Manipur: మహిళలపై అమానుషం.. మణిపుర్‌లో భారీ నిరసన ర్యాలీ

Manipur Video: మణిపుర్‌లో మహిళలను నగ్నంగా ఊరేగించిన ఘటనను నిరసిస్తూ స్థానికులు భారీ ర్యాలీ చేపట్టారు. మరోవైపు నిందితుల కోసం కూంబింగ్‌ ఆపరేషన్‌ చేపట్టినట్లు సీఎం వెల్లడించారు.

Updated : 20 Jul 2023 20:05 IST

ఇంఫాల్‌: ఈశాన్య రాష్ట్రం మణిపుర్‌ (Manipur)లో ఇద్దరు మహిళలను నగ్నంగా ఊరేగించిన అమానుష ఘటన యావత్‌ దేశాన్ని తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది. ఈ దారుణాన్ని నిరసిస్తూ రాష్ట్ర ప్రజలు గురువారం భారీ ర్యాలీ చేపట్టారు. మణిపుర్‌లోని చురచంద్‌పుర్‌ జిల్లాలో వేలాది మంది ప్రజలు నల్లదుస్తులు ధరించి నిరసన ప్రదర్శన చేపట్టారు. బాధిత మహిళలకు న్యాయం జరగాలని, నిందితులను కఠినంగా శిక్షించాలని డిమాండ్‌ చేశారు. భారీ వర్షాన్ని సైతం లెక్కచేయకుండా స్థానికులు పెద్ద ఎత్తున ఈ ర్యాలీలో పాల్గొన్నారు.

నగ్నంగా మహిళల ఊరేగింపు.. వీడియోలు తొలగించాలని కేంద్రం ఆదేశాలు..!

నిందితుల కోసం కూంబింగ్‌ ఆపరేషన్‌: సీఎం

వాస్తవానికి ఈ ఘటన మే 4వ తేదీన చోటుచేసుకోగా.. బుధవారం ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో కన్పించింది. దీంతో ఈ దారుణం వెలుగులోకి వచ్చింది. ఘటన నేపథ్యంలో రాష్ట్ర ముఖ్యమంత్రి బీరేన్‌ సింగ్‌ (N Biren Singh)పై విమర్శలు వస్తున్నాయి. ఈ క్రమంలోనే స్పందించిన సీఎం..  ఘటనపై దర్యాప్తు జరుగుతోందని, బాధ్యులను కఠినంగా శిక్షిస్తామని హామీ ఇచ్చారు.

మరోవైపు.. ఘటనకు కారణమైన ప్రధాన నిందితుడిని ఇప్పటికే పోలీసులు అరెస్టు చేశారు. మిగతా నిందితుల కోసం అనుమానిత ప్రాంతాల్లో కూంబింగ్‌ ఆపరేషన్‌ చేపట్టినట్లు సీఎం తెలిపారు. అటు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ అయిన వీడియో ఎక్కడి నుంచి వచ్చిందో తెలుసుకోవాలని సైబల్‌ క్రైమ్‌ సెల్‌ను ఆదేశించినట్లు వెల్లడించారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని