Runway Excursion: భారీ వర్షం.. రన్‌వేపై జారిన విశాఖ- ముంబయి విమానం!

విశాఖపట్నం నుంచి ముంబయికి బయల్దేరిన ఓ ప్రైవేటు విమానం.. ముంబయి విమానాశ్రయంలో రన్‌వేపై జారింది. భారీ వర్షాల కారణంగా ఈ ప్రమాదం చోటుచేసుకున్నట్లు సమాచారం.

Updated : 14 Sep 2023 22:13 IST

ముంబయి: ముంబయి అంతర్జాతీయ విమానాశ్రయం (Mumbai Airport)లో ప్రమాదం చోటుచేసుకుంది. విశాఖపట్నం నుంచి ముంబయికి బయల్దేరిన వీఎస్‌ఆర్‌ వెంచర్స్‌కు చెందిన ఓ ప్రైవేటు విమానం (Learjet 45) ఇక్కడ ల్యాండ్‌ అవుతుండగా.. ప్రమాదవశాత్తు రన్‌వేపై జారి (Runway Excursion), పక్కకు దూసుకెళ్లింది. ప్రమాద సమయంలో విమానంలో ఆరుగురు ప్రయాణికులు, ఇద్దరు సిబ్బంది ఉన్నారు. ఈ ఘటనలో విమానం రెండు ముక్కలు కాగా.. ఎనిమిది మందికీ గాయాలయ్యాయి. వారందరిని ఆస్పత్రికి తరలించారు.

విమానం కాక్‌పిట్‌లో పొగలు.. దిల్లీలో అత్యవసర ల్యాండింగ్‌

ముంబయిలో ప్రస్తుతం భారీ వర్షాలు కురుస్తున్నాయని, 700 మీటర్లకు మించి దృశ్యగోచరత లేదని డీజీసీఏ వెల్లడించింది. రన్‌వే 27పై ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ఘటన నేపథ్యంలో రన్‌వేను కొద్దిసేపు మూసేశారు. ఆ సమయంలో ముంబయిలో దిగాల్సిన తమ అయిదు విమానాలను వేరే ఇతర ప్రాంతాలకు మళ్లించినట్లు విస్తారా ఎయిర్‌లైన్స్‌ తెలిపింది. సహాయక చర్యల అనంతరం.. డీజీసీఏ, ఏటీసీ అనుమతితో రన్‌వే కార్యకలాపాలను పునరుద్ధరించారు. మరోవైపు.. ప్రమాదానికి సంబంధించిన దృశ్యాలు వైరల్‌గా మారాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని