Rajnath Singh: లాలూజీ.. వాళ్లను దారిలో పెట్టండి: రాజ్‌నాథ్‌ సింగ్‌

ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్‌ యాదవ్‌ కుమారుడు తేజస్వీ యాదవ్‌, కుమార్తె మిశా భారతిపై కేంద్రమంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ పంచులు విసిరారు. 

Published : 15 Apr 2024 00:11 IST

పట్నా: ఆర్జేడీ (RJD) అధినేత లాలూ ప్రసాద్‌ యాదవ్‌ కుమారుడు తేజస్వీ యాదవ్‌ (Tejashwi Yadav), కుమార్తె మిశా భారతిపై కేంద్ర రక్షణశాఖ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ (Rajnath Singh) తీవ్ర విమర్శలు గుప్పించారు. జైలుకు వెళ్లిన వారు, బెయిల్‌పై వచ్చినవారు ప్రధాని నరేంద్రమోదీ (PM Modi)ని కారాగారానికి పంపడం గురించి మాట్లాడుతున్నారంటూ రాజ్‌నాథ్‌సింగ్‌ మండిపడ్డారు. మిశా భారతిని ఉద్దేశిస్తూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.

ఎలాంటి సందేశం ఇవ్వాలనుకుంటున్నారు?

కొందరు ఆర్జేడీ నేతలు ఒక వర్గాన్ని ఆకర్షించేందుకే నవరాత్రుల సమయంలో చేప తింటున్న వీడియోను పోస్టు చేశారని ఆరోపించారు. ‘‘మీరు నవరాత్రుల వేళ చేప తిన్నారు. ఈ వీడియో పోస్టు చేసి ఎలాంటి సందేశం ఇవ్వాలనుకున్నారు? ఏనుగు, గుర్రం, పక్షులు ఇలా ఏది కావాలంటే అది తింటారు. దాన్ని అందరికీ ప్రదర్శించాల్సిన అవసరం ఏముంది?ఇదంతా కొందరు ఓటర్లను ఆకర్షించేందుకు చేసే ప్రయత్నమే. ఇలాంటి చర్యలకు పాల్పడుతున్న వారిని దారిలో పెట్టాలని లాలూజీని కోరుతున్నా’’ అని బిహార్‌లోని జమాయిలో జరిగిన పార్టీ సమావేశంలో ఆయన వ్యాఖ్యానించారు.

దక్షిణ భారత్‌కూ బుల్లెట్‌ రైలు.. త్వరలో సర్వే : ప్రధాని మోదీ

లాలూ కుమార్తె మిశా భారతి ఇటీవల మీడియాతో మాట్లాడుతూ.. రానున్న ఎన్నికల్లో ‘ఇండియా’ కూటమి అధికారంలోకి వస్తే ప్రధాని సహా భాజపా నాయకులను జైల్లో పెడతామంటూ వ్యాఖ్యానించడంపై కేంద్రమంత్రి తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. జైలుకు వెళ్లిన వారు, బెయిల్‌పై వచ్చినవారు మోదీని జైలుకు పంపడం గురించి మాట్లాడుతున్నారని విమర్శించారు. మోదీ మూడో సారి ప్రధాని కానున్నారని ప్రపంచమంతా చెబుతోందన్నారు. వచ్చే ఏడాదిలో జరగనున్న కార్యక్రమాలకు ఇప్పటికే విదేశాలు మోదీని ఆహ్వానించడం ప్రారంభించాయన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని