Gujarat: దేశంలోనే అతి పొడవైన తీగల వంతెన ప్రారంభం..!

దేశంలోనే అతి పొడవైన తీగల వంతెనను ప్రధాని నరేంద్ర మోదీ నేడు ప్రారంభించారు. 

Updated : 25 Feb 2024 10:59 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: దేశంలోనే అతి పొడవైన తీగల వంతెనను ప్రధాని నరేంద్ర మోదీ (PM Modi) గుజరాత్‌లోని ద్వారకలో నేడు ప్రారంభించారు. 2.3 కిలోమీటర్ల పొడవున్న దీనికి సుదర్శన్‌ సేతు అని పేరు పెట్టారు. ఇది ఓఖా ప్రాంతాన్ని బెట్‌ ద్వారకాతో అనుసంధానిస్తుంది. ద్వారకాదీశ్‌ ఆలయ సందర్శనకు వచ్చే యాత్రికులకు ఇది చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. మొత్తం రూ.979 కోట్ల వ్యయంతో దీనిని నిర్మించారు. 2017 అక్టోబర్‌లో మోదీ ఈ వంతెన నిర్మాణానికి శంకుస్థాపన చేశారు.

రాజ్యాంగం సవివర పరిష్కార సూచిక కాదు |

మొత్తం 27.20 మీటర్ల వెడల్పుతో నాలుగు వరుసలతో నిర్మించిన ఈ బ్రిడ్జ్‌పై 2.5 మీటర్ల వెడల్పైన ఫుట్‌పాత్‌ కూడా ఉంది. దీనిపై రెండు వైపులా భగవద్గీత శ్లోకాలు, శ్రీకృష్ణుడి చిత్రాలు ఉంచారు. ఈ వంతెనపై పలు చోట్ల సోలార్‌ ప్యానళ్లు ఏర్పాటు చేసి ఒక మెగావాట్‌ విద్యుత్తు ఉత్పత్తి చేయనున్నారు. ద్వారకా పట్టణానికి ఓఖా పోర్టు దాదాపు 30 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఇక్కడి బెట్‌ ద్వారకా ద్వీపంలో ఉన్న ద్వారకాదీశ్‌ ఆలయంలో ప్రధాని పూజలు చేయనున్నారు.

నేటి మధ్యాహ్నం గుజరాత్‌ (రాజ్‌కోట్‌), ఆంధ్రప్రదేశ్‌ (మంగళగిరి), పంజాబ్‌, ఉత్తర్‌ప్రదేశ్‌లో నూతనంగా నిర్మించిన ఎయిమ్స్‌లను ప్రధాని ప్రారంభించనున్నారు. వీటి నిర్మాణానికి కేంద్రం రూ.6,300 కోట్లు వెచ్చించింది.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు