు. అలాగే మూడు రోజుల్లోగా రాతపూర్వక క్షమాపణలు చెప్పాలని అందులో పేర్కొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని